హంతకులే వగలమారి ఏడుపులు ఏడ్చి..శిక్షల నుంచి తప్పించుకునే సిగ్గుమాలిన దౌర్భాగ్యపు రాజకీయం జగన్ సొంతం. జగన్ అనుసరించే ఒరవడినే యావత్ వైసీపీ వారసత్వం చేసుకుంది. వాస్తవాలను సమాధి చేయడానికి అసత్య, అవాస్తవాలను ప్రచారంలోకి తేవడం జగన్ మార్క్ రాజకీయం. తప్పులు బయల్పడే సందర్భం వచ్చిన ప్రతిసారీ.. రాష్ట్రాన్ని ఏమార్చి అలజడి సృష్టించే సంఘటనలకు పురుడు పోయడం వైసీపీకి అలవాటు. ప్రస్తుతం విజయవాడ.. చరిత్ర ఎరుగని విపత్తు ఎదుర్కొంటోంది. గత 4 రోజులుగా దాదాపు మూడులక్షల జనం జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపానికి.. వైసీపీ బుడమేరు పాపం తోడవ్వడంతో.. బెజవాడను వరద ముంచెత్తింది. కొల్లేరు సరస్సుకు పరిగెత్తే బుడమేరు సామర్థ్యం 11వేల క్యూసెక్కులు. ఎడతెరిపిలేని వానలతో బుడమేరుకు 80వేల క్యూసెక్కుల వరద రావడం.. అప్పటికే బుడమేరును తవ్వేసుకున్న వైసీపీ రాక్షసుల పాపం కలగలిసి.. నగరం ఉత్పాత్తాన్ని ఎదుర్కొంటోంది. మట్టి తినడానికి అలవాటుపడిన జగన్ సర్కారు.. బుడమేరు కట్టలను అడ్డగోలుగా తెగ్గొసి సొమ్ము చేసుకున్న దుర్మార్గానికి పర్యావసానమే విజయవాడకు ప్రస్తుత దుస్థితి. పైగా.. అధికార తెంపరితనంతో బుడమేరును అడ్డగోలుగా ఆక్రమించి గర్భంలో భారీ భవంతులు నిర్మించి.. బుడమేరును సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న వైసీపీ పాపమే బెజవాడ ప్రజలను వెంటాడుతోంది. పైనుండి వచ్చే వరద కిందికి దిగే మార్గం లేకపోవడమే.. నగరం ఎదుర్కొంటోన్న ఉత్పాతానికి ప్రధాన కారణమన్నది నిపుణులు చెప్తోన్న మాట.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బుడమేరును పోలవరం కుడి కాల్వకు కలిపి, ఆ నీటిని కృష్ణా నదికి తరలించే ప్రయత్నం చేసి వదిలేశారు. 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు.. బుడమేరు మెలికలను తొలగించి, పోలవరం కుడి కాల్వకు అనుసంధానించే ప్రణాళికతో 80శాతం పనులు పూర్తిచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. మిగిలిన పనులవైపు కన్నెత్తి చూడలేదు. ఆ తప్పిదమే నేడు బెజవాడ ప్రజలను భయం గుప్పిటకు చేర్చింది. ప్రస్తుత వరద నేపధ్యంలో జగన్ పాపాలు చర్చకు వస్తుండటంతో.. డైవర్షన్ పాలిట్రిక్స్‌కు తెరలేపింది వైసీపీ. వరద బాధితుల రక్షణకు రోజుకు 22 గంటలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నాలు అందులో భాగమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోడానికి వరదను నగరానికి మళ్లించారన్న తప్పుడు కథనాలను విషపుత్రిక సాక్షిలో పేర్చడం సహించరాని దుర్మార్గం. బుడమేరు రూపురేఖలు కూడా తెలియని అజ్ఞాని.. మిడిమిడి జ్ఞానంతో హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విస్తుపోయే అంశమే. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ డైవర్షన్ పాలిట్రిక్స్‌కు తెరలేపుతూనే.. ఏమీ తెలియని నంగనాచిలా తాడేపల్లి ప్యాలెస్‌నుంచి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు. వరద తగ్గిన ప్రాంతంలో మొక్కుబడి పర్యటన చేసి, ప్రజా రక్షణకు అహోరాత్రులు శ్రమిస్తోన్న ప్రభుత్వంపై నిందారోపణలకు దిగడం జగన్ చేతగానితనానికి నిదర్శనం.
తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకు చెందిన సినీనటి కాదంబరి జెత్వానిపై కుట్రపూరిత కేసు బనాయించి, ఆమె కుటుంబాన్ని అక్రమంగా జైల్లో నిర్బంధించి, అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఉదంతం యావత్ రాష్ట్రాన్ని విస్మయానికి గురి చేసింది. జెత్వానికి అండగా నిలబడతామని కూటమి ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో.. గుట్టు రట్టవుతుందన్న భయంతో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఉదంతాన్ని ప్రచారంలోకి తెచ్చారు. మహిళల హాస్టల్ వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ గందరగోళం సృష్టించి.. జెత్వాన్నీ అంశాన్ని మరుగునపెట్టే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపాడు జగన్. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం దృష్టి మళ్లించడానికి వైసీపీ వీరవిధేయులు పన్నిన డైవర్షన్ రాజకీయ కుట్రేనన్న రహస్యం చివరకు బట్టబయలైంది. ప్రభుత్వం నిర్వహించిన లోతైన దర్యాప్తులో ఎక్కడా హిడెన్ కెమెరాలు ఉన్న ఆనవాళ్లే లేవు. గుడ్లవల్లేరు ఘటన వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే తప్ప వాస్తవం కాదని అధికారులే నిర్థారించడం విస్మయాంశమే.
అధికారదాహం.. నారాసుర రక్తచరిత్ర:
జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఉచ్చనీచాలు లేని సాక్షి పత్రికతో వివేకా హత్య కేసును చంద్రబాబుపై నెట్టేందుకు ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. ఒక్కొక్కటిగా వెలుగు చూసిన నిజాలతో.. వేళ్లన్నీ జగన్‌నే చూపిస్తున్నాయి. అప్పట్లో అధికార దాహంతో హత్య కేసును చంద్రబాబుపైకి నెట్టి డైవర్షన్ పాలిట్రిక్స్‌కు తెరలేపారన్న వాస్తవం కొద్దికాలంలోనే బయటపడిరది.
అధికార దాహం.. కోడికత్తి దాడి:
అధికార దాహంతో జగన్ నిర్వహించిన అప్పటి పాదయాత్రకు ఆనాటి సీఎం చంద్రబాబు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కానీ చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చెరిపేయడానికి, సానుభూతిని ఓటుగా మలచుకోవడానికి జగన్ ఆడిన హైవోల్టేజ్ డ్రామా కోడికత్తి దాడి. జగన్ వీరాభిమాని శ్రీనుతో ముందస్తు ప్లాన్ ప్రకారం కోడి కత్తితో దాడి చేయించుకుని, ఏపీని వదిలి హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన జగన్ హైడ్రామాను రక్తికట్టించాడు. చంద్రబాబుకున్న ప్రజాదరణను చెడగొట్టేందుకు జగన్ ఆడిన డైవర్షన్ డ్రామా కోడికత్తి అని తరువాత తేలింది.
ఓటమిని జీర్ణించుకోలేకే వరుస అల్లర్లు
2019 నుండి 2024 వరకు అధికార మత్తులో రాష్ట్రాన్ని గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల ఛీత్కారానికి గురయ్యాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ చరిత్రలోలేని విధంగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. వైనాట్ 175 అని గొంతు చించుకున్న జగన్‌కు కేవలం 11 స్థానాలు దక్కడం గగనమైంది. అయితే.. ఓటమిని జీర్ణించుకోలేని జగన్.. ప్రభుత్వంపై బురదజల్లి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్ భక్త అధికారులతో రాష్ట్రంలో అల్లర్లకు తెరలేపాడు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, హత్యలకు పాల్పడ్డారు. వైసీపీ ఓటమి అంశం చర్చకు రాకుండా చేసేందుకు జగన్ అనుసరించిన డైవర్షన్ పాలిటిక్స్ కుట్రే.. రాష్ట్రంలో వైసీపీ సృష్టించిన అల్లర్లు.
రాజధాని కట్టలేకే.. మూడు రాజధానుల బిల్లు
పాలనపై తన అజ్ఞానాన్ని గద్దెనెక్కి ప్రజావేదిక కూల్చివేతతోనే బయటపెట్టుకున్నాడు జగన్. అలా మొదలైన విధ్వంస పాలన రాష్ట్ర రాజధానిని కూల్చేస్థాయికి చేరింది. రాజధానిని నిర్మించే సత్తా లేక, విపక్ష ప్రశ్నలకు జవాబు చెప్పలేక, ప్రజా వ్యతిరేఖతను కప్పిపుచ్చేందుకు మూడు రాజధానుల బిల్లు తెచ్చాడు జగన్. మూడు ప్రాంతాలను విభజించి పాలించే దుర్మార్గపు కుట్రకు తెరలేపాడు. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానులు కాదు కదా… ఉన్న రాజధానికి మూడు ఇటుకలు కూడా పేర్చలేని అసమర్ధ సీఎంగా ప్రజల ఛీత్కారానికి గురయ్యాడు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చడం కోసమే మూడు రాజధానులను తెరపైకి తెచ్చాడన్న డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థంకానిదేం కాదు.
వినుకొండలో అసత్య ప్రచారం
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన వైసీపీని సానుభూతి జాకీలు పెట్టి లేపాలని జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి వినుకొండలో వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నానా హడావుడి చేశాడు. తాడేపల్లి నుంచి ముందస్తు ప్రణాళికతో వినుకొండ వరకు వైసీపీ క్యాడర్‌ను పోగేసి రోడ్డు షో చేశాడు. బాధితుడి కుటుంబాన్ని గాలికొదిలేసి.. డ్రామాను రక్తికట్టించాడు. చావుకు, పెళ్లికి ఒక్కటే మంత్రమన్నట్టు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం మానేసి.. అధికారంలో తాను ఉండివుంటే.. అంటూ పిచ్చి స్క్రిప్ట్ అప్పగించి అభాసుపాలయ్యాడు. సానుభూతి కోసం వెళ్లిన జగన్… డైవర్షన్ పాలిట్రిక్స్ చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు.
యువగళంతో వైసీపీకి భారీ డ్యామేజ్..చంద్రబాబు అరెస్ట్
జగన్ రౌడీ పాలనపై తెదేపా యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రను అడ్డుకునేందుకు జగన్ తెచ్చిన జీఓ నెంబర్-1. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్.. తన పాదయాత్రను కుప్పంలోని శ్రీవరదరాజులస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభించారు. ఏదోవిధంగా పాదయాత్రను అడ్డుకోవాలన్న పాలకుడు జగన్ ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. యువగళం జనగళమవ్వడంతో.. యువతలో వైసీపీ పాలనపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. యువగళానికి బ్రేకు వేయడానికి జగన్ అనుసరించిన డైవర్షన్ పాలిటిక్సే.. విజనరీ లీడర్ చంద్రబాబు అరెస్ట్. అర్థంపర్థం లేని కేసు బనాయించి, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే జగన్ భక్త ఐపీఎస్‌లను ఉసిగొల్పి చంద్రబాబును దుర్మార్గంగా అరెస్టు చేయించాడు. ఆ సమయంలో యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర తాత్కాలిక విరామం తీసుకుందే తప్ప.. లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. చంద్రబాబు విడుదల అనంతరం యువనేత యువగళం పాదయాత్రను పూర్తిచేశారు. డైవర్షన్ పాలిట్రిక్స్‌నే నమ్ముకున్న జగన్ కుట్రలు చివరకు జగన్‌నే ముంచేశాయి. రాజకీయ పరాభవంకంటే అథమస్థాయిలో.. పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణంగా జగన్ ఓటమి పాలయ్యాడు. చెరపకురా.. చెడేవు! అని పెద్దలు అనేది అందుకే. అయినా.. అజ్ఞాని జగన్‌కు ఇంకా తత్వం బోధపడకపోవడం విచారకరం!
-సిరి కొడాలి, పొలిటికల్ అనలిస్ట్