అమరావతి: కుటుంబ అనుబంధాలకు, ఆత్మీయతలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రక్షా బంధన్ స్ఫూర్తిగా సమాజంలోని ప్రతి ఆడపడుచుకు రక్షణాగా నిలుద్దామని పిలుపు ఇచ్చారు. ఆడపడుచుల గౌరవాన్ని కాపాడేందుకు మనమందరం సంకల్పిద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.