- తక్షణం అక్కడనుంచి మార్చేయాలి
- ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు
- ఈవీఎంలు భద్రపరిచేది వైసీపీ నేతల కాలేజీల్లోనా
- దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ నేత షరీఫ్ లేఖలు
అమరావతి: వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారిని ఎన్నికల సమయంలో దొడ్డిదారిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలోకి బదిలీ చేయటంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే విధంగా ఓటర్ల తుది జాబితాలో అనేక అవకతవకలు కనిపిస్తున్నాయన్నారు. మృతుల ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. డబుల్‌ఎంట్రీలు, దొంగ ఓట్లు పెద్దసంఖ్యలో ఉన్నాయన్నారు. శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లు తొలగించలేదన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కు వేరువేరుగా ఐదు లేఖలను షరీఫ్ రాశారు.
గుంటూరు జిల్లా, మంగళగిరి మండల తహసిల్ దార్ జీవీ రామప్రసాద్‌ను సీఈఓ ఆఫీస్‌లో పనిచేసేలా ఏపీ టూరిజం అథారిటీలో డిప్యూటేషన్‌పై బదిలీ చేశా రని లేఖలో తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో రామప్రసాద్ తహసిల్‌దార్‌గా ఎన్నికలకు సంబంధిం చిన వ్యవహారాలు చూశారు. ఆ సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసి ఎన్నికల నియమావళిని రామ ప్రసాద్ యథేచ్ఛగా ఉల్లంఘించారు. స్థానిక మంగళ గిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రామప్రసాద్ వ్యవహార శైలిపై నాడు అభ్యంతరాలు సైతం తెలియ జేశారు. సి.ఆర్.డీ.ఏ పరిధిలోని అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడంలో రామప్రసాద్ కీలకంగా వ్యవహరించారు.ఇటువంటి నేపధ్యం ఉన్నవ్యక్తిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో పనిచేసేం దుకు నియమించడం దుర్మార్గం. కావున రామప్రసాద్ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని షరీఫ్ కోరారు.
ఓటర్ల జాబితాల్లో తప్పులు
ఓటర్ల తుది జాబితాలో ఇప్పటికీ అనేక అవకతవక లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రగిరిలోని కావమ్మ గుడి వీధి, తిరుపతి, తిరుపతి అర్బన్ ప్రమీల స్టోర్స్ వీధి, తిరుపతి రూరల్ బాలకృష్ణాపురం, సేరూరు రిక్షా కాలనీ, తిరుపతి ఇస్కాన్ రోడ్డు, చినగొట్టిగళ్లు ఫాతిమా నగర్, తిరుపతి అర్బన్ సాయికృష్ణా రెసిడెన్సీ కాలనీ, ముత్యాలరెడ్డి పల్లె, తిరుపతి రూరల్ ఆవిలాలలోని అనేక బూత్‌లలో అవకతవకలు ఉన్నాయి. పుంగనూరు అసెంబ్లీలోని పుంగనూరు మండలం, నగరి నియోజక వర్గం పుత్తూరు మండలంలో సైతం స్థానికులు కానివా రికి ఓట్లు కల్పించారు. విజయవాడ సెంట్రల్, విజయ వాడ తూర్పు నియోజకవర్గాలలోని అనేక బూత్‌లలో చనిపోయిన వారికి ఓట్లు ఉన్నాయి. డబుల్ ఎంట్రీలు సైతం పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. చిలకలూరిపేట, నర సారావు పేటలలోని అనేక బూత్‌లలో సైతం ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయి.
స్థానికులు కానివారికి ఓట్లు
నగరి అసెంబ్లీలోని చౌటూరు గ్రామ బిఎల్‌ఓ తేజశ్విని 19 మంది స్థానికులు కాని మహిళలకు ఓట్లు చేర్పించారు. దీనిపై చిత్తూరు జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పిర్యాదు కూడా చేశారు. 19 మంది స్థానికేతర మహిళల జాబితాను లేఖకు జతచేశారు.అనర్హులైన 19మంది మహిళల ఓట్లు తొల గించేలా చిత్తూరు జిల్లా కలెక్టరుకు, నగరి ఆర్డీవోకు, పుత్తూరు కమిషనర్‌కు, తహసిల్‌దార్‌కు ఆదేశాలు జారీ చేయాలని షరీఫ్ కోరారు.
వైసీపీ నాయకుల కాలేజీల్లో ఈవీఎంలా?
2024 సాధారణ ఎన్నికల్లో పోలింగ్‌కు ఉపయో గించిన నంద్యాల పార్లమెంటుకు చెందిన 7 నియోజక వర్గాల ఈవీఎంలను భద్రపరచడానికి పాణ్యంకు దగ్గర లోని శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్.జీ.ఎం ఇంజనీరింగ్ కాలేజీలను ఎంపికచేశారు. పైరెండు కాలే జీల యాజమానులు నంద్యాల జిల్లాకు వైకాపా నాయ కులే. శాంతిరామ్ కాలేజీ యజమాని అధికార పార్టీ వైసీపీ తరపున నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పై రెండు కాలేజీలను టీడీపీ నాయకుల బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితి ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కావునపై రెండు కాలే జీల్లో ఈవీఎంలను భద్రపరచాలనే నిర్ణయం వెనక్కు తీసుకుని వేరే చోట్లకు మార్పు చేయాలి. వేరే చోట్లకు మార్పుచేసే సమయంలో జిల్లాలోని సున్నితమైన రాజ కీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని షరీఫ్ విజ్ఞప్తి చేశారు.