- మంత్రి పెదిరెడ్డి, ఎంపీ గురుమ్మూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డిలను పోటీకి అనుర్హులుగా ప్రకటించాలి
- చిన్న స్థాయి అధికారులతోపాటు పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర ఎన్నికల సంఘంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన టీడీపీ మాజీ మంత్రి కే.ఎస్. జవహర్
అమరావతి, చైతన్యరథం: రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ,ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా స్వామ్య హననానికి పాల్పడుతున్న వైసీపీ గుర్తిం పును తక్షణమే రద్దు చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కెఎస్ జవహర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరా రు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అధికారపార్టీ తీరుపై ఎందుకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న ఏపీ ఎన్నికల సంఘంపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని డిమాండ్‌చేశారు.
కంచే చేనుని మేస్తున్నట్లు ప్రభుత్వం, అధికారులే తప్పులు చేస్తుంటే రాష్ట్రంలో ఇక ప్రజల స్వేచ్ఛకు రక్షణ ఎక్కడ ఉంటుందని, ఎన్నికల గొప్పతనం, ఓటువిలువ, ఓటు హక్కుకిఉండే ప్రాధాన్యత ప్రజలకు తెలియాలంటే తప్పు చేసిన అధికారుల్ని కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే శిక్షించాలని కోరారు.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి,అనంతపురం డీఐజీ లాంటి అధికారుల్ని..పూర్తిగా ఎన్నికలకు దూరం చేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల కమి షన్ తక్షణమే స్పందించాల్సిన విధంగా స్పందిస్తే ఇకపై ఎవరైనా తప్పుచేయాలంటే వెనకాడతారన్నారు. పెద పెద్ద తిమింగలాల్ని వదిలేసి చిన్నచిన్న చేపల్ని శిక్షించి నందువల్ల ఉపయోగం ఉండదనే వాస్తవాన్ని కూడా కేంద్రఎన్నికల సంఘం గ్రహించాలన్నారు.
మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టు కొని,వ్యవస్థల ద్వారాలబ్ధిపొందేందుకు జగన్‌రెడ్డి చేయా ల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడన్నారు.చివరకు ఎన్నికల వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి అధికార యంత్రాంగా న్ని భ్రష్టుపట్టించాడని, ఓటర్లను.. అధికారుల్ని ప్రభా వితం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తహతహ లాడుతున్నాడని,దేశంలో గతంలో ఏ నాయకుడు చేయ ని విధంగా ఓటర్ల జాబితాను జగన్‌రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అధికారుల లాగిన్ ఐడీతో ఓటర్ కార్డుల్లో మార్పులుచేర్పులు చేయించిన జగన్ రెడ్డి నిర్వాకంతో చివరకు అధికారులు బలైపోతున్నార ని, గతంలో తిరుపతి ఎంపీ ఉపఎన్నికల్లో జగన్‌రెడ్డి, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సాయంతో చేయాల్సిన అక్రమాలన్నీ చేశారని తెలిపారు.
ఇప్పుడు మరలా అదే తిరుపతి అసెంబ్లీ పరిధిలో మంత్రి పెద్ది రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల తాముచేసే తప్పులకు అధికారుల్ని బలిపశువుల్ని చేయ బోతున్నారని అన్నారు.
మంత్రిపెద్దిరెడ్డి, గురమ్మూర్తి, చెవిరెడ్డిలను పోటీకి అనర్హులుగా ప్రకటించాలి
ఎన్నికల తంతుని అపహాస్యం చేస్తున్న వైసీపీ ఎంపీ గురుమూర్తి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలాంటి కొందరు ప్రజాప్రతినిధులు, వారికి సహకరి స్తున్న అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన కళ్లప్పగించిచూస్తుంటే అధికారంలో ఉన్నామన్న అహం కారంతో వారు పేట్రేగిపోతున్నారన్నారని, వారు తమ కు అండగా ఉన్నారన్న ధైర్యంతో అధికారులు కూడా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అన్నారు. మంత్రి పెద్ది రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటిం చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఎన్నికల సంఘం కార్యాలయంలో పనిచేయడమేంటి?
గతంలో మంగళగిరి తహసీల్దార్‌గా పనిచేసిన రామ్ ప్రసాద్.. నేడు ఎన్నికల సంఘం కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేయడం ఏమిటని జవహర్ ప్రశ్నించారు. ఆరోపణలున్న ఇలాంటి వారే కీలకస్థానాల్లో మరీ ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఎలా విధులు నిర్వహిస్తున్నారో ప్రభుత్వం, ఎన్నికల సంఘమే చెప్పాలన్నారు. ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ రెడ్డికి సహకరిస్తున్న అధికార యంత్రాంగంపై, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు తటపటాయిస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వైఖరితో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన వారికి కీలక పదవులు
ప్రభుత్వాధికారుల లాగిన్ ఐడీలతో నియోజక వర్గాల్లో జగన్ పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తమకు ఉన్న అధికారాలను, స్వేచ్ఛను అధికారపార్టీకి ధారాధత్తం చేసి వ్యవస్థలను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని, వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఎన్నికల సంఘం కూడా ఉపేక్షిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడి, తన వాళ్లను గెలిపించిన తన పార్టీ వారికి, అధికారులకు ముఖ్యమంత్రి కీలక పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలకు పాల్పడినందుకు గాను, జగన్ రెడ్డి ఆయన్ని టీటీడీ ఛైర్మన్ ని చేశాడని, తప్పులు చేసేవాళ్లను ముఖ్యమంత్రే కాపాడుతుంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా అని జవహర్ ప్రశ్నించారు.
ఎన్నికల తంతుని అపహాస్యం చేస్తున్న వైసీపీ ఎంపీ గురుమూర్తి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలాంటి కొందరు ప్రజాప్రతినిధులు, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంకోచిస్తున్నారు. ఆయన కళ్లప్పగించి చూస్తుంటే అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వారు పేట్రేగిపోతున్నారు. వారు తమకు అండగా ఉన్నారన్న ధైర్యంతో అధికారులు కూడా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.