అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తూ, రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టు లో దండ నాగేంద్ర అనే వ్యక్తి పిల్ వేసిన విషయం తెలిసిందే. ఈపిల్‌పై న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలువినిపిస్తూ పిల్ ను అనుమతించాలని కోరారు.ప్రభుత్వం వైపు నుంచి హాజరైన అడ్వకేట్ జనరల్(ఏజీ) వాదనలువినిపిస్తూ ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. పర్యావరణ అనుమ తులు ఉంటేనే ఇసుకతవ్వకాలకు అనుమతులు ఇస్తామన్నారు. అనుమతుల ఉల్లంఘనలపై ఎన్‌జీటీలో విచారణజరుగుతోంద న్నారు. అడ్వకేట్ జనరల్ స్టేట్‌మెంట్‌ను హైకోర్టు ధర్మాసనం రికార్డు చేసుకుంది. దీంతో ఒకే అంశంపై రెండుచోట్ల విచా రణ జరగడం మంచిది కాదనని హైకోర్టు అభిప్రాయపడిరది. పిల్‌ను తోసిపుచ్చింది.