- బంగారు బాటలేస్తోన్న ఎన్డీయే సర్కారు
- యువత అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
- చంద్రబాబు సంకల్పం.. క్రీడాంధ్రప్రదేశ్
- ఉపాధి కల్పనకు మంత్రి లోకేష్ కృషి..
- సర్కారు జెట్ స్పీడ్‌ని అందుకోండి..
- యవతకు శాప్ చైర్మన్ అనిమిని పిలుపు
అమరావతి (చైతన్య రథం): యువత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోందని శాప్ ఛైర్మెన్ అనిమిని రవినాయుడు అన్నారు. ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ఐటీ శాఖకు లోకేష్ పెద్దపీట ‘ఐటీ మంత్రి లోకేష్ పదిరోజుల అమెరికా పర్యటనవల్ల రాష్ట్రానికి పెట్టుబడులు పరుగులు పెడుతున్నాయి. 2019-24లో రాష్ట్రంలో యువతకు గ్రహణం పట్టింది. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు లోకేష్ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారు. అతి త్వరలో 16,347 టీచర్లు, 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయబోతున్నాం’ అని అనిమిని వెల్లడిరచారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు ఉద్యోగాలల్లో 3శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు. క్రీడారంగ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వమే. పాఠశాల క్రీడాకారులకు స్పోర్ట్స్ దుస్తులు ముందుగానే పంపిణీ చేసిన ఎకైక విద్యాశాఖ మంత్రి లోకేష్ మాత్రమే. క్రీడాకారులకు అలవెన్స్ 50శాతం ముందే విడుదల చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి లోకేష్.
యువత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్‌కు రాష్ట్ర యువత తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లోకేష్ అమెరికా పర్యటనతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూకట్టాయి. మన బిడ్డలు ప్రపంచంలో ది బెస్ట్ అనిపించుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. క్రీడాకారులకు చంద్రబాబు ప్రకటించిన ప్రోత్సాహకాలు ఎనలేనివి. పారిశ్రామికరంగాన్ని లోకేష్ జెడ్ స్పీడ్‌లో తీసుకెళ్తున్నారు. రాష్ట్ర క్రీడాకారులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకు కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోంది’ అని శాప్ ఛైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు.
యువత క్రీడల్లో రాణించాలి
యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఏ రంగంలోనైనా రాష్ట్రంలో క్రీడాకారులు రాణించేలా కూటమి ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తుంది. నాటి క్రీడాంధ్రప్రదేశ్‌ను వైసీపీ పాలకులు భ్రష్టుపట్టించారు. గత ఐదేళ్లలో క్రీడా నిధులను దోచుకొని క్రీడాకారులకు ద్రోహం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మెడల్స్ సాధించిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపైన ఉందన్న చంద్రబాబు ఒక్కమాట చాలు, క్రీడా రంగానికి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవడానికి’ అని రవినాయుడు వ్యాఖ్యానించారు.
క్రీడా వికాసమే లక్ష్యం..
ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలను పెట్టి క్రీడకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పోటీ పడేలా తర్ఫీదు ఇచ్చేందుకు మంచి శిక్షకులను గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించింది. దాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. 90 శాతం పూర్తి చేసిన క్రీడా వికాస కేంద్రాలను కూడా జగన్‌రెడ్డి పక్కనపెట్టి క్రీడాకారులకు అన్యాయం చేశాడు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చి ఉద్యోగాల్లో కూడా వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తామని రవినాయుడు అన్నారు.
నిరుద్యోగులకు ఉపాది కల్పనకు ప్రత్యేక చర్యలు
స్కిల్ సెంటర్‌ల ద్వారా శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ మంత్రి లోకేష్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలందరూ క్రీడల్లో రాణించాలని, ప్రతి స్కూల్‌కు గ్రౌండ్ ఉండాలని జీవో విడుదల చేసిన ఏకైక విద్యా మంత్రి నారా లోకేష్. స్కూల్ గేమ్స్‌పై ఏ మంత్రీ దృష్టి సారించలేదు. లోకేష్ ఆలోచనలతో రాష్ట్రంలో క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతోంది. అలవెన్స్, ట్రాన్స్‌పోర్టు, ఫుడ్‌లో 50 శాతం అలవెన్సు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. డ్రస్ కోడ్ ఇచ్చాం. 13 ఉమ్మడి జిల్లాలకు 13 డ్రెస్ కోడ్లు ఇచ్చి పిల్లలు గ్రౌండ్లల్లో ఆడుతుంటే గ్రౌండ్లు కళకళలాడుతున్నాయి. గత ప్రభుత్వంలో కబడ్డీ ఆడేవారికి వాలీబాల్ కిట్లు, వాలీబీల్ ఆడేవారికి క్రికెట్ కిట్లు ఇచ్చేవారు. కాని కూటమి ప్రభుత్వం వచ్చాక క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు సరైన వసతులు కల్పిస్తూ.. క్రీడారంగానికి కృషి చేస్తోందని రవినాయుడు వివరించారు.