- సీఎం చంద్రబాబుకు వైసీపీ బాధితుల మొర
- వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజానీకం
- తన భూమి పరిహారం కొట్టేశారని ఆచంట మహిళ ఆవేదన
- సంతకాల ఫోర్జరీపై చిలకలూరిపేట డ్వాక్రా మహిళల ఫిర్యాదు
- విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ
అమరావతి(చైతన్యరథం): మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు, కార్యకర్త ల నుంచి శనివారం సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసు కున్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి సీఎం వస్తుండటంతో పెద్దఎత్తున దివ్యాం గులు, వృద్ధులు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తాము ఎలా బాధితులు అయిందీ వివరించారు. వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్న తమ ఆస్తులను తిరిగి తమకు అప్పగించేలా చూడాలని కోరారు. సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చారని యాని మేటర్లపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న చంద్రబాబు పరిష్కారానికి హామీ ఇచ్చారు.
వైసీపీ నేతలు భూమిని ఆక్రమించారు…న్యాయం చేయండి
ఆచంట నియోజకవర్గం వెంకటాలచెరువుకు చెందిన పిల్లి పార్వతి అనే మహిళ తన భూమిని వైసీపీలోని తమ బంధువులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు. ఆమె మాటల్లో ‘‘15 ఏళ్ల క్రితం వెంకటాలచెరువులో రూ.23 లక్షల పెట్టి 15 సెంట్ల స్థలం కొన్నాను. ఉపాధి నిమిత్తం నేను కువైట్కు వెళ్లాను. 2021లో కువైట్ నుండి వచ్చే సరికి నా స్థలానికి ఉన్న పెన్షింగ్ తొలగించారు. నా స్థలానికి వెనకవైపు ప్రాంతంలో గత ప్రభుత్వం సెంటు పట్టా స్థలాలు ఇచ్చింది. ఆ స్థలాలకు దారి లేదు. దాని కోసం నా 15 సెంట్ల స్థలాన్ని వైసీపీలో ఉన్న మా బంధువులు అధికార అండ తో లాగేసుకున్నారు. నేను చనిపోయినట్లు చెప్పి నా సోదరి కుమారుడు గుబ్బ శ్రీనివాస్ పేరుపై తప్పుడు పత్రాలు సృష్టించారు. నేను ప్రశ్నిస్తే గుబ్బల శ్రీనివాస్, సతీష్, నాగేశ్వర రావు, వరలక్ష్మితో పాటు మరికొంత మంది కలిసి దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు చెప్పినా నాడు పట్టించుకోలేదు. దారికోసం కొంత స్థలం పోగా మిగిలిన 5 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాలలో కలిపారు. ఈ 15 సెంట్లకు ప్రభుత్వం నుంచి పరిహారాన్ని వారు పొందా రు. స్థలం కోసం నేను పోరాటం చేస్తుండటంతో రూ.60 లక్షలు చెల్లిస్తే తిరిగి స్థలం అప్పగి స్తామని అంటున్నారు. నా స్థలం కొట్టేసిందే కాకుండా నాపైనే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కోర్టు కేసుల వల్ల ఉపాధి కోసం కువైట్ కూడా వెళ్లలేకపోతున్నాను. నా స్థలాన్ని తిరిగి నాకు ఇప్పించండి’’ ముఖ్యమంత్రి వద్ద విలపించారు. సావధానంగా సమస్యను విన్న చంద్రబాబు తిరిగి స్థలం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
యానిమేటర్లు సంతకాలు ఫోర్జరీ చేశారు
చిలకలూరిపేట నియోజకవర్గం, తిమ్మాపురంనకు చెందిన అనీలా డ్వాక్రా సంఘ సభ్యులు సీఎంను కలిశారు. గ్రూపు సభ్యుల అనుమతి లేకుండా యానిమేటర్లు తమ సంతకాలు ఫోర్జరీలు చేశారని, యూనియన్, గోదావరి బ్యాంక్లో రూ.30 లక్షల రుణాలు తీసుకున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తాము పోలీసులను ఆశ్రయించగా 5 నెలల్లో సొమ్ము తిరిగి ఇస్తామని అంగీకారం పత్రం రాసిచ్చినప్పుటికీ నేటికీ ఆ సొమ్ము చెల్లించలేద న్నారు. పైగా పోలీసులతో కుమ్మక్కై బెదిరిస్తున్నారని తెలిపారు. రుణం సొమ్ము చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేయించి నిందితులపై చర్యలు తీసుకుని సొమ్మును రికవరీ చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.