అమరావతి: ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్త యశస్వి (యష్) బొద్దులూరి అరెస్టును టీడీపీ నేతలు ఖండిరచారు. అరెస్టుకు నిరసనగా గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదిని హింసించినట్లు యష్‌తో సీఐడీ పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. యష్ అరెస్టును ఖండిస్తున్నా. ప్రశ్నించే గొంతుకలను నిర్బంధాల ద్వారా అణిచివేయాలని వైకాపా ప్రభుత్వం అనుకుంటోంది. న్యాయం జరిగే వరకు విశ్రమించబోము. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని లోకేశ్ మండిపడ్డారు.