అమరావతి, చైతన్యరథం: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలించాలన్న జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్న జగన్‌రెడ్డిని సైకో అనే అనాలంటూ నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ట్వీట్ వేశారు. ఆ ట్వీట్‌లో ‘‘నిన్ను మేము సైకో అని ఊరికే అనలేదు జగన్! ప్రజారాజధాని అమరావతిలో సెక్రటేరియట్ టిడిపి ప్రభుత్వం కట్టింది. అందులో కూర్చుని ఇదేం రాజధాని అంటావు. విశాఖని రాజధాని చేస్తానంటావు. కోర్టుల ఆదేశాలున్నా వ్యవస్థల్ని బెదిరించి దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించేందుకు జీవోలిప్పిస్తావు. ఐటీ డెవలప్మెంట్ కోసం టిడిపి సర్కారు కట్టిన మిలీనియం టవర్స్‌ని ఖాళీ చేయిస్తావు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలని పక్కరాష్ట్రాలకి తరిమేస్తావు. వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేస్తావు. రుషికొండని ధ్వంసం చేశావు. కైలాసగిరిని నాశనం చేశావు. విశాఖని విధ్వంసం చేసి ఆ శిథిలాలపై కూర్చుని ఏం చేస్తావు సైకో జగన్! ఇంతా చేస్తే..నీ పాలన ఎక్స్పైరీ డేట్ 3 నెలలు. మూడు నెలల నీ ముచ్చట ప్రజల సొమ్ము వేలకోట్లు తగలేస్తున్నావంటే నిన్ను సైకో అనే అనాలి’’ అని లోకేష్ అన్నారు.