బ జాకీ పరిశ్రమ వెళ్లిపోవడంపై ఆవేదన
బ ప్రజారోగ్యాన్ని పాడెక్కించిన జగన్ రెడ్డి
బ అందుకే ఆయన పేరు రివర్క్ రెడ్డి
బ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ వరుస ట్వీట్లు
బ టిడిపి అధినేత చంద్రమాబునాయుడు ఆగ్రహం
అమరావతి: రాష్ట్రం లో తాజాగా నెలకొన్న పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలపై టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబునాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. పత్రికల్లో వచ్చిన వివిధ ఘటనలపై చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లా లో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు పడ్డాయంటూ విరుచుకుపడ్డారు. వైసిపి స్థానిక నేతలు సమాధులను తవ్వేసి స్మశానాన్ని కబ్జా చేస్తే…అధికారులంతా ఏం చేస్తున్నారు? వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి. కనీసం ఉన్నతాధికారు లు అయినా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కబ్జా దారులపై చర్యలు చేపట్టాల్సిందని అన్నారు.
పాలకుడు రాక్షసుడైతే..
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అంటూ రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ తరలిపోయిన అంశంపై టిడిపి అధి నేత మరో ట్వీట్ చేశారు. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు పరిశ్రమలు తెచ్చిన మేమా…లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదే కదా రివర్క్ పాలన అంటే!
పశ్చిమ గోదావరిజిల్లా నర్సా పురంలో సిఎం పర్యటన సంద ర్భంగా చెట్లు నరికివేత చర్యల ను చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశాం. కానీ సీఎం వస్తున్నారని భారీవృక్షాలను…అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు… చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే. నువ్వు జగన్ రెడ్డి కాదు…రివర్స్‌రెడ్డి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పాడెక్కించేశారు!
ఏపీలో ప్రజారోగ్యాన్నిఈ ప్రభుత్వం పాడెక్కించిం దని చంద్రబాబునాయుడు తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం తో నడిరోడ్డుపై మహిళ ప్రసవించింది.నేడు కుప్పంలో కవలలకు జన్మనిచ్చిన బాలింతకు చికిత్స అందించ కుండా ఆసుపత్రుల వెంట తిప్పిచివరకు తల్లితో పాటు ఒక శిశువు ప్రాణం కూడా తీశారు. కుప్పంలో సైతం ఆస్పత్రుల వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే ఈ దారు ణానికి కారణం. కుప్పాన్ని పులివెందులలా చూసు కోవడం అంటే ఇదేనా అంటూ సిఎం జగన్‌కు చురకలు వేశారు.