- హిందూమత భావనలంటే జగన్‌కు లెక్కలేదు
- కల్తీ నెయ్యి పాపం ఊరకే వదిలిపెట్టదు…
- హెరిటేజ్‌ను విమర్శించి.. మొట్టికాయల తిన్నారు
- జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం
ఏలూరు (చైతన్య రథం): హిందూమత విశ్వాసాలపట్ల, టీటీడీ సంప్రదాయాలు, సంస్కృతిపట్ల జగన్మోహన్ రెడ్డికి ఆదినుంచీ చిన్నచూపేనని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. శనివారం స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి కొలుసు మాట్లాడుతూ కలియుగ ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతు కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసారన్నారు. ఇప్పుడు జగన్‌రెడ్డి డైరెక్షన్‌లోనే స్వామి ఫొటోలను చెప్పులు, షూలు వేసుకుని నినాదాలిస్తూ రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చట్టసభలను బూతులు, వెకిలివేషాల కేంద్రాలుగా మార్చారని, ఇప్పుడు ఏకంగా దేవుడి ఫొటోలతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారన్నారు. శ్రీవారి మాడవీధుల్లో చెప్పులతో తిరిగినప్పుడే హిందూ సంప్రదాయాలపట్ల జగన్‌రెడ్డికి ఉన్న సహజ స్వరూపం బహిర్గతమైందన్నారు. టీటీడీ నిధులను దారి మళ్ళించి తిరుపతి నగరపాలక సంస్థ పేరిట కోట్లు దోచున్నారని దుయ్యబట్టారు.
వెంకన్నకిచ్చే తలనీలాలను సైతం వైసీపీ దోపిడీకి అతీతం కాలేదన్నారు. వందలాది దాడులు హిందూ దేవాలయాలపై జగన్ పాలనలో పదేపదే జరుగుతుండేవని గుర్తు చేశారు. ఐదేళ్లు జగన్‌రెడ్డి హిందూ వ్యతిరేక విధానాలు కొనసాగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగినా.. ఏరోజూ వెళ్లి పరిశీలించ లేదని, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామికి సతీసమేతంగా పట్టువస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా సమర్పించకుండా సంప్రదాయాలను కాలరాశాడని దుయ్యబట్టారు. అన్యమతస్థుడైన జగన్‌రెడ్డి.. ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల పర్యటించడం, స్వామికి తాను ఒక్కడే పట్టువస్త్రాలు సమర్పించడంపై పండితులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్‌రెడ్డి ఏ రోజు ఖాతరు లేదని గుర్తు చేశారు.
టీటీడీ నిధులు దారి మళ్లించడమే కాకుండా, వెంకన్న ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్న హీనుడు జగన్ మోహన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. దేవదేవుడితో ఆటలాడినందుకే 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా సిగ్గు, బుద్ధి రాలేదని మంత్రి కొలుసు ధ్వజమెత్తారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌లు మాట్లాడుతూ `కల్తీనెయ్యితో మహాపాపానికి పాల్పడిన వైసీపీ.. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు హెరిటేజ్‌పై నిందలు మోపుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపిఎసఆర్టీసీ విజయవాడ-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాదు, బిజెపి నాయకుడు విక్రమ్ కిషోర్, కూటమి నేతలు పాల్గొన్నారు.














