- అది జీర్ణించుకోలేకే సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు
- దమ్ముంటే చంద్రబాబుపై ఫిర్యాదు చేసుకోవచ్చు
- సొంత పత్రికలో ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు
- సాక్షిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు
- తప్పడు రాతలకు, వైసీపీ నేతల తప్పుడు పనులకు గుణపాఠం తప్పదు`
అమరావతి(చైతన్యరథం): సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిపౖౖె ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం, వైసీపీ నేతలు ఓటమి తప్పదనే నిస్పృహలో ఉండటంతో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు జగన్‌రెడ్డి సొంత పత్రిక సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలకు పూనుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే వైసీపీ నేతలు పూర్తిగా దిగజారిపోయారనిపిస్తోందని విమర్శించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాత్రిని పగలు… పగలుని రాత్రి అని రాయడం ఎంత అబద్ధమో ఆ విధంగానే రాస్తున్నారు. చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు రాకుండానే వచ్చినట్లు తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. చంద్రబాబు హైదరబాద్‌లో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రావాల్సి ఉండగా ఆనారోగ్యంతో ఆయన రాలేదు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఐఏఎస్ కృష్ణయ్య, మాజీ సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్, నేను ఆ సమావేశంలో పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేసి, వారి సందేహాలను నివృత్తి చేశాం. వాస్తవం ఆ విధంగా ఉంటే ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడినట్లుగా సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాయటం వారి నీచ మనస్తత్వానికి నిదర్శనమని అశోక్‌బాబు దుయ్యబట్టారు.
దిగజారుడు రాతలు
వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని, అడ్డగోలుగా వాదించి తిరగబడమని సజ్జల చెప్పడం ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సజ్జల మీద టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్‌ఐర్ రిజిస్టర్ చేయటం వైసీపీ నేతలకు మతిభ్రమించింది. దానిని తట్టుకోలేక సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇంతకంటే దిగజారుడు తనం లేదు. సజ్జలకు దమ్ముంటే చంద్రబాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. సజ్జల పతనం మొదలయింది. వైసీపీ ఇక ఉండదని జగన్‌కు కూడా అర్థం అయ్యింది. ఆయినా వైసీపీ నేతలలో మాత్రం ఇంకా మార్పు రాలేదు.. జూన్ 4 తరువాతే వారిలో మార్పు మొదలవుతుందని అశోక్‌బాబు అన్నారు.
ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు
సాక్షిమీద ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాం. చంద్రబాబు నాయుడు హాజరు కాని సమావేశానికి ఆయన వచ్చి మాట్లాడినట్లు రాయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోకటి లేదు. కచ్చితంగా వైసీపీ నేతలు ప్రతి పాపానికి మూల్యం చెల్లించుకుంటారు. టీడీపీ నేతలను పెట్టిన ఇబ్బందులకు తప్పకుండా గుణపాఠం ఉంటుంది. చేతిలో పత్రిక ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు. ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసుకుని శ్రేణులు చేజారకుండా కాపాడుకోవాలని చూస్తున్నారని అశోక్‌బాబు తప్పుబట్టారు.
దర్యాప్తు ప్రారంభమయింది: గూడపాటి
న్యాయవాది గుడపాటి లక్ష్మీణారాయణ మాట్లాడుతూ సజ్జలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆధారాలతో సహా ఫిర్యాదు ఇచ్చామన్నారు. దాని ఆధారంగా తాడేపల్లి స్టేషన్ ఆఫీసర్ ఆర్పీ యాక్ట్ 153ఏ, 505 క్లాజ్ 2, 125 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సాక్ష్యాల కోసం మాకు ఫోన్ చేసి మా నుండి వాంగ్మూలం కూడా తీసుకున్నారని తెలిపారు.