అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటి షన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ వాయిదా పడిరది. న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వా యిదా మేసింది.గత ప్రభుత్వహయాంలోని ఉచిత ఇసుక విధా నంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఇటీవల కేసు నమోదుచేసిన విషయంతెలిసిందే.ఈ కేసులో ముందస్తు బెయి ల్కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌వేశారు.దీనిపై నవం బర్ 30న విచారణజరగ్గా… చంద్రబాబు తరపు న్యాయవాదు లు వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న ధర్మాసనం… తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిం చింది.సీఐడీ తరపునవాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జన రల్(ఏజీ) శ్రీరామ్ సమయంకోరడంతో విచారణను డిసెంబర్ 6కు వాయిదావేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లి కార్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌పై తదుపరి విచారణ ను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
ఐఆర్ఆర్ కేసులోనూ విచారణ 12కి వాయిదా…
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదుచేసిన కేసులో ముం దస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిర పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల కోసం సీఐడీ తరఫు న్యాయవాదులు సమయం కోరటంతో విచారణ ను హైకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది.