- ఎన్నికల కమిషన్‌కు కేస్‌స్టడీగా మారిన చంద్రగిరి అవకతవకలు
- దోపిడీదొంగలు కూడా చేయని విధంగా అక్రమాలు
- ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పులివర్తి నానికి పరామర్శ
చంద్రగిరి: ఓటమి భయంతో చరిత్రలో లేని విధం గా వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్ల దందాకు పాల్పడు తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజ కవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు ఎన్ని కల కమిషన్‌కు కేస్ స్టడీగా మారాయన్నారు. దోపిడీ దొంగలు కూడా చేయని విధంగా బరితెగించి ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పులి వర్తి నాని ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన నిరసల్లో
ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు.
ఈ సందర్భంగా నాని గాయాలపాలయ్యారు. పులివర్తి నానిని చంద్ర బాబు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడై నా ఓటరు లిస్టును ఎన్నికల అధికారులు చేస్తారన్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీ నేతలు అత్యంత దుర్మార్గంగా దొంగ ఓట్లు చేర్చుతున్నారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారు.ఓట్ల అంశంలో రాష్ట్రమంతా ఏం జరుగుతోందో చూస్తే… చంద్రగిరి ఒక కేస్ స్టడీ. ఎన్ని కల కమిషన్‌కు చంద్రగిరి నియోజకర్గం కేస్ స్టడీగా ఉంటుంది. ఇటీవల తిరుపతి కలెక్టర్, ఎస్పీలపై ఎన్ని కల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసు కున్నారని ప్రశ్నించిందని చంద్రబాబు గుర్తు చేశారు.
విచ్చలవిడిగా ఫామ్-6, ఫామ్-7
దొంగఓట్ల చేర్పులు, టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై పులివర్తి నాని ఆరు నెలలుగా పోరాడు తున్నారు. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ రాక్షసులు చేసే పనులతో ఫ్రస్టేషన్ కూడా వస్తుంది. ఎప్పుడూ నా జీవితంలో ఇలాంటి నేరస్తులను చూడలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8ను విచ్చలవిడిగా ఉపయోగించారు. చంద్రగిరిలో పోయినసారి 2.70 లక్షల ఓట్లతో 325 బూత్‌లు ఉన్నాయి. ఇప్పుడు 3.08 లక్షల ఓట్లతో 75 బూత్‌లు పెంచారు. తుమ్మలగుంటలో గతంలో నాలు గు బూత్ లు ఉన్నాయి..అవి ఇప్పుడు ఏడు బూత్‌లు చేశారు. వాళ్ల లెక్కల ప్రకారం మళ్లీ నాడు 2.70లక్షల ఓట్లు ఉంటే.. ఇప్పుడు 3.08లక్షల ఓట్లు ఉన్నాయంటు న్నారు. 38వేల ఓట్లు కొత్తగా వచ్చాయి. ఇందులో ఫామ్-6 ద్వారా 25 వేల ఓట్లు చేర్పించారు. 6 వేల మంది 40, 80 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు కొత్తగా ఎక్కడి నుండి వచ్చారో తెలీదు.13,928 ఓట్లు ఫోటో సిమిలర్ ఎంట్రీ కింద ఉన్నాయి. సంగీతం హరి, హరి సంగీతం అనే పేరుతో తిరుపతి, చంద్రగిరిలో చేర్చారు. శ్రావ్య దువ్వాల.. దువ్వాల శ్రావ్య అనే పేర్లతో శ్రీకాళహస్తి, చంద్రగిరిలో చేర్చారు. మల్లగుంట్ల మహేష్ పేరుతో పీలేరు,చంద్రగిరిలో ఓట్లు చేర్చారు. ఇవన్నీ చూస్తే ఎన్ని కల అధికారులు ఎంతగా అధికారపార్టీ నేతలతో కుమ్మ క్కయ్యారో తెలుస్తోంది. ఓట్ల అవకతవకలు చూడాల్సిన బాధ్యత మాది కాదు.. ఉద్యోగులది. తప్పులు జరిగితే జైలుకు పంపించే అవకాశం ఉంది.. అయినా అధికా రులు తేలిగ్గా తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.
వైసీపీ నేతలకు పాస్‌వర్డ్
సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమిం చి అవకతవకలకు పాల్పడుతున్నారు. పులివర్తి నాని చేసే ధర్మపోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. వైసీపీని ప్రజలు ఇంటికి పంపడం ఖాయం. అధికారు లు కూడా చట్ట ప్రకారం చేయాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే బోను ఎక్కిస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించి చేసిన అక్రమాలపై చర్యలు తీసుకునేలా చేస్తాం. 10 ఎన్నిక లు చూశాను.. ఎప్పుడూ ఇలాంటి అవకతవకలు చూడ లేదు. అధికారులు తమ లాగిన్ పాస్‌వర్డును వైసీపీ నేత లకు ఇవ్వడంతో తహశీల్దార్ కార్యాలయంలో కూర్చుని ఓట్లు నమోదు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల విధుల్లో ఉండదని ఎన్నికల కమిషన్ చెప్పింది. వాలం టీర్లు కూడా ప్రజలకు మేలు చేయడం వరకే ఉంటే గౌరవిస్తాం..ఒక పార్టీకే పని చేస్తే శిక్ష పడేలా చేస్తాం. అధికార యంత్రాగాన్ని నేరస్తులుగా తయారు చేస్తున్నా రు. కుప్పంలో దొంగ ఓట్లు ఉంటాయంటున్నారు. తప్పించుకోవడానికి దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరి స్తున్నారని చంద్రబాబు విమర్శించారు.