- పల్నాడు, నంద్యాల ఎస్పీలు, తిరుపతి కలెక్టర్ కోడ్ ఉల్లంఘిస్తున్నారు
- వెంటనే చర్యలు తీసుకోవాలి
- సీఈఓకు కూటమి నేతల ఫిర్యాదు
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ముకేష్ కుమార్ మీనాకు కలిసి ఫిర్యాదు అందజేశారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ… కొంతమంది ప్రభుత్వ అధికారులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్రతిపక్షనేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదు. పల్నాడు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించి కానుకగా ఇస్తానని జగన్‌కి ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రమాణం చేశారని స్ధానిక ప్రజలు అనుకుంటున్నారు. నంద్యాల ఎస్పీకీ ఈసీ చివాట్లు పెట్టినా అతని వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. నంద్యాల జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై ఎన్ని దాడులు జరిగినా ఎస్పీ పట్టించుకోవటం లేదు. మరోపక్క తిరుపతి కలెక్టర్ వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. వీరందరిని తొలగించాలని ఈసీని కోరాం.
ఈ నెల 5వ తేదీ లోపు లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశించాలని సీఈవోను కోరాం, చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే పింఛన్లు రావని సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేయాలని కోరాం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆగమేఘాలపై మంగళగిరి మున్సిపాలిటికి రూ.70 కోట్లు విడుదల చేస్తూ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలి టీలపై లేని ప్రేమ ప్రత్యేకంగా మంగళగిరి మున్సి పాలిటీపై ఎందుకు? ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు? ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. మంగళగిరిలో టీడీపీ యువనేత లోకేష్ గెలుపు ఖాయ మైంది, అందుకే వైసీపీ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోంది. తొలగించిన 440 మంది వాలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. చర్చిలు, దేవాల యాల్లో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించ టం ఎన్నికల కోడ్ ఉల్లంఘించటమే. గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి ఓ గ్రామంలోని చర్చిలో ప్రచా రం నిర్వహించారు. మతం పేరుతో ఓట్లు అడిగారు. వీరిపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరాం. మేం ఫిర్యాదు చేసిన అన్ని అంశాలపై సీఈవో సానుకూలం గా స్పందించి వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటా మని చెప్పారని వర్ల రామయ్య తెలిపారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలన్న జగన్‌రెడ్డి ఆశలు అడియా శలు కాక తప్పదని, ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు, ప్రలో భాలకు పాల్పడ్డా వైసీపీకి ఓటమి తప్పదని ఆయన అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఇక జగన్ ఆటలు సాగవని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లా డుతూ… కొంతమంది వైసీపీ నేతలు బూతుల సంస్కృ తితో, బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పల్నాడు, నం ద్యాల ఎస్పీలు, చిత్తూరు జిల్లా కలెక్టర్లలపై ఈసీకి ఫిర్యా దు చేశాం. ప్రభుత్వం పించన్ల పంపిణీకి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. పించన్లు సకాలంలో ఇవ్వకుంటే ప్రజాందోళనలు చేస్తామని ఉమామహేశ్వరరావు అన్నారు. నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ…. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నోటికొచ్చినట్టు బూతులు తిడు తూ టీడీపీ నేతలను, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. టీడీపీకి ఓటేస్తే చంపేస్తామని బహిరంగం గా బెదిరిస్తున్నాడు. బ్రహ్మనాయుడుపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. కొంతమంది పోలీసులను ఉప యోగించి వినుకొండ,మాచర్ల నియోజకవర్గాల్లోని కొన్ని బూత్‌ల్లో రిగ్గింగ్ చేసుకునేందుకు వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ ప్రాంతాల్లో పోలీస్ బందో బస్తు పెంచటంతో పాటు వెబ్ కెమెరాలు ఏర్పాటుచేసి ఎన్ని కలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీని కోరా మని జీవీ ఆంజనేయులు అన్నారు.సీఈసీని కలిసినవా రిలో టీడీపీపొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ భాజీ, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేతలు చిట్టిబాబు,బండారు వంశీ,తదితరులు ఉన్నారు.