- గణాంకాలతో సహా శాసనమండలి ముందుకు
- అసహనంతో ఊగిపోయిన వైసిపి మంత్రులు
- పేదవాడికి రూపాయి ఇచ్చి రూ.3 లాగేస్తున్నారు
- జగన్ రెడ్డి సంక్షేమం వెనుక అసలు రహస్యం ఇదే!
- శాసనమండలిలో రసవత్తరంగా, సుదీర్ఘంగా చర్చ
అమరావతి : వైసిపి ప్రభుత్వం గత మూడేళ్లుగా మరే పనులు చేయకుండా కేవలం సంక్షేమం మీదనే నెట్టు కొచ్చిం ది.. వాస్తవానికి వైసిపి సంక్షేమం ఒక నీటిబుడగ.. దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో నేను గౌరవ సభ ముందు ఉంచుతున్నానంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి శాసనసభలో జగన్‌రెడ్డి సంక్షేమం వెనుక అసలు గుట్టువిప్పారు. వాస్తవానికి సంక్షేమం పేరుతో ఇస్తున్నది రూపాయి అయితే పేదవాడి నుంచి ధరల పెంపు, పన్నుల పెంపు, వివిధ వడ్డనల రూపం లో లాక్కుంటున్నది 3 రూపాయలంటూ వైసిపి ప్రభుత్వ సంక్షేమం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బట్ట బయలు చేశారు. వైసిపి సంక్షేమం అసలు రంగును తెలియజేస్తూ దీపక్‌రెడ్డి ఒక్కొక్కటిగా వదిలిన బాణాల కు వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కకావికలమయ్యా రు. తీవ్ర అసహనం, ఆగ్రహంతో దీపక్‌రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగులుతూ వాస్తవాలను పెద్దల సభ ముందుకు తేకుండా చేసేందుకు విఫలయత్నం చేశారు. అయతే దీపక్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సభ ముందుంచడంతో వైసిపి ప్రజా ప్రతినిధులు క్లీన్ బౌల్డ్ అయ్యారు.
సంక్షేమంపై ఎవరెంత ఖర్చుచేశారు?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమంపై బడ్జెట్ కేటాయింపుల్లో గరిష్టంగా 40శాతం ఖర్చు చేయగా, వైసిపి ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో గరిష్టంగా 28 శాతం మాత్రమే ఖర్చుపెట్టారు. టిడిపి ప్రభుత్వం తొలి మూడేళ్లలో సంక్షేమంపై 2లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే.. మూడు సంవత్సరాల మూడునెలల్లో 1.65 లక్షల కోట్లు ఖర్చుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని 19పథకాలను కూడా అమలుచేసి 11వేల కోట్లు అదనంగా ఖర్చుచేసింది. గతమూడేళ్లలో వైసిపి ప్రభుత్వం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్‌ప్లాన్ నుంచి 30వేల కోట్లు పక్కదారి పట్టించింది. వైసిపి ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వమా, జగన్ దళిత ద్రోహి.. నేను ప్రశ్న మాత్రమే వేస్తున్నా. ఈ సమయంలో మంత్రి మేరుగ నాగార్జున అడ్డుతగులుతూ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆక్రోశిం చారు. ఈ సమయంలో దీపక్‌రెడ్డి మాట్ల డుతూ సున్నితమైన మనసులు వారి హృదయాలు గాయ పర్చను. కేవలం ప్రశ్నలు మాత్రమే లేవనెత్తుతున్నానని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితుల కోసం అమలుచేసిన 18పథకాలను ఈ ప్రభుత్వం రద్దుచేసింది. దాని అర్థమేంది? ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ లో వేలకోట్లు ఎందుకు దారిమళ్లించారు, వారికి కేటాయించిన నిధులు వారి
సంక్షేమానికి ఎందుకు ఖర్చుపెట్టలేదు?
టిడిపి హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రూ.40వేల కోట్లు
టిడిపి ప్రభుత్వం అయిదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లో టిడిపి 40వేల కోట్లు పైగా ఖర్చుపెట్టింది. అప్పుడు ఎస్సీ, ఎస్టీ కమిటీల ద్వారా పథకాల అమలుతీరును సమీక్షించాం. ఇప్పుడు అలాంటిదేమీ కన్పించడం లేదు. 2020-21 సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ లో 7,525 కోట్లు పక్కదారి పట్టించారు.. సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అమరావతిలో అంబేద్కర్ ను గౌరవిస్తూ పార్కు, భారీ విగ్రహాన్ని మంజూరుచేస్తే వాటిని ఎందుకు రద్దుచేశారు. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ సమయంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఉషశ్రీ చరణ్ అడ్డుతగిలారు. చైర్ అనుమతితో దీపక్ రెడ్డి తమ ప్రసాంగాన్ని కొనసాగిస్తూ ఎందుకు కంగారు పడుతున్నారు. నన్ను మాట్లాడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గాలి బుడగ పగులుతుందని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
దళితులపై లెక్కలేనన్ని అత్యాచారాలు!
ఈ రాష్ట్రంలో గత మూడున్నరేళ్లలో దళితులపై అరాచకాలు, దమనకాండ పెరిగిపోతున్నాయి. ముఖ్య మంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగ మ్మ హత్యచారానికి గురైంది. విశాఖలో డాక్టర్ సుధా కర్ జగన్ ప్రభుత్వ దాష్టీకానికి బలయ్యారు. అమరావ తిలో దళితులైనే ఎస్సీ, ఎస్టీ కేసులుపెట్టారు. దళిత జడ్జి రామకృష్ణను తీవ్రంగా వేధించారు. ఇదివరకెన్న డూ లేనివిధంగా దళితులపై దాడులు కొనసాగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పథకాలకు అర్హులు ఎందరు – ఇస్తున్నది ఎంతమందికి?
రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమం అమలుచేస్తున్నా మని జగన్మోహన్‌రెడ్డి ఫుల్ పేజి ప్రకటనల్లో ఊదర గొడుతున్న ప్రచారం వాస్తవంకాదు.రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు అర్హులు ఎంతమంది, వాస్తవ లబ్ధి దారులు ఎందరు అనే విషయాన్ని ఇప్పుడు నేను సభ ముందు ఉంచుతున్నాను. నాయిబ్రాహ్మణులు 5.5 లక్షల మంది ఉంటే 38వేల మందికి, రజకులు 15 లక్షల మంది ఉంటే 82,347మందికి, టైలర్లు 13 లక్షల మంది ఉంటే 1.25 లక్షల మందికి, మత్స్యకా రులు 20లక్షలమంది ఉంటే 1.09వేలమందికి, నేత న్నలు 3.5లక్షలమంది ఉంటే 81వేల మందికి, వాహ నమిత్రకు అర్హులైన వారు 8.6లక్షలమంది ఉంటే 1.67 లక్షల మందికి, చేయూత పథకం కింద అర్హు లు 98లక్షల మంది ఉంటే 24లక్షలమందికి, ఆసరా పథకం అర్హులు 1.03 కోట్ల మంది ఉంటే 78లక్షల మందికి, విద్యాదీవెనలో 16లక్షల మందికిగాను 11 లక్షల మందికి, అమ్మఒడి అర్హులు 80లక్షలు ఉంటే 42లక్షల మందికి, రైతు భరోసా కింద 68లక్షల మం దికి గాను 45లక్షలమందికి, కాపునేస్తం పథకానికి 24లక్షల మందికిగాను 2.32లక్షల మందికి మాత్రమే ఆయా పథకాలు అందిస్తున్నారని దీపక్‌రెడ్డి గణాంకా లతో సహ సభ ముంధుంచారు.
సైంధవుల్లా వైసిపి మంత్రుల అడ్డగింత!
దీంతో బిసి సంక్షేమ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ నేతన నేస్తం గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదన్నారు. దీనిపై తెలుగుదేశం సభ్యులు లోకేష్ తీవ్ర అభ్యంతరం చెబుతూ సభలో తమను మాట్లడవద్దని చెప్పడానికి ఆయనెవరంటూ చైర్‌తో వాగ్వివాదానికి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అమలుచేసిన 72పథకాలను ఈ ప్రభుత్వం రద్దుచేసింది. ఎన్నికల సమయంలో రద్దు చేస్తామని ఎందుకు చెప్పలేదు? రద్దుచేస్తామని చెప్పి ఉంటే ఆయా వర్గాలు ఓట్లువేసేవారు కాదు. ఈ సమా చారం ఎక్కడిదని వైసిపి మంత్రులు ప్రశ్నించగా తమ కు సాక్షి యాడ్ ద్వారా, ఆర్‌టిఐ ద్వారా, వివిధ సంద ర్భాల్లో వైసిపి మంత్రులు ఇచ్చిన ప్రెస్ క్లిప్పింగ్‌ల ద్వారా సేకరించామని దీపక్‌రెడ్డి బదులిచ్చారు. అధికా రికమైన సమాచారాన్ని మాత్రమే సభ ముందుంచా లంటూ మండలి చైర్మన్ ఆదేశించారు. చివరకు మం త్రుల అడ్డంకుల నడుమ దీపక్‌రెడ్డి ప్రసంగాన్ని కొన సాగిస్తూ… అధ్యక్షా.. ఇది లాస్ట్ బాల్, ఈ దెబ్బకు వైసిపి సంక్షేమం బుడగ బద్దలవుతుంది, ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఒకరూపాయి పేదలకు అందిస్తూ వారి వద్దనుంచి పన్నుల భారాలు, నిత్యావసరాల ధర లు, చార్జీల పెంపుతో 3రూపాయలు ప్రజలవద్దనుంచి లాక్కుంటోంది. ఇదే జగన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమం వెనుక ఉన్న అసలు రహస్యమంటూ దీపక్‌రెడ్డి తమ ప్రసంగాన్ని ముగించారు.