అమరావతి: లక్ష్మీ పార్వతి వీరగంధం సుబ్బా రావుకు వెన్నుపోటుపొడిచి ఎన్టీరామారావు వద్దకు వచ్చిందని తెలుగుమహిళ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షురాలు అన్నాబత్తిన జయలక్ష్మీ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరు ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్శిటీకి పేరుమార్చిన పదిరోజులకు లక్ష్మీపార్వతి మేల్కొని ప్రెస్ మీట్ పెట్టడం ఆమెకు ఎన్టీఆర్‌పై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ పంపిన మాయ లేడి లక్ష్మీపార్వతి అని చెప్పారు. మాయలేడి(మాయలాడి) చేతిలో పార్టీ నాశనమవకుండా చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టినట్లు తెలిపారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని పూల పాన్పుపై నడిపించారన్నారు. ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు ముందు లక్ష్మీపార్వతిని దర్శనం చేసుకొని, ఆమెకు బంగారు వడ్డాణమో, బంగారు ఉంగరాలో కానుకలు ఇస్తేగాని ఎన్టీరామారావు దర్శనమయ్యేదికాద తెలిపారు. వడ్డాణాలు, పట్టు చీరలకు పదవులు అమ్ముకున్న చరిత్ర నీది.. నోరు అదుపులో పెట్టుకోకపోతే కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరించారు.
ఎన్టీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన లపాకీ
ఆమె ఎన్టీరామారావు జీవితంలోకి వచ్చి నందమూరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డా రు. నందమూరి, నారావారి కుటుంబాల గురించి మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. ఇలాగే అవాకులు, చవాకులు పేలుస్తుంటే లక్ష్మీ పార్వతి హీనచరిత్ర గురించి కరపత్రాలు ముద్రించి ఇంటింటికి వెళ్లి పంచుతామని చెప్పారు. లక్ష్మీ పార్వతి వళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పదవులపై వ్యామోహం వీడాలని సలహా ఇచ్చారు. ఎన్టీరామారావుపై అభిమానమే ఉంటే వైసీపీకి రాజీనామా చేసి ఎన్టీరామారావు హెల్త్ యూనివర్శిటీకి అదే పేరు కొనసాగించేందుకు పోరాడాలని చెప్పారు. అప్పుడే ఎన్టీ రామారావుపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. ప్రపంచానికి తెలుగు జాతి గురించి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు అన్నారు. అలాంటి ఆయన జీవితంలోకి వచ్చి ఆయన మనసును కాకావికలం చేసి, ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చారని నిప్పులు చెరిగారు. లక్ష్మీ పార్వతి చరిత్ర హీనురాలని ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న అభిప్రాయాన్ని జయలక్ష్మీ వ్యక్తం చేశారు.
కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్న లపాకీ: ఉషారాణి
హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీరామారావు పేరు ను వైసీపీ ప్రభుత్వంమారుస్తుంటే లక్ష్మీపార్వతి కళ్లుండి కబోదిలా వ్యవహరించినట్లు తెలుగుమహిళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీరామారావు వంటి గొప్పవ్యక్తికి కీడుతలపెడుతుంటే లక్ష్మీపార్వతి అంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. తెలుగువారి ఔన్నత్యాన్ని కాపాడిన ఎన్టీరామా రావు పేరు తొలగిస్తుంటే లక్ష్మీపార్వతి ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పదవీ వ్యామోహంతోనే లక్ష్మీపార్వతి వైసీపీని సమర్థిస్తున్నారని మండిపడ్డారు. వీరగంధం సుబ్బారావును వదిలేసి నందమూరి తారక రామారావును పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె హీన చరిత్ర బయటపడిందని ధ్వజమెత్తారు. ప్రజలు లక్ష్మీపార్వతిని అసహ్యించుకుంటున్నట్లు తెలిపారు. పనిలేని, పనికిమాలిన మహిళలెవరైనా ఉన్నారంటే అది లక్ష్మీపార్వతేనని విమర్శించారు. లక్ష్మీ పార్వతి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని ఉషారాణి డిమాండ్ చేశారు.
చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెరముందుకు లపాకీ: గాయత్రి
జగన్ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే లక్ష్మీ పార్వతిని తెరముందుకు తెచ్చారని టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాయత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వం రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, ప్రజలపై మోపిన పన్నుల వివరాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఎక్కడ బయట పడతాయోనని లక్ష్మీ పార్వతిచేత మట్లాడిరచినట్లు విమర్శించారు. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలను తరలి పోయే లా చేసింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. టీడీపీని విమర్శించేందుకు బుర్రకథలు చెప్పే లక్ష్మీపార్వతి, బూతు పురాణాలు చెప్పే కొడాలి నానీలే దొరికారా అని ప్రశ్నించారు. మరెవరూ దొరకలేదా అని అడిగా రు. వైసీపీ నాయకులకు వారు చేసే అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అనేభయం పట్టుకుందన్నారు. టూ రుపీస్, త్రీ రూపీస్ ఆర్టిస్టులతో ప్రెస్ మీట్లు పెట్టిం చడం వైసీపీ మానాలని గాయత్రి సలహా ఇచ్చారు.
అన్న పంచనచేరి వెన్నుపోటుపొడిచన లపాకీ: రిజ్వానా
లక్ష్మీపార్వతి అన్న ఎన్టీఆర్ పంచన చేరి వెన్ను పోటు పొడిచారని టీడీపీ గుంటూరు పార్లమెంట్ జనరల్ సెక్రటరి షేక్ రిజ్వానా మండిపడ్డారు. కృష్ణాజిల్లా, ఎన్టీ రామారావు హెల్త్ యూనిర్శిటీలు లక్ష్మీపార్వతి అబ్బసొత్తా అని ప్రశ్నించారు. లక్ష్మీపార్వతి వైసీపీ చేతి లో కీలుబొమ్మ అని విమర్శించారు.ప్రతిపేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్న ఎన్టీ రామారావు పెట్టిన హెల్త్ యూనివర్శిటీకి పేరుమార్చడం అన్యాయమన్నారు. లక్ష్మీపార్వతి హీన చరిత్ర గురించి అందరికీ తెలుసని చెప్పారు. బ్రాందీ షాపులకు భారతి, వైజాగ్‌కు విజయసాయి, విజయ వాడకు విజయమ్మ అని పేర్లు పెట్టుకొండిగానీ.. ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తామంటే మాత్రం తెలుగుదేశంపార్టీ మహిళానేతలు ఊరుకోరని చెప్పారు. అన్నగారి గౌరవానికి భంగం కలిగించే పనిచేస్తే తగిన గుణపాఠం చెబుతామని షేక్ రిజ్వానా హెచ్చరించారు.
ఎన్టీఆర్ చనిపోగానే సూట్‌కేసులు సర్దుకున్న వ్యక్తి లపాకీ: షేక్ ఆషా
అన్న ఎన్టీ రామారావు చనిపోగానే సూట్ కేసులు సర్దుకున్న వ్యక్తి లక్ష్మీపార్వతి అని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా మండి పడ్డారు. ఈ విషయాన్ని టీవీ5కి ఇచ్చిన ఒక ఇంట ర్యూలో కూడా బహిర్గతపరిచినట్లు తెలిపారు. అన్న ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చి పచ్చని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లు తెలిపారు.
లక్ష్మీపార్వతి ధనదాహంతోనే ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారని నిప్పులు చెరిగారు. వీరగంధం, నందమూరి ఇంటిపేర్లు పెట్టుకున్న లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైఎస్‌పేరు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. జగన్.. లక్ష్మీ పార్వతిని పావుగా వాడుకుంటున్న విషయం జగత్ విదితమేనని చెప్పారు. ప్రధాన మంత్రి కావాల్సిన అన్న ఎన్టీరామారావు జీవితంలోకి ఒక రాక్షసిలా లక్ష్మీ పార్వతి ప్రవేశించారని మండిపడ్డారు. ఎన్టీ రామా రావుపై ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా వెంటనే ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలను లక్ష్మీపార్వతి వెనక్కి తీసుకోవాలని షేక్ ఆషా డిమాండ్ చేశారు.