చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అగ్రస్థానం.. నా సంకల్పం

2047నాటికి తెలుగు జాతిని ఆ స్థాయికి తీసుకెళ్తా: సీఎం చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
Mar 20, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అగ్రస్థానం.. నా సంకల్పం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాభివృద్ధి
  • ప్రతి ఒక్కరికీ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత
  • కంజ్యూమర్ జస్టిస్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం
  • పండుగలతో.. ఆరోగ్యకరమైన జీవనశైలి
  • ఉగాది పచ్చడి మన జీవితాలకు ప్రతిబింబం..
  • ఉగాది వేడుకలలో సీఎం చంద్రబాబు నాయుడు
  • టీటీడీ, వ్యవసాయ పంచాంగాలు ఆవిష్కరించిన సీఎం
  • కూటమి ప్రభుత్వ సంకల్పం సిద్ధిస్తుంది: నాగఫణిశర్మ
  • శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలి
  • పంచాంగ పఠనంలో మాడుగుల నాగఫణిశర్మ వెల్లడి
  • తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వైభవంగా ఉగాది వేడుకలు

అమరావతి (చైతన్య రథం): స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2047నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉగాది పచ్చడి ప్రసాదాన్ని సేవించిన అనంతరం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు పంచాంగ శ్రవణం చేశారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడి మన జీవితాలను ప్రతిబింబిస్తుందని.. షడ్రుచుల తరహాలోనే జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. పండుగలు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పుతాయన్నారు. పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉందని… వాస్తులాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారంలాంటి ఆచారాలు ఇలాంటివేనని సీఎం అన్నారు. యోగా, నేచురోపతిలాంటి వైద్యం కూడా ప్రకృతినుంచి వచ్చిందేనని… ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యమవుతుందన్నారు. నేలను,ప్రకృతిని, నీటిని ఆరాధిస్తామని.. దానిని అందిపుచ్చుకుని నీటిని పరిరక్షించేలా నీటి భద్రత విధానాన్ని తీసుకువచ్చామన్నారు. తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేలా నీటి యాజమాన్యం చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం వేసవి వచ్చినా రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 65 శాతంమేర నీటి నిల్వలున్నాయని తెలిపారు. అందుకే మే 15నాటికే నారుమళ్లు వేసుకోవాలని ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా మూడోమారు గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం తనకుదక్కిందని ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇప్పటి వరకూ రూ.1943 కోట్ల రూపాయలు ఇచ్చామని.. గత పాలకులు పైసా కూడా ఇవ్వలేదన్నారు. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలని.. గోదావరి పుష్కరాలకంటే ముందు
ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కృష్ణా డెల్టాకు, విశాఖకు గ్రావిటీతో నీళ్లు వెళ్తే.. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇంకా రూ.5వేల కోట్ల మేర నిధులు వెచ్చించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అందిస్తున్న కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

విదేశాల్లో మన సంస్కృతికి తెలుగువారే బ్రాండ్ అంబాసిడర్లు
సమీప భవిష్యత్తులో పూర్తిస్థాయి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుందని, వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు ఇలా వేర్వేరు పరిస్థితులు అప్పటికప్పుడు అధ్యయనం చేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చేసిందన్నారు. 30 ఏళ్ల క్రితమే తాను ఐటీ విప్లవాన్ని ఊహించి టెక్నాలజీని ప్రోత్సహించానని.. తద్వారా చాలామంది జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. నాడు తీసుకున్న నిర్ణయంతోనే హైదరాబాద్ ఇప్పుడు నాలెడ్జి ఎకానమీగా ఎదిగిందన్నారు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్ల గురించి చర్చిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలు నేర్పే విలువలను గౌరవించాలని.. ఇక్కడ ఉండే మనకంటే విదేశాల్లోని ప్రవాస తెలుగు వారు వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారన్నారు. తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టటమే తన సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని ప్రాజెక్టు ద్వారా ముఖ్యమైన ముందడుగు వేశామన్నారు. 2024కంటే ముందు ఎవరూ సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి లేదని.. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు జరిగాయని ఆక్షేపించారు. మన దేశంలో ఉమ్మడిగా అంతా కలిసి ఉండే సంప్రదాయం ఉందని.. కొందరు స్వార్ధంతో తల్లికి, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉన్నారని సీఎం అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నది లక్ష్యమని తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీతో మళ్లీ మన జనాభా పెంచేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తల్లికి వందనం ద్వారా ఎంతమంది ఉన్నా ఆర్ధిక సహకారం అందిస్తున్నట్టు వివరించారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులను, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకూ 56 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు. దివ్యాంగశక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత ప్రయాణంతో ఆత్మగౌరవాన్ని కల్పించటంతో పాటు డబ్బులు ఆదా అయ్యేలా చేస్తున్నామని వివరించారు. అర్చకులకు రూ.15 వేల వేతనం ఇవ్వటంతో పాటు ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

నడకలేదు, పరుగులే!

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

కంజ్యూమర్ జస్టిస్లో అగ్రస్థానంలో ఏపీ
సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని పేదరికంనుంచి బయటపడేసేలా జీరో పావర్టీ కార్యక్రమం పీ-4 చేపట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా దీనిని అమలు చేస్తున్నామన్నార. సమాజంలో సంపన్నులైన 10 శాతంమంది అట్టడుగునున్న 20 శాతం మందిని ఆదుకునేలా పీ-4 చేపట్టామని తెలిపారు. తాను పనిచేసేది 5 కోట్లమంది రాష్ట్రప్రజల కోసమని.. అందరి జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం కోసమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ప్రాంతీయ ఎకనామిక్ కారిడార్లు తీసుకువచ్చామని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలైన్లు అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. ప్రజా రాజధాని అమరావతి అద్భుతంగా అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు చేశామని ముఖ్యమంత్రి తెలియచేశారు. తాను అందరివాడిగా ఉండాలని కోరుకుంటున్నానని.. కొందరు దుష్టులు ఏమార్చే కుట్రలు చేస్తారని వారినుంచి అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం యువతకు హామీ ఇచ్చినట్టుగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంకల్పం చేశామన్నారు. ఉగాదిని పురస్కరించుకుని 10,060 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ జారీ చేశామని తెలిపారు. మే 15 నుంచి అక్టోబరు వరకూ వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. గత 21 నెలల్లో 15,940 మంది టీచర్లకు మెగాడీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, 5757 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలు చేశామన్నారు. ఇప్పటి వరకూ 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇక ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. కంజ్యూమర్ జస్టిస్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఓ నివేదిక వచ్చిందని.. వినియోగదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందంజలో ఉందన్నారు. 2047నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పేలా సంకల్పం చేదామని చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి ఆర్ధిక ప్రగతి- ప్రజలకు సుఖ శాంతులు: మాడుగుల నాగఫణిశర్మ
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం సంకల్పించిన ప్రతీదీ ఫలిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు వారు ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్న ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరుతుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యంగా ప్రజాహితంతో ముందడుగులు వేస్తాయని వెల్లడించారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. అందుకే ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు.ప్రత్యేకంగా ఈ ఏడాది సాంస్కృతిక చైతన్యం కలుగుతుందని వివరించారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని,, రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆర్ధిక ప్రగతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా సుఖ శాంతులతో ఉంటారని వివరించారు. పంచాంగ పఠనం చేసిన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మను సీఎం నూతన వస్త్రాలతో సత్కరించారు. అనంతరం టీటీడీ పంచాంగం, వ్యవసాయ పంచాంగంతో పాటు సాంస్కృతిక శాఖ క్యాలండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందించారు. సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవ రంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను సీఎం అందించారు. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. వివిధ దేవాలయాలకు చెందిన పురోహితులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

Next Post

మాట ఇచ్చాం… అమలు చేశాం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist