- జగన్‌రెడ్డి సేవలో తరిస్తున్న మేరుగ నాగార్జున
- సొంత సామాజికవర్గ ఎమ్మెల్యేని గౌరవించలేని మంత్రి
అమరావతి: వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టు కోవాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్. రాజు హెచ్చరించారు. మంత్రి మేరుగ నాగార్జున జగన్‌రెడ్డి సేవలో తరిస్తున్నాడని గురువారం ఆయన ఒకప్రకటనలో మండిపడ్డారు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని గౌరవించలేనిస్థితిలో మంత్రి మేరుగ ఉన్నారన్నారు. శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన సాంఘిక సంక్షేమ శాఖామంత్రి విచక్షణ కోల్పోయి మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. మంత్రి మేరుగ నాగార్జున ఏపీ స్టడీ సర్కిళ్లపై సమాధానం చెప్పలేక సొంత సామాజిక వర్గానికి చెందిన కొండేపి శాసన సభ్యుడు బాలవీరాంజనేయస్వామిపై వ్యక్తిత్వ హననా నికి పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని మండిప డ్డారు. సీఎంను మెప్పించడానికి సాటి దళిత నాయకుడిని పట్టుకుని దళితుడికే పుట్టావా అని అనడం దళిత తల్లులను అవమానించడమేనన్నారు. వైసీపీ నాయకు లు, మంత్రులు విచక్షణ కోల్పోయి తల్లులను, స్త్రీలను అవమానించడం అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి కూడా తమ అధినేత చంద్రబా బునాయుడి మాతృమూర్తిపై అనుచితవ్యాఖ్యలు చేసి, తర్వాత క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. ఇదే వారసత్వం వైసీపీ మంత్రులు అందిపుచ్చుకున్నారన్నారు. కొడాలి నాని మొదలుకుని.. వల్లభనేని వంశీ, ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్ లాంటి అనేక మంది వైసీపీ నేతలు తల్లుల ను, మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వాళ్లకు సీఎం జగన్ రెడ్డి పూర్తి మద్దతు పలకడం ఆయన విచక్షణకే వదిలే స్తున్నామన్నారు. నిండుసభలో సాటి దళిత ఎమ్మెల్యే తల్లిని అవమానించేలా మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జునను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దళిత జాతి కి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.