అమరావతి: 2021 ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన 2977 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ లపై రైతాంగంలో అనేక అనుమానాలు, ఆందోళనలకు తావిచ్చిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఏ పంటకు నష్టాన్ని ఏ విధంగా అంచనా వేశారు? దానిని ఏ రైతులకు క్లైయిమ్ చెల్లించారని ప్రశ్నించారు. పారదర్శకత లేకుండా ప్రజలకు ఏ రకమైన సమాచారం అందించకుండా అన్ని వెబ్ సైట్ లలో వున్నాయని వ్యవసాయ శాఖ బుకాయిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ వెబ్ సైట్ ను 2020 సంవత్సరం తరువాత ఏరకమైన సమాచారాన్ని పొందుపరచకుండా గోప్యంగా ఉంచడం అలవాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని కొన్ని సమాధానాలు చెప్పాలని కోరుతున్నాను.
నష్టాన్ని ఏవిధంగా అంచనా వేశారు?
2020-21లో మిర్చి పంట నష్టాన్ని ఏవిధంగా అంచనా వేశారు. 2021లో 4 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేసినట్లు ప్రభుత్వం ప్రచురించిన సీజన్ అండ్ క్రాప్ రిపోర్టులో ఉంది. కేంద్ర మంత్రి సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్ పావిస్ పైనస్ అనే తెగులు ద్వారా ఏపీలో 40 నుంచి 80 శాతం మిర్చి పంట దెబ్బతినిందని కేంద్ర మంత్రి పార్లమెంటుకు సమాధానం ఇచ్చారు. ఈ తెగులు వాతావరణ కారణాల మూలాన ఉద్భవించిందని మంత్రి స్వయంగా చెప్పారు. కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్ మిర్చి పంట వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కింద ఉండటంవల్ల క్లయిములు చెల్లించలేకపోయామని వివరణ ఇచ్చారు. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మిర్చి పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే వైరస్ వాతావరణం వల్ల వస్తే ఇన్సూరెన్స్ ఎందుకు చెల్లించలేదు? ఎకరానికి రూ.80వేలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఈ నాలుగున్నర లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు?
వైఎస్ ఆర్ పంటల బీమా పెట్టినప్పుడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (బిఎంబిఎఫ్ వై) పథకంలోని విధి విధానాలను అనుసరిస్తామని చెప్పారు. బిఎంబిఎఫ్ వై ప్రకారం గత 7సంవత్సరాల్లో మెరుగ్గా ఉన్న 5 సంవత్సరాల ఎకరా దిగుబడిని లెక్కలోకి తీసుకొని సరాసరి ఉత్పత్తి త్రెష్ హోల్డ్ ఈల్డ్ వేసి దాన్ని వాస్తవ దిగుబడితో పోల్చి ఆ పంట ఎకరానికి చేసిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని లెక్కల్లో కి తీసుకొని నష్టాన్ని చెల్లించాలి. ఎకరా మిర్చి పంటకు రూ.80 వేల మేరకు బీమా కవరేజ్ ఉందని మీ జీవోలు చెబుతున్నాయి. దీని ప్రకారం మిర్చి రైతులకు వచ్చిన నష్టమెంత?
ఈ పద్దతి ప్రకారం మీరు చెప్పిన 34 పంటలకు మీరు వేసిన అంచనాల ప్రకారం నష్టం ఎంతని తేల్చారు? పరిహారం ఎంత చెల్లించారు? ఈ సమాచారం ఎక్కడ లభిస్తోందో సూటిగా సమాధానం చెప్పాలి. ప్లానింగ్ శాఖవారు నష్టాన్ని అంచనా వేశామని చెబుతున్నారు. ఈ రాష్ట్రంలోని ప్లానింగ్ శాఖ ద్వారా అమరావతి మీద వచ్చిన జీఎన్ రావు రిపోర్టు, బోస్టన్ రిపోర్టు మరియు జిల్లాల విభజన రిపోర్టు వల్ల ఆ శాఖ మీద ప్రజలకు నమ్మకం కోల్పోయారు. కావున మీరు చెబుతున్న క్రాప్ కటింగ్ ఇక్ స్ పర్ మెంట్ ఏ తేదీన ఎక్కడెక్కడ నిర్వహించారో పబ్లిక్ డొమైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంచగలరా?
ఒక్కక్క పంటకు గ్రామం/ మండలం/జిల్లా యూనిట్ గా పరిగణలోకి తీసుకొని పరిహారం నిర్ణయించాలి. ఈ నేపథ్యంలో ఆ యూనిట్ లో ఉన్న అందరు రైతులకు ఎకరాకు ఒకే మొత్తం చెల్లింపులుగా ఉండాలి. కానీ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకంగా పరిహారం అందడానికి కారణాలు చెప్పగలరా? ప్రతి గ్రామంలో క్రాప్ కటింగ్ ఎక్స్ పర్ మెంట్స్ మండలంలో 5 క్రాప్ కటింగ్ ఎక్స్ పర్ మెంట్, జిల్లాలో మరికొన్ని క్రాప్ కటింగ్ ఎక్స్ పర్ మెంట్స్ ఆధారంగా వెదర్ బెస్డ్ ఎక్స్ పర్ మెంట్ జరుగుతోంది. యావరేజ్ త్రెష్ హోల్డ్ ఈల్డ్ (సరాసరి ఉత్పత్తి)ని అంచనా వేస్తారు. ఆ రిపోర్టును బయట పెట్టగలరా?
ఈ ప్రశ్నలకు బదిలివ్వండి!
1.ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్స్ (ఐసిఎఆర్) ఈ సంస్థ దేశం మొత్తానికి హైదరాబాద్ లో నెలకొంది. 2021లో మిర్చి పంట నష్టాన్ని ఐీసీ ఏ ఆర్ రిపోర్టును బయట పట్టండి.
2. ఆచార్య రంగా యూనివర్శిటీ తయారు చేసిన రైతులకు కలిగిన నష్టం వివరాలను బయట పెట్టండి.
3. రైతుల నష్టం గురించి మీ వ్యవసాయ శాఖ తయారు చేసిన రిపోర్టును బయట పెట్టండి.
4. పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా రిపోర్టును బయట పట్టండి.
5. నవంబర్ 2020-21లో వచ్చిన వరదల వల్ల 3 వేల కోట్ల నష్టం వచ్చిందని మీ ప్రభుత్వమే అంచనా వేసింది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో మిర్చీకి సుమారుగా 3,500 కోట్లు నష్టం వచ్చింది. ఇదికాక అనేక పండ్ల తోటలు, మరియు మిగిలిన పంటలు కూడా అనే క జిల్లాల్లో దెబ్బతిన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగితే మీరిచ్చింది ఎంత?
6.ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రైతులు తాము మోసపోయామని భావిస్తున్నారు?
7.అనంతపురం జిల్లాలో సెంటు భూమి కూడ సాగు చేయని వాలంటీర్ ఖాతాలో లక్షా 40 వేలు రావడానికి ఎలా సాధ్యమైంది?
8.ఇది కూడా మీ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనమని గర్వంగా చెబుతారా? బీడు భూముల్లో పంటలున్నాయని మరికొంతమందికి పరిహారమిచ్చారట. అది ఎలా సాధ్యమైంది?
గతంలో నియోజకవర్గ రైతుల్ని మోసం చేసిన వ్యవసాయ మంత్రి చేతకాక చంద్రబాబుపై విరుచుకుపడటం విడ్డూరం. ఆయన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఏం చేశారని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కు, వ్యవసాయ మంత్రి కాకాణికి దమ్ముంటే మా ప్రభుత్వ హయాంలో రైతుల కోసం ఏ పథకం కోసం ఎంత ఖర్చు పెట్టామో, మీ ప్రభుత్వంలో మీరు ఏ ఏ పథకాల కింద ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.