అమరావతి: జైలులో చంద్రబాబునాయుడి భద్రతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, తనకు సరైన భద్రత లేదని ఆయనే స్వయంగా చెప్పినా ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవటంలేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు యనమల రామకృష్ణుడు విమర్శించారు. స్కిల్ డెవ లప్‌మెంట్ కార్పొరేషన్‌లో అసలు ఎలాంటి అవినీతి జరగనప్పుడు,చంద్రబాబు తప్పు చేయలేదని తెలిసీ కేవ లం ఆయనపై కక్షతో, ఆయన ఆరోగ్యం దెబ్బతీయడా నికి, ఆయన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్నదురు ద్దేశంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రభు త్వం ఆక్రమంగా అరెస్టుచేసి జైలుకు పంపినట్లు స్పష్టం గా అర్థమవుతోందని యనమల ఆరోపించారు. మంగ ళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబులాంటి నాయకుడి భద్రత, ఆరోగ్యం విషయంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై, జైల్లోని పరిణామాలపై న్యాయ మూర్తి దృష్టి పెట్టాలన్నారు.
రాజకీయ కుట్రకాక మరేమిటి? :
తనకు సరైన భద్రతలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తితో చెప్పాక, న్యాయమూర్తి తగిన భద్రత కల్పించాలని ఆదేశించాక కూడా జైలు అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవ డం రాజకీయ కుట్రకాక మరేమిటి? జైల్లో చంద్రబాబు కి సమీపంలో కూడా ఎవరూ ఉండటంలేదు. జైలుపై గతంలో డ్రోన్ తిరిగింది.దానిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టలేదు. చంద్రబాబు హెల్త్ బులె టిన్ కూడా సక్రమంగా విడుదల చేయడంలేదు. వైద్యు ల సూచనల్ని జైలు అధికారులు ఖాతరు చేయడంలేదు. వైద్యులు ప్రతిరోజు చంద్రబాబుని పరీక్షించాక ఆయన ఆరోగ్య సమాచారం ఎందుకు బహిర్గతం చేయడం లేదు? డాక్టర్లు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టుని కాదని జైలర్ ధృవీకరించిన రిపోర్టుని ఎందుకు మీడియాకు చూపిస్తున్నారు? చంద్రబాబుకి ప్రాణహాని ఉందనే కేంద్రప్రభుత్వం ఆయనకు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించిం ది. ఆ భద్రతను అంచెలంచెలుగా పెంచుకుంటూ పో యింది. చంద్రబాబుకి జైల్లో తగిన భద్రత కల్పించారా లేదా అనేదానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిశీలిం చాలి. చంద్రబాబులాంటి నాయకుడి విషయంలో ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆలోచించాలని ఒక సాధారణ పౌరుడిలా విజ్ఞప్తి చేస్తు న్నామని యనమల అన్నారు.
అధికారం కోసం సొంత బాబాయ్‌ని చంపించిన వ్యక్తికి ఇతరులంటే లెక్కఉంటుందా? :
నానాటికీ చంద్రబాబుకి ప్రజాదరణ పెరగడాన్ని చూసి తట్టుకోలేకనే టీడీపీ అధినేతను జగన్మోహన్‌రెడ్డి అన్యాయంగా జైలుకు పంపాడు.కుట్రలు, కుతంత్రాలు, దురాలోచన గల నాయకుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి, అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేసి ఎన్ని కలకు వెళ్లాలనుకుంటున్నాడు. గతంలో కంబోడియాలో ఇలానే జరిగిందని చెప్పుకున్నాం. సొంత బాబాయ్‌ని అధికారం కోసం చంపించిన వ్యక్తికి ప్రతిపక్షాలన్నా.. ప్రధాన నాయకులన్నా లెక్క ఉంటుందా అని యనమల ప్రశ్నించారు.
వేలకోట్ల అవినీతి జరిగిందన్నవారు..ఇప్పుడు టీడీపీ సభ్యత్వ రుసుముని అవినీతి సొమ్ముగా చూపిస్తున్నారు
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు అనేది కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని వారి నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి తీసుకొచ్చిందే. గతంలో మానవమేధస్సు మీదే పారిశ్రామిక రంగం ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు అంతా సాంకేతిక పరిజ్ఞానం.. రోబోటిక్స్ సైన్స్ వంటివి పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతలో నైపుణ్యాలు పెం చడానికి, వారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందించడానికే టీడీపీ ప్రభుత్వం గతం లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటుచేసింది. పేద లు, బలహీనవర్గాలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్‌ను, తన కక్షలకు బలి చేసిన జగన్‌రెడ్డి, చివరకు యువతకు ఎలాంటి శిక్షణ లేకుండా చేశాడు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు నాటి టీడీపీ ప్రభుత్వం విడుదలచేసిన ప్రతి రూపాయి అసెంబ్లీ ఆమోదంతోనే విడుదల చేశారు. ప్రభుత్వ పాత్ర కేవలం డబ్బులు ఇచ్చేంత వరకు మాత్ర మే. ఆ ప్రాజెక్ట్ అమలుతో ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ వ్యవహారమంతా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలే చూసేలా ప్రభుత్వం ముందే వాటితో ఒప్పందం చేసు కుంది. జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ ఇంప్లిమెంటింగ్ అథారిటీని వదిలేసి, నిధులిచ్చిన గత ప్రభుత్వం తప్పుచేసిందని చెబుతోంది. మొదటేమో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. తరువాత రూ.370 కోట్లు చంద్రబాబు కాజేశారన్నారు. న్యాయ స్థానాల్లో చంద్రబాబుకి డబ్బులు అందినట్టు ఆధారాలు న్నాయా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. చివరకు ఇప్పుడు రూ.27కోట్లు అంటున్నారు. ఆ సొమ్ము కూడా ఎక్కడిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు పొందడం కోసం కార్యకర్తలు చెల్లించిన సొమ్ము. దాదాపు 40 సంవత్సరాల నుంచి నడుస్తున్న పార్టీకి వచ్చిన విరాళాలు తప్పు అంటున్నారు. మరి మాపార్టీ కంటే తరువాత పుట్టిన వైసీపీకి తెలుగుదేశం కంటే ఎక్కువ విరాళాలు వస్తున్నాయి. పార్టీకి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇవ్వవచ్చని మేం మహనాడు లాం టి చోట్ల బహిరంగంగానే చెబుతాం. దానిలో దాచడా నికి ఏముంటుందని యనమల ప్రశ్నించారు.
జైల్లో చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు సజ్జలే పర్యవేక్షిస్తున్నాడు :
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లో ఎక్కడా.. ఎలాం టి తప్పు జరగలేదని, అవినీతికి ఆస్కారమే లేదని ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు.కేవలం రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబుని ఏదో రకంగా ఇబ్బంది పెట్టా లి.. ఆయన ప్రాణాలకు ప్రమాదం కలిగించాలనే కుట్ర పూరిత ఆలోచనల్లో భాగంగానే పాలకులు ఇలా వ్యవ హరిస్తున్నారు. చంద్రబాబుపేరుకే జైల్లో ఉన్నారు కానీ.. కచ్చితంగా గమనిస్తే ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్టు అర్థ మవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డే చంద్రబాబుకి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. చంద్రబాబుని జైలుకు పంపిన దగ్గర నుంచీ గమనిస్తే అటు జైలు అధికారులు.. ఇటు వైద్యు లు.. ఇతర అధికారులు ఏం చేయాలో.. ఏం మాట్లా డాలో కూడా సజ్జలే నిర్ణయిస్తున్నాడు. వీలైనంత త్వరగా చంద్రబాబుకి తగిన భద్రతతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని యనమల కోరారు.