- సాంఘిక సంక్షేమ మంత్రి డోలా ఆగ్రహం
- చీమకుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ తనిఖీ
- డ్యూటీలోలేని సిబ్బందికి షోకాజ్ నోటీసులు
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వం రాష్ట్రంలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. శనివారం ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎస్సీ బాలుర హాస్టల్‌ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లోలేని సిబ్బందికి షోకాజ్ జారీ చేయాలని ఆదేశించారు. వర్షంలో తడుస్తూనే హాస్టల్‌లోని మరుగుదొడ్లు, పరిసరాలను మంత్రి పరిశీలించారు. అధ్వానంగావున్న మరుగుదొడ్లు, అపరిశుభ్రతపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు ఈ దుస్థితి దాపురించింది. జగన్ కనీసం వసతి గృహాలకు మెయింటినెన్స్ నిధులు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. జగన్ అధికారం పోయాక ప్రజలపై లేని ప్రేమను వొలకబోస్తున్నారని దుయ్యబట్టారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని, తప్పుడు ప్రచారాలు చేయడం, ఎదుటివారిపై బురద చల్లడం వైసీపీకి దినచర్యగా మారిందని డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.