అమరావతి: అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైసీపీ నేతలు, మంత్రులు పనిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ ప్రయో జనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సర్వోన్నత న్యాయం స్థానం ఇచ్చి న తీర్పుకు కూడా మంత్రులు, వైసీపీ నేతలు వక్రభాష్యం చెబుతు న్నారని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విషం చిమ్మడం వైసీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. స్కిల్ డెవలప్మెంట్ కేసు లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చీఫ్ జస్టిస్ కు నివేదిస్తే దాన్ని కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అరెస్టు జరిగిన ఈకేసులో 17ఏ పై న్యాయమూర్తులు తమ అభిప్రాయా లు చెప్పారు. అయితే దీన్ని తప్పుదోవ పట్టించేలా, న్యాయస్థానం తీర్పునూ వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. ఈ కేసు పూర్తిగా 17 ఏ వర్తిస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి సాగింది. కేసు మూలాలు,ఇతరఅంశాలు ఏవీ ఈతీర్పులో చర్చకు రాలేదు, ప్రస్తా వించలేదు. నీలి మీడియా ద్వారా వైసీపీ చేస్తున్న హడావుడి చూ స్తుంటే…తాము దేన్నైనా మార్చి చెప్పగలం అన్నట్లుగా అధికార పార్టీ పోకడలు ఉన్నాయి.
చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసుల్లో ఇప్పటికీ ఒక్క ఆధారం చూపలేదు.ఛార్జిషీట్లు వేయలేదు. హైకోర్టు బెయిల్ ఉత్వర్వుల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది. అటు ప్రజలు, ఇటు న్యాయ స్థానాలు నమ్మకపోవడంతో…తమ దైన ఫేక్ ప్రచారాలకు వైసీపీ దిగినట్లు అర్థమౌతోంది. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో నిధుల దుర్వినియోగం అయినట్లు కానీ…ఆ నిధు లు వేరే దగ్గరకు చేరినట్లు కానీ ఇప్పటికీ నిరూపించలేక పోయా రు. కేవలం రాజకీయకక్షతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలి… రాజకీ యంగా నష్టపరచాలి అనే ప్రయత్నం తప్ప, అవి నీతి లేదని జనం నమ్మారు. రూ.43వేల కోట్ల అవినీతిలో కూరుకుపోయి, 3,500 వాయిదాలతో రోజులు నెట్టుకొస్తున్న జగన్ అండ్టీం… చంద్ర బాబుని దోషిగా చూపే ప్రయత్నం ఎన్నటికీ ఫలించదు. దీనికి వాళ్ల జీవితకాలం కూడా సరిపోదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.