తనకు అలవాటైన బొంకు రాతలతో పబ్బం గడపడానికి జగన్‌రెడ్డి అలవాటుపడిపోయాడు. ‘‘దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు’’ సాక్షి ద్వారా ఆర్థిక నేరగాడు నిత్యం రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తున్నాడు. ప్రజాస్వామ్య విధ్వంసానికి, ప్రతిపక్షాల అణచివేతకు, వ్యవస్థలను కూల్చడానికే తన అధికారాన్ని వినియోగించిన జగన్.. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేసిన ప్రిజనరీ. స్వార్ధం కోసం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన అధికార వ్యసనపరుడు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే `ఏపీ ద్రోహి వైఎస్ జగన్! రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమానికి అహరహం కృషి చేస్తున్న నిర్మాణాత్మక నేత చంద్రబాబు ఉన్నతని చూసి జగన్ కడుపుమంటతో రగిలిపోతున్న దుస్థితి.. జగన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలతోనే అర్థమవుతుంది. ఫ్యాక్షనిస్టు లక్షణాలతో పెరిగిన జగన్‌రెడ్డి.. తన అవినీతి పాప పంకిల మకిలి కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే `కపట పత్రిక సాక్షి రాతలు!!
సుదీర్ఘ రాజకీయానుభవంతో రాష్ట్రాభివృద్ధికి చారిత్రక కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబుపై `జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సైతం ఇదే కక్షధోరణి ప్రదర్శించడం రాష్ట్ర ప్రజలకు తెలీంది కాదు.
అటు వైఎస్ హయాంలోనూ.. మొన్నటి జగన్ జామానాలోనూ.. చంద్రబాబుపై పన్నిన కుట్రలు, కుతంత్రాలు, అవినీతి ఆరోపణలు ఏదీ నిలవలేదు. ప్రతిపక్షాలు పన్నిన ప్రతి కుతంత్రాన్నీ చంద్రబాబు నిశ్శబ్దంగా తనదైన ధోరణిలో సమర్థంగా తిప్పికొట్టారు. జగన్ తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబుమీద 28 కేసులు వేశారు. కానీ, దేన్నీ నిరూపించలేకపోయారు వైఎస్సార్. సచ్ఛీలుడైన చంద్రబాబుపై.. వైఎస్సార్ పెట్టిన కేసులు ఏ ఒక్కటీ నిలవలేదన్న ఇంగితాన్ని విస్మరించిన జగన్.. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబుపై కక్షసాధింపు ధోరణినే ప్రదర్శించాడు. జగన్ నైజాన్ని అర్థం చేసుకుని ప్రజలు దారుణ పరాభవంతో గద్దె దింపేయడంతో.. ఇప్పుడు చంద్రబాబుపై అబద్ధాలు ప్రచారం చేస్తూ బురదజల్లే కార్యక్రమాలకు దిగజారిపోయారు. తండ్రి అనుభవాల నుంచి ఏమాత్రం పాఠం నేర్చుకోని జగన్.. ‘ఆకాశంపైకి రాయి విసిరితే మన ముఖంమీదే పడుతుందన్న’ పాఠాన్నీ నేర్వలేకపోవడం అతని సహజ నైజానికి గీటురాయి. అధికారం కోసం బాబాయిపై గొడ్డలి వేటు వేయించి.. పచ్చి అబద్ధాలతో గుండెపోటుగా చిత్రీకరించడం జగన్‌కే చెల్లింది. ‘నారసుర రక్త చరిత్ర’’ అంటూ సీబీఐ విచారణ కోరిన జగన్, అధికార పీంమెక్కిన మరుక్షణం సీబీఐ విచారణకు వెనక్కి తగ్గాడు. జగన్‌ను మించిన అధికార దాహార్తులు ఇంకెవరూ ఉండరని తనకు తనే నిరూపించుకున్నాడు జగన్.
బురదలో పొర్లిన పంది తనకంటిన బురదను అందరికీ అంటించడానికి తపన పడినట్టు, జగన్‌రెడ్డి తన అవినీతి కేసుల బురదను ఇతరులకు అంటించి తన పరిపాలన మొత్తం కక్ష రాజకీయాలకు వేదిక చేశాడు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌గ్రిడ్ అవినీతి, పోలవరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలు, సంధ్యా హిల్స్ భూకుంభకోణం, హెరిటేజ్ ఫుడ్స్ కేసు వంటి లెక్కలేని ఆరోపణలతో తనదైన కుట్రల రాజకీయం నడిపించాడు. తన స్వార్ధ రాజకీయాలను కొనసాగిస్తూ, ఆధారాలు లేని కేసుతో 53 రోజులపాటు చంద్రబాబును జైల్లో పెట్టి పైశాచిక ఆనందాన్ని అనుభవించాడు జగన్.
జగన్‌రెడ్డి అండ చూసుకుని గత ఐదేళ్లలో పేట్రేగిపోయిన అధికారులు, నాయకులు ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నారు. కొంతమంది బెయిల్ కోసం కోర్టులచుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. ఇంకొందరైతే.. అరెస్టుల భయంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టులచుట్టూ తిరుగుతున్నారు. జగన్ అనే మాయగాడు తన స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, అక్రమ సంపాదన, దోచుకున్న ప్రాపర్టీని దాచుకునేందుకు ఏస్థాయి అధికారులను, నాయకులను అయినా వాడుకుంటాడని జగన్‌ను నమ్మిన వారికి ఇప్పుడు అర్థమవుతోంది.
తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని అక్రమంగా మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో క్విడ్ ప్రోకో చేసి 58 కంపెనీలకు లాభం చేకూర్చి లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్న నీచ చరిత్ర జగన్‌ది. 13 ఏళ్ల క్రితం.. 2011లో జగన్‌పై తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. 2012 జనవరి 21న మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసులపై ఎలాంటి పురోగతీ లేదనడానికి బయట తిరుగుతున్న జగన్ ఓ ఉదాహరణ. 2012-2013 మధ్య సీబీఐ 11 చార్జిషీట్లు, ఈడీ 9 చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రతి కేసులో ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. మొత్తం 120 మంది నిందితులపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి, ఇంకా 860 మంది సాక్షులను కోర్టు విచారించింది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో మొత్తం 125 పిటిషన్ల విచారణ ప్రస్తుతం పెండిరగ్‌లో ఉంది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లలో దాదాపు 80 శాతం పెండిరగ్‌లో ఉన్నాయి. 11 కేసుల్లో 86 డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయి, ఏ ఒక్క డిశ్చార్జి పిటిషన్ లోనూ తుది తీర్పు వెలువరించలేదు.
ఇండియా ‘‘ఎస్కోబార్’’గా పేరుగాంచిన జగన్‌రెడ్డి.. మచ్చలేని చంద్రుడుమీద ఆధారాలు లేని కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య.
‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పేరున్న లాయర్లను ఢల్లీినుంచి రప్పిస్తున్నారు’’ అంటూ తన అవినీతి సొమ్ముతో నిర్మించుకున్న సాక్షిలో అసత్య ప్రచారం చేసే జగన్మోహన్ రెడ్డికి, తన చెంచా గ్యాంగ్ సీబీఐ జడ్జిని మేనేజ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయినది గుర్తులేదా? జగన్‌రెడ్డి ఆజ్ఞ ప్రకారం ఒక ఆడపిల్లను చెప్పుకోలేని విధంగా 40 రోజులు హింసపెట్టిన అధికారులు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నది గుర్తులేదా? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కింద కోర్టుకి, పైకోర్టుకు పొన్నువొలు సహా కొంతమంది లాయర్లకు ప్రజా ధనాన్ని దోచిపెట్టింది గుర్తులేదా? మనీలాండరింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ ‘సాక్షి’ టీవీకి అనుమతులు పునరుద్ధరించకుండా నిలిపివేసింది గుర్తులేదా? గురివింద గింజ తరహాలో జగన్‌రెడ్డి కింద ఇన్ని నీచమైన తప్పులు పెట్టుకుని తన బురద యధావిధిగా ఎదుటివారికి అంటించడానికి అబధ్దాల రచనలు చేస్తున్నాడు. అసత్య ప్రచారాలు ఇదే పంథాలో కొనసాగితే.. సాక్షి పేపర్ టిష్యూ పేపర్‌గా కూడా పనిరాకుండా పోతుందని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు!!