- ఇంత భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడటంపై విస్మయం
- రాష్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చారని ఆగ్రహం
అమరావతి (చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. విశాఖ పోర్టులో సీబీఐ 25, 000 కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం తనను షాక్ కు గురిచేసిందన్నారు. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించక పోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలన్నారు. వచ్చే ఎన్నిక కోసమే వైసీపీ అధిష్టానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్‌గా మారిపోయింది. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిరది. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.