అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయేలా జరుపుదామని పార్టీ నేతలు, కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. ఒక్క అడుగుతో మొదలైన యువగళం.. యువత ఆకాంక్షలకు, ఆశయాలకు నిలువుటద్దంగా నిలిచిందన్నారు. 226 రోజులపాటు ప్రజలకు భరోసా కల్పిస్తూ 3,132 కిలో మీటర్లు విజయవంతంగా సాగింది. విజయనగరం జిల్లా పోలేపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న యువగళం – నవశకం సభను చారిత్రాత్మకంగా నిలుపుదాం. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారు. ఈ బహిరంగ సభను చారిత్రాత్మకంగా నిర్వహిద్దామని సోమవారం ఒక ప్రకటనలో పార్టీ నేతలు, కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.