అమరావతి : కుల, మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక అనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ మూకల ఫేక్ ఎత్తుగడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు.
ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలంటూ వైసీపీ ప్రారంభించిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రంపైనా లోకేశ్ స్పందించారు. వై ఏపీ నీడ్స్ జగన్? అంటూ తిరిగి ప్రశ్నించారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలి? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సరిగ్గా ఇదే అడుగుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని, ధ్వంసం చేసిన జగన్ ను ఏపీ ఎందుకు కావాలనుకుంటుంది? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
జీరో వాడకం… రూ.295 బిల్లు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపైనా లోకేశ్ స్పందించారు. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్? అంటూ ఎత్తిపొడిచారు. వాప్ా… ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంటు బిల్లు బాదుడు. సొంత పేపరు, చానల్, సిమెంటు, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకు రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం’’ అంటూ ధ్వజమెత్తారు.