- వివేకా కేసులో హంతకులకు పోలీసులు అండగా నిలిచారు
- సాక్షులను బెదిరించారు..వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- తప్పు చేసిన వారిని వదిలేదని లేదని అనిత భరోసా
- సీబీఐ విచారణలో ఉన్నందున సహకారం ఉంటుందని వెల్లడి
అమరావతి/పులివెందుల(చైతన్యరథం): హోంమంత్రి వంగలపూడి అనితతో బుధవారం వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంత కులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచార ణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షులను బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు.
తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టం
ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని..తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.