తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర శుక్రవారం మరో మజిలీ చేరుకుంది. డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం అని లోకేష్ హామీ ఇచ్చారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం అంటూ ఇచ్చిన హామీకి గుర్తుగా ప్యాపిలి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రతి వంద కిలోమీటర్లకు శాశ్వత ప్రయోజనాన్ని చేకూర్చే హామీ ఇచ్చి అందుకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ప్యాపిలి బిసి కాలనీ లో 9 వ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.