- నదిని ఆనుకుని ఉన్న ఊట బావిని కబళించాడు
- ప్రశ్నించినందుకు తమపై దాడికి యత్నించాడు
- ప్రజావినతుల్లో నీలంరాజుపేట వాసి ఫిర్యాదు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయానికి బుధవారం సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీదారులు పోటెత్తారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం నీలంరాజుపేట గ్రామానికి చెందిన మురళి సమస్యను వివరిస్తూ చంపావతి నదిని ఆను కుని ఉన్న ఊటబావి పక్కన వైసీపీ నేత మైపాడు ప్రసాద్ అర్థరాత్రి సమయాల్లో అక్ర మంగా ఇసుకను తరలిస్తుండటంతో నీటి నిల్వలు పడిపోయి గ్రామాల్లో తాగునీటి సమ స్య ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బావి ద్వారా 11 గ్రామాలకు తాగునీరు అందుతుంది.. అక్రమ ఇసుక తవ్వకాన్ని ప్రశ్నించినందుకు తమపై దాడికి వచ్చాడని తెలిపారు. ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అర్జీల స్వీకరణ కార్యక్ర మంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పాల్గొన్నారు.
` తమ గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తి చనిపోతే అతని మరణానికి తనకు సం బంధం ఉందంటూ తనను అక్రమ అరెస్టు చేసి చేయని తప్పుకు 58 రోజులు జైల్లో పెట్టారు..దీనిపై సీఐడీతో విచారణ చేయించి అక్రమ అరెస్టు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. తన పొలంలోని పంటను ధ్వంసం చేసి రూ.10 లక్షల ఆస్తి నష్టం కలిగించిన వారిపై కూడా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కర్నూలు జిల్లా పత్తి కొండ మండలం హోసూరుకు చెందిన బోయ రామాంజనేయులు విజ్ఞప్తి చేశాడు.
` ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో తమకు భూమిని కబ్జాదారులు ఆక్రమించి సాగు చేసుకోగా కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చాం.. అయినా కబ్జాదారులు భూమిని దున్ని సాగు చేసుకుంటున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సునిపెంటకు చెందిన ఆర్.డి.ప్రకాష్ అనే ఫిర్యాదు చేశాడు.
` గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది..సర్‌ప్లస్ స్టాఫ్ పేరుతో తాము చేస్తున్న ఉద్యోగ ప్రాంతాల నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేశారు..నేటికీ తమను స్వస్థానాలకు బదిలీ చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తమ సమస్యను పరిష్కరించాలని ప్రగతిశీల మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు.
` గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి మాట్లాడినందుకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది..11వ పీఆర్సీ ప్రకారం పెరగాల్సిన 23 శాతం జీతం పెంపుదలను అడ్డుకుంది..తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని పలువురు సీఆర్‌ఎమ్ టీచర్లు వినతిపత్రం అందజేశారు.