మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత నారాసుర రక్త చరిత్ర అని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తన ‘‘అసాక్షి’’ పత్రికలో విష ప్రచారం చేశారని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు విశాఖలో మీడియా తో మాట్లాడుతూ.. నేడు సీబీఐ విచారణ లో హంతకుల జాబితా లో మొత్తం జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారన్నారు. జగన్ చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. జగన్ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కు ఆమడ దూరంలో ఉన్నారని… సీబీఐ విచారణకు జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, భారతీరెడ్డి పీఏ నవీన్ వెళ్లి వచ్చారన్నారు.
వివేకా హత్య కు సంబంధించిన రక్తపు మరకలు, ఆనవాళ్లు తాడేపల్లి నుంచి పులివెందుల వరకు సీబీఐకి కనిపించాయని.. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్‌మీట్ పెడుతున్నారని ప్రశ్నించారు. నాడు నారాసుర రక్తచరిత్ర అని రాసిన సాక్షి పత్రిక డైరెక్టర్ భారతీరెడ్డి.. చంద్రబాబుకు, టీడీపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పత్రిక లో అయితే తాటికాయంత అక్షరాలతో నారాసుర రక్తచరిత్ర అని అచ్చు వేశారో…అ దే పత్రికలో బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్త ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నామని ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.