- బాబాయిని వేసేసిన నువ్వొక ముఖ్యమంత్రివా?
- నీకు రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా?
- పోలీసుల గొంతుపై కత్తిపెట్టి పాలన సాగిస్తున్నారు
- లండన్ బాబు.. ఎవరితో పెట్టుకుంటున్నావో చూసుకో!
- ఇదేం ఖర్మ రాష్ట్రానికి ప్రారంభసభలో చంద్రబాబునాయుడు
ఏలూరు : వివేకాను గొడ్డలిపోటుతో హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించారని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో బుధ వారం ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని అధినేత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ బహిరంగసభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వివేకా కుమార్తె సునీత తనతండ్రిని చంపిన వారిని లోకానికి తెలియజేయాలని పట్టుదలతో పోరాడుతు న్నారు. సునీత సుప్రీంకోర్టు వరకు పోరాడటంతో కేసు ను తెలంగాణాకు మార్చారు. కేసు నడుస్తున్న సమ యంలోనే ముగ్గురు నిందితులు అనుమానాస్పద స్థితి లో చనిపోయారు,సిబిఐ కస్టడీలో ఉన్న ఇద్దరు తమకు ప్రాణభయంఉందని చెబుతున్నారు. పోలీసుల మెడపై కత్తిపెట్టి పనిచేయిస్తున్నారు జగన్‌రెడ్డి.ప్రలోభాలు పెట్టి చేయిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దొంగల్లారా మీరు ఇదే చేస్తారా? లండన్‌బాబు నువ్వు కూడా ఇలాగే చేస్తావా? హత్యలు చేసేది మీరు…కేసులు మాపై పెడ తారా అంటూ తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పశ్చిమగోదా వరికి వందలసార్లు వచ్చా. జీవితంలో ఎప్పుడూ చూ డని స్పందన చూస్తున్నానని అన్నారు. విజయరాయి లో అఖండ స్వాగతం పలికిన సోదరీసోదరీమణులకు అభినందనలు తెలిపారు. చంద్రన్నా మీ పోరాటానికి అండగా ఉంటామని పెద్దఎత్తున తమ్ముళ్లంతా కదిలా రు.విజయరాయి హైస్కూలులో గేట్లువేసి పిల్లలు రాకుండా చేశారు.రోడ్లవెంట వచ్చి మరీ సంఫీుభావం తెలి పారని ఆనందం వ్యక్తంచేశారు.
లండన్ దాకా సాగనంపుతాం
జగన్‌రెడ్డి నువ్వొక ముఖ్యమంత్రివా… నీకు రాష్ట్రా న్ని పాలించే అర్హతఉందా? సమాధానం చెప్పు, లేక పోతే రాజీనామా చేయ్…ఒక ముఖ్యమంత్రి బాబాయి ని చంపి అబద్దాలు ఆడుతున్నాడంటూ చంద్రబాబునా యుడు విరుచుకుపడ్డారు. ఇక్కడొక లండన్‌బాబు ఉన్నాడు. తాడేపల్లిలో ఒకసైకో, ఇక్కడొక సైకో టిడిపి కేడర్‌ను వేధించడమే పనిగా పెట్టుకున్నారు.ఏ పార్టీతో పెట్టుకుంటున్నాడో లండన్‌బాబు చూసుకోవాలి. మేం అధికారంలోకి వచ్చాక తిరిగి లండన్‌కు సాగనంపుతా మని తీవ్రస్వరంతో హెచ్చరించారు.చింతమనేని ప్రభా కర్‌పై 29కేసులు.. అందులో 15అట్రాసిటీ కేసులు పెట్టారు. పోలీసుల మెడపై కత్తిపెట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నేను అనుకుని ఉంటే వైసిపి వాళ్లు రోడ్లపై తిరగగలిగేవారా? జగన్‌కు పోలీసులు ఉంటే నాకు ప్రజలు ఉన్నారు. మీరు ఒక్క దెబ్బవెయ్యాలి అనుకుంటే…ప్రజలు మీబట్టలు విప్పేస్తారని హెచ్చరిం చారు. కొందరు పోలీసులు తప్పుడు మార్గం పట్టారు.. ఒత్తిళ్లకు తలొగ్గివారు తప్పులు చేస్తున్నారు. మాట విన ని పోలీసులను బదిలీ చేస్తున్నారు. దీంతో మనసు చం పుకుని పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు.
విద్యాదీవెనకు కోతపెట్టారు
టిడిపి హయాంలో 16లక్షల మంది ఇచ్చే విద్యా దీవెన పథకాన్ని 10 లక్షలకు కుదించి జగనన్న విద్యా దీవెన అని మదనపల్లిలో పెద్ద సభపెట్టాడు.. దానికి అందరినీ తరలించి హడావుడి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.తెలుగుదేశం మీటింగ్‌కు వెళితే పథకాలు ఆపే స్తామని ప్రజలను బెదిరిస్తున్నారని,టిడిపి సభకు వెళితే తనకు ఇచ్చిన ఇంటిస్థలం తీసేస్తా అని చెప్పి బెదిరిం చినా… ఓమహిళ నేను చంద్రన్న సభకు వస్తాను అని చెప్పి మరీ వచ్చింది. అదీ మహిళల్లో నెలకొన్న తెగువ అని ప్రశంసించారు. అందరిలో అలాంటి తెగింపు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నాడు- నేడు అని రంగులు కొట్టాడు.. కానీ పిల్లలకు చదువులు చెప్పాలి అనే ఆలోచన లేదు.. ప్రమాణాలు పడిపోయాయి.
నామాట వినలేదు… అందుకే రాష్ట్రానికి ఈ ఖర్మ
గత ఎన్నికలకు ముందు ఉన్మాదులు గెలిస్తే అమ రావతి ఉండదు, పోలవరాన్ని ముంచేస్తారని చెప్పాను. నా మాట వినలేదు… అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వచ్చే ఎన్నికల గురించి నేను చెప్పేది నాకు ఆఖరి చాన్స్ అని కాదు… ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరిచాన్స్ అవుతుందని చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధరల పెరుగుదలపై బాదుడే బాదుడు నిర్వహించాం.. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.పట్టిసీమ ద్వారా 130టిఎంసిల నీరుకృష్ణా డెల్టాకు ఇచ్చామని,పోలవరం పనులు 72శాతం పూర్తిచేశామని గుర్తుచేశారు. కొత్తగా ఇరిగేషన్‌శాఖ కు వచ్చిన మంత్రికి పోలవరం డయాఫ్రం వాల్ ఎక్క డ ఉంటుందో తెలియదని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండర్ అనిపోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, డబ్బుల కోసం కాంట్రాక్టర్లను మార్చారని చంద్రబా బు ఆరోపించారు. జగన్‌రెడ్డి వచ్చి మూడున్నరేళ్లు అయ్యింది. ఇప్పటికి ప్రాజెక్టు పరిస్థితి ఏంటో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
రాష్ట్రంలో 6 వేల స్కూళ్లు మూసేసారు.. అందుకే ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. నాడు నేను ఐటీ రంగంలో వేసిన ఫౌండేషన్ తో రైతు బిడ్డలు ప్రపంచం అంతా విస్తరించారని, జగన్ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడని ఎద్దేవా చేశారు. చదువుకున్న పిల్లలు మటన్ కొట్లో, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం చెయ్యడం ఖర్మ కాదా? అని నిలదీశారు.
మెరుగైన సంక్షేమం అందిస్తా
రాష్ట్రంలో ఇసుక దొరుకుతుందా.. ఇసుకంతా ఎటుపోతోంది, ఇక్కడ ఎమ్మెల్యే లండన్ బాబు ఏం చెప్పాడు..అందరికీ ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కానీ ఆయన, ఆయన తండ్రి కలిసి ఇసుక దొంగ వ్యాపారం చేసుకుంటున్నారు.. తమ్మిలేరులో ఇసుక, పోలవరం కాలువ గట్లలో మట్టి దోచేస్తున్నారు.. అని చంద్రబాబు ఆరోపించారు. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు… నేను సంక్షేమం ఆపను…సంపద సృష్టించి మెరుగైన సంక్షేమం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి ఇళ్లు కట్టించి ఇస్తానని చెప్పాడు. 96 శాతం మ్యానిఫెస్టో హామీలు నెరవేర్చితే ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు? పరదాల మాటున పర్యటనలెందుకని ప్రశ్నించారు.
అన్నింటికీ నవ్వేమిటి జగన్ రెడ్డీ?
జగన్ ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.. ప్రతి దానికీ నవ్వుతాడు. కష్టంలో ఉన్న వారి దగ్గరా నవ్వుతాడు.. చనిపోయిన దగ్గరకు వెళ్లి నవ్వుతాడు. ఇదేమి సైకో తీరో నాకు అర్థం కావడం లేదని ఎద్దేవాచేశారు. ప్రభుత్వంపై పోరాడడానికి యువత, మహిళలు, రైతులు.. అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ను జగన్ నాశనం చేశాడని, చివరికి సినిమా హీరో లను బెదిరించిన విలన్ జగన్ అని వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మ అనిపించే ఈ ప్రభుత్వం పోవాలి అంటే క్విట్ జగన్….సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అని పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో దెందులూరు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళి, ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు, ఏలూరు పార్ల మెంట్ టిడిపిఅధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,దేవినేని ఉమామహే శ్వరరావు,పితాని సత్యనారాయణ,పీతల సుజాత,కెఎస్ జవహర్,పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు కొక్కిరిగడ్డ జయరాజ్, ముళ్ళ పూడి బాపిరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షురా లు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్, గోపాలపురం టిడిపి ఇంఛార్జి మద్దిపాటి వెంకట్రాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, శాసన మండలి మాజీఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్,నర్సాపురం టిడిపి ఇంఛార్జి పొత్తూరి రామరాజు, నూజివీడు నియోజక వర్గ టిడిపి యువనేత పర్వతనేని గంగాధర్, టిడిపి జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.