అనపర్తి: అధికార వైసిపి ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలు, ఇబ్బందులుకు వెరవకుండా ప్రజల పక్షాన నిలబడి మీరు చేస్తున్న పోరాటం అభినందనీయమని, అనుసరణీయమని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయు డు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అభినందించారు. గురువారం అమరావతిలోని ఉండ వల్లిలో చంద్రబాబు నివాసంలో రామకృష్ణారెడ్డి ఆయన తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అనపర్తి జిల్లా పార్టీ విషయాలపై చంద్రబాబు నాయుడు చర్చించారని పలు విషయాలపై తనకు దిశానిర్దేశం చేశారన్నారు. ప్రజలకు ఏ కష్టం కలిగిన నాయకులు వారికి అండగా నిలబడి అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు సూచించారన్నారు.