• గూడూరు నియోజకవర్గం ఏరూరు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 200 ఎస్సీ, 100 ఎస్టీ కుటుంబాలు నివసిస్తున్నాయి.
• వీరంతా ఎకరం, అరఎకరం సన్నకారులు, గ్రామంలో మొత్తం 250 ఎకరాల భూమి వీళ్లకు ఉంది.
• ఈ భూములకు నేటికీ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయలేదు.
• పట్టాలు లేని కారణంగా గ్రామంలో కొంత మంది మమ్మల్ని భయపెట్టి మా భూములు ఆక్రమించుకుంటున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా భూములకు పట్టాలు మంజూరు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వేలాది ఎకరాలు పేదల నుండి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
• టిడిపి హయాంలో భూమికొనుగోలు పథకం ఎస్సీ, ఎస్టీ పేదలకు భూములను అందజేస్తే, వైసిపి నేతలు వారి భూములను లాక్కోవడం దారుణం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల భూములకు రక్షణ కల్పిస్తాం.
• వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి పట్టాలు మంజూరు చేస్తాం.