- తండ్రీకొడుకులిద్దరూ సీమప్రజల భావోద్వేగాల్ని స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు
- రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి దొంగసాక్షిలో ప్రచురించింది మొత్తం అవాస్తవమే
- తప్పుడు మాటలు, తప్పుడు పనులు, తప్పుడు కథనాలతో జగన్ రెడ్డి ఎల్లకాలం ప్రజల్ని సగించలేడు
- పదేపదే అవాస్తవాలతో ప్రజల్ని మోసగించడం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా దొంగ సాక్షి పని?
- రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
- టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, జగన్‌రెడ్డి పెట్టింది కేవలం రూ.2011 కోట్లే
- హంద్రీనీవా నిర్మాణానికి చంద్రబాబు రూ.4,188 కోట్లు ఖర్చుచేస్తే, జగన్‌రెడ్డి కేవలం రూ.515 కోట్లతో సరిపెట్టాడు
అమరావతి: జగన్మోహన్రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని, ప్రాధాన్యతా రంగ మైన సాగునీటి రంగం చతికిలబడిరదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం సీమ పాలిట పెనుశాపంగా పరిణమించిందని ఆవేదన వ్య క్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో బుధవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరుల తో మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి ఇప్పటివరకు కేవలం రూ.2,011కోట్లు మాత్రమే ఖర్చుచేశాడు.ఇంత తక్కువ ఖర్చు పెట్టిన జగన్‌రెడ్డి.. రాయలసీమ ద్రోహి కాక ఏమవుతాడో ప్రజలే ఆలోచించాలి. టీడీపీ పాలనలో చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాజెక్టులను, ముఖ్యంగా అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని పరుగులు పెట్టించారు. ఎక్కడికకక్కడ ఎప్పటి కప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, కాంట్రాక్ట ర్లు… ఇంజనీర్లతో మాట్లాడి ఆగి పోయిన ప్రాజెక్టు పనుల్ని కూడా కొనసాగేలా చూశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇరి గేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అధికారులతో కలిసి స్వయంగా సాగునీటి ప్రాజె క్టుల పనుల్ని పర్యవేక్షించారు. ఆనాడు జరిగిన పనుల తో పోలిస్తే, ఈ ప్రభుత్వంలో జరిగినవి శూన్యమనే చెప్పాలని కాలవ పెదవి విరిచారు.
జగన్ రెడ్డి ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు?
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు అధికారులతో సమీక్షలు చేశాడు? ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులపై చర్చలు జరిపాడు? ఇరిగేషన్ మంత్రిగా గతంలో ఉన్న అనిల్‌కుమార్ గానీ, ఇప్పుడు న్న మంత్రి అంబటి రాంబాబుగానీ ఎన్నిసార్లు అధికారు లతో సమీక్షలు జరిపి, ఎన్నిసార్లు ఏ ప్రాజెక్టుల్ని సంద ర్శించారో ప్రజలకు చెప్పాలి. రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహ న్‌రెడ్డి ఇద్దరూ రాయలసీమలో భావోద్వేగాలు రెచ్చగొ ట్టి, తమ పబ్బం గడుపుకున్నారు తప్ప సీమ ప్రజలకు చేసిందేమీ లేదు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడటంలో జగన్‌రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని కాలవ ఆరోపించారు.
శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా?
రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ పథకం కింద, రూ.33,868 కోట్లతో 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చాడు. అది ఏమైందని ప్రశ్నిస్తున్నాం. తాను చెప్పిన 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎంత వరకు జరిగిందో, వాటిలో ఎన్ని పూర్తయ్యాయో, ప్రాజెక్టుల నిర్మాణానికి తన ప్రభు త్వం ఎంత ఖర్చు పెట్టిందో, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చిం దో పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా అని కాలవ ప్రశ్నించారు.
హంద్రీనీవా కు జగన్‌రెడ్డి మొక్కుబడిగా రూ.515 కోట్లు ఖర్చుపెట్టాడు
స్వర్గీయ నందమూరి తారకరామారావు తన హయాంలో రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పార దోలాలని గొప్ప ఆలోచన చేశారు. దానిలో భాగంగా హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలు రూపొందించారు. వాటి నిర్మాణ ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్ హయాంలోనే సిద్ధమయ్యాయి. ఆ ప్రాజెక్టులతో పాటు టీడీపీ ప్రభుత్వం సీమలోని ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. హంద్రీనీవా నిర్మాణానికి చంద్రబాబు నాయుడు రూ.4,188 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో పెట్టిన ఖర్చు కేవలం రూ.515 కోట్లు మాత్రమే. రాయలసీమకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన హంద్రీనీవాను జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవా కాలువని విస్తరిస్తానని, దానికి సమాంతరంగా 10వేల క్యూ సెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మిస్తానని చెప్పిన మాట లు ఏమయ్యాయో జగన్‌రెడ్డి సీమవాసులకు సమాధా నం చెప్పాలి. 2020లో హంద్రీనీవా నిర్మాణానికి రూ.6,300 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు జగన్‌రెడ్డి ఒక జీవో ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధిం చిన టెండర్లే పిలవలేదని కాలవ దుయ్యబట్టారు.
ఒక్క శాతం పని కూడా చేయించలేదు
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని 3,600 క్యూసెక్కులకు విస్త రించాలని,నిర్మాణ పనులకోసం రూ.1050 కోట్లు కేటా యించి, రూ.288కోట్లు ఖర్చుచేశారు. 35శాతం పైగా పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల్ని జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపేశాడు. మాయమాటలతో ఇప్పటివరకు సీమ వాసుల్ని మోసగి స్తూనే ఉన్నాడు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత, హక్కు జగన్ రెడ్డికి లేవు. సీమలో ఏ సాగునీటి ప్రాజెక్ట్ చూసినా జగన్‌రెడ్డి హయాంలో వెలవెలబోతూనే కనిపి స్తోంది.గుండ్రేవుల,వేదవతి, అనంతపురం జిల్లాలో 50 వేల ఎకరాలకు బిందుసేద్యం కింద సాగునీరు అందిం చే ఉరవకొండ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రూ.960 కోట్ల తో చేపట్టిన కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గా లకు నీళ్లిచ్చే జీడిపల్లి-భైరవాని తిప్ప ప్రాజెక్ట్, రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన జీడిపల్లి-పేరూరు ప్రాజెక్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు, ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు తప్ప, జగన్‌రెడ్డి హాయాం లో ఎక్కడా ఒక్క ప్రాజెక్టులో ఒక్క శాతం పనికూడా జర గలేదు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా, రైతు లకు నీళ్లివ్వకుండా సీమకు ఎలా న్యాయం జరుగుతుం దో ముఖ్యమంత్రి చెప్పాలని కాలవ ప్రశ్నించారు.
దొంగ సాక్షిలో ప్రచురితమైనదంతా పూర్తిగా అవాస్తవం
రాయలసీమ ప్రాజెక్టుల గురించి సాక్షి దినపత్రికలో ప్రచురితమైన సమాచారమంతా పూర్తిగా అవాస్తవం. చేతిలో ఉన్న దొంగసాక్షి పత్రికలో తప్పడు రాతలు, తప్పుడు వివరణలు ఇచ్చినంత మాత్రాన సీమరైతులకు నీళ్లు అందవనే వాస్తవాన్ని జగన్‌రెడ్డి గ్రహించాలి. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఈ 4 ఏళ్ల 8 నెలల్లో సీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి, ఎన్ని ఎక రాలకు నీళ్లిచ్చాడో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. చేతి లో అవినీతి పత్రిక ఉందని కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో అబద్ధపు ప్రకటనలివ్వడానికేనా ప్రజలు జగన్‌రెడ్డికి అధికారమిచ్చింది? ప్రభుత్వం చేయక పోయినా చేసినట్టు చెప్పడం, జగన్‌రెడ్డి ఏదో ఉద్ధరిం చినట్టు తప్పుడు రాతలు రాయడం, పదేపదే కట్టుకథ లతో ప్రజల్ని మోసగించాలని చూడటం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా దొంగ సాక్షి పని? నంద్యాలలో దశరథరామిరెడ్డిని జగన్‌రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించా డో చెప్పాలి. అతనేమీ తెలుగుదేశం పార్టీ మనిషి కూడా కాదు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడు తున్నాడనే జగన్‌రెడ్డి అతన్ని అన్యాయంగా తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయించి జైలుకు పంపాడు. రాయల సీమ ఉద్యమకారులు, మేధావులపై జగన్‌రెడ్డికి కక్ష ఉంది కాబట్టే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నా డు. ఇలాంటి తప్పుడుపనులు, తప్పుడు కథనాలతో ఎంతకాలం ప్రజల్ని మోసగిస్తావు జగన్‌రెడ్డి? నిన్ను, నీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టడానికి సీమ వాసులు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశంపార్టీకి అఖండ మెజారి టీ కట్టబెట్టి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి, రాయ లసీమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకోవడానికి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అరెస్టులు.. బెదిరింపులు.. భయోత్పాతా లు… అణచివేతల ద్వారా సీమ ఉద్యమాన్ని, సీమవా సుల పోరాటాన్ని జగన్ రెడ్డి అణచివేయలేడు. సొంత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని కాలవ స్పష్టం చేశారు.