చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నేను యజ్ఞం చేస్తుంటే..రాక్షస వైసీపీ అడ్డుపడుతోంది!

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

by చైతన్యరధం
Sep 5, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నేను యజ్ఞం చేస్తుంటే..రాక్షస వైసీపీ అడ్డుపడుతోంది!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కష్టకాలం పట్టని వైసీపీకి ప్రజలే బుద్ధిచెప్పాలి
  • రాజకీయ నేరస్తులకు సంఘ బహిష్కరణే శిక్ష
  • ముమ్మరంగా సాగుతోన్న వరద సహాయక చర్యలు
  • ఎక్కడ ఎలాంటి అవసరమొచ్చినా నేనుంటా..
  • బుడమేరు గండ్లు పూడ్చే పని మొదలైంది..
  • విజయవాడకు బుడమేరే సమస్యగా మారింది
  • వైసీపీ కబ్జాలవల్లే ఇంతటి ఉపద్రవం..
  • నీటి ప్రవాహ శాశ్వత పరిష్కారంపై దృష్టి పెడతా
  • అమరావతి మునిగిందన్న అసత్య ప్రచారం దారుణం
  • ప్రైవేట్‌ బోట్లకు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది
  • బాధితుల నుంచి వసూలు చేస్తే జైలుకే..
  • వరదపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం..
  • ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు..
  • సాయం చేస్తోన్న అందరికీ ధన్యవాదాలు

విజయవాడ (చైతన్య రథం): చరిత్ర ఎప్పుడూ చూడని విపత్తు ఎదురైందని.. ఆపదలోవున్న ముంపు బాధితులకు ఒకవైపు సహాయ సహకారాలు అందిస్తూనే మరోవైపు అడ్డంకులు సృష్టిస్తున్న రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. బుధవారం ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
‘నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఇది. ప్రజలకు జరిగిన నష్టం అపారం. ఏడు లక్షలమందికి సహాయమందించాల్సిన పరిస్థితిలో సీఎస్‌ దగ్గరినుంచి మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి సేవలందిస్తున్నాం. బుధవారం ఉదయం 11.30కు 91శాతంమేర బాధితులకు ఆహారాన్ని అందించగలిగాం. ఎప్పటికప్పుడు రోజుకు రెండు మూడుసార్లు ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని లోపాలను సరిచేసుకుంటూ స్పష్టమైన ప్రణాళికతో సేవలందిస్తున్నాం. ఎక్కడైతే ఆహారం అందలేదో ఆయా ప్రాంతాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆహార నాణ్యతను పరీక్షించాకే బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాం’ అని సీఎం స్పష్టం చేశారు.

యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చివేత పనులు
‘వరద నియంత్రణ చర్యల్లో భాగంగా బుధవారం మంత్రులు నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు బుడమేరుకు గండ్లుపడిన ప్రాంతంలోనే ఉండి వాటిని పూడ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైతే నీళ్లు లేవో ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తున్నాం. 182 ట్యాంకర్లు ద్వారా పెద్దఎత్తున మంచినీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నాం. మునిసిపల్‌ నీటి సరఫరానూ పునరుద్ధరించాం. ఈ నీటిని పూర్తిగా పరీక్షించాకే తాగునీటికి ఉపయోగించేలా ఆదేశాలిచ్చాం. 62 వైద్య శిబిరాల ద్వారా వైద్యసేవలతోపాటు అవసరమైన అన్ని మందులూ అక్కడే అందిస్తున్నాం. ఇప్పటికే 50 వరకు ఫైర్‌ఇంజిన్లు వచ్చాయి. వీటి సహాయంతో ఇళ్లలోని బురదను శుభ్రం చేసే పనులు ప్రారంభమయ్యాయి. మరో 50వరకు అదనంగా ఫైర్‌ ఇంజిన్లు వస్తాయి. 2,100మంది పారిశుద్ధ్య సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రొక్లెయిన్లు, టిప్పర్లు పెట్టి చెత్తాచెదరాన్ని తొలగించే పనులను పెద్దఎత్తున చేపడుతున్నాం.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

నమో..నారా  తరగని అనుబంధం

ఎక్కడా అపరిశుభ్రత అనే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. ఎక్కడైనా మృతదేహాలుంటే వాటికి పోస్టుమార్టమ్‌ నిర్వహించి కుటుంబసభ్యులకు అందిస్తాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తాం. పశువుల కళేబరాలను సైంటిఫిక్‌గా డిస్పోజ్‌ చేస్తాం. దాదాపు 32మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారు. 179 సచివాలయాలకు 179మంది సీనియర్‌ అధికారులు లేదా ఐఏఎస్‌ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టాం. మంగళవారం రాత్రి 9,09,191 ఆహార ప్యాకెట్లను అందించాం. బుధవారం ఉదయం 6 లక్షల ఆహార ప్యాకెట్లతోపాటు 8,50,000 కార్టన్ల నీటి బాటిళ్లను, 3 లక్షల లీటర్ల పాలను పంపిణీ చేశాం. 5 లక్షల బిస్కట్‌ ప్యాకెట్లను కూడా అందించాం. 5 లక్షలమందికి లంచ్‌ ఏర్పాట్లు చేశాం. బాధితులు సరైన విధంగా ఫీడ్‌బ్యాక్‌ అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఫీడ్‌బ్యాక్‌ను సరైన విధంగా విశ్లేషించి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఇబ్బందుల్లో ఉన్న గర్భిణీలకు ప్రత్యేక ఏర్పాట్లతో సేవలందించేందుకు ఆదేశాలిచ్చాం’ అని సీఎం వివరించారు.

వరదపై నిరంతర పర్యవేక్షణ
పైన ఎక్కడినుంచైనా ఇన్‌ఫ్లో వస్తుందా? అనే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పరిశీలన చేయిస్తున్నాం. డిపార్ట్‌మెంట్‌ సమాచారంతోపాటు అందుబాటులో ఉన్న వాస్సర్‌ ల్యాబ్స్‌, ఇతర సమాచారాన్ని విశ్లేషించి.. అప్రమత్తం చేసే విషయమై చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 7 మి.మీ. మేర వర్షపాతం క్యాచ్‌మెంట్‌ ఏరియాలో నమోదైంది. దీనివల్ల ఏడెనిమిది వేలు క్యూసెక్కులు వచ్చేందుకు వీలుంటుంది. ఇది కూడా మూడునాలుగు గంటలే ఉంటుంది. భవానీపురంలోకి వచ్చిన నీళ్లు కొంత ప్రాంతాన్ని ముంచేశాయి. ప్రధానంగా ఈరోజు ఇబ్బందులకు కారణం బుడమేరు. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవాడకు సమస్యగా తయారైంది. బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగు, పులివాగు, లోయబాగు, గడ్డుమడుగ లోయ ఇలా వివిధ వాగుల నుంచి నీరు వస్తోంది. అయితే 20 ఏళ్లుగా విజయవాడ పట్టణం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్దఎత్తున ఆక్రమణలు పెరిగాయి. దీనివల్ల బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు సరిగా వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. బుడమేరు 11 వేల క్యూసెక్కులను తట్టుకునేలా డిజైన్‌ చేశారు. అయితే ఇప్పుడు 70 వేల క్యూసెక్కుల నీరు రావడంతో వరద పోటెత్తింది. 1970లో దీన్ని మరమ్మతు చేసి విస్తరించాలని ప్రయత్నం చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడికాలువకు మళ్లించాలనే ప్రతిపాదన చేశారు. అయితే వీటీపీఎస్‌లో సమస్యలు వచ్చాయని అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు. వెలగలేరులో పెట్టిన రెగ్యులేటర్‌ ఉన్నా అది చాలా చిన్నది.

కొద్దిమొత్తంలో మాత్రమే వరద నియంత్రణకు ఉపయోగపడుతుంది. 2005లో పెద్ద వరద వచ్చింది. అప్పుడు మేమంతా ఆందోళన చేశాం. ఇక్కడున్నవారు కూడా పెద్దఎత్తున ఆందోళన చేశారు. వరద నియంత్రణ పనులు చేస్తామని రాజశేఖరరెడ్డి చెప్పినా అదికూడా వదిలేసిన పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చాక రూ.500 కోట్లు మంజూరు చేశా. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరుకు ఉన్న గండ్లను కనీసం పూడ్చివుంటే, ఆక్రమణలు లేకుండావుంటే కొంతవరకు సమస్య పరిష్కారమయ్యేది. ఎప్పుడైతే 2019 నుంచి ఆక్రమణలు బాగా పెరిగాయో.. కాల్వేలేకుండా చేసే పరిస్థితి చేశారు. ఒకపక్క కృష్ణా నుంచి వచ్చిన నీళ్లు, మరోవైపు బుడమేరు నుంచి వచ్చిన నీళ్లతో ఎప్పుడూ లేని విధంగా బీభత్సంగా వరద వచ్చింది. 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారా? లేదా? అధికారంలో ఉంటే బుడమేరుకు గండ్లు పడితే ఎక్కడ నిద్రపోయారు. ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి ఎదుటివారిపై బురదజల్లడం నీచాతినీచం’ అని వైసీపీపై చంద్రబాబు దుమ్మెత్తిపోశారు.

చాలామంది అనుకుంటున్నట్లు ఒక్క కృష్ణా నది వల్లే వరదలు రాలేదు. కృష్ణా నది కంటే బుడమేరు వల్లే నష్టం ఎక్కువ జరిగింది. ఎక్కడికక్కడ కబ్జారాయుళ్లు వచ్చి కబ్జాచేయడం వల్లే పరిస్థితులు దాపురించాయి. అవన్నీ సర్వేచేయమంటున్నాం. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని కూడా దోచేశారు. ఇది చాలా దుర్మార్గం. కాలువకు సపోర్టునిచ్చే గట్ల మట్టిని కూడా దోచుకున్నారు. దీనిమీద కూడా దృష్టిసారించి ప్రజాద్రోహులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు పరిష్కారం కావు. ఒకవ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడిరది. అమాయకులంతా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరముంది. మేధావుల ఆలోచనలను కూడా తీసుకొని శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరుకు వచ్చే నీళ్లని కొల్లేరుకు పంపించడం, లేదంటే కృష్ణానదికి పంపించడం ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దానిపైనా పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, టీచర్లు, పెన్షనర్లు, ఏపీ జ్యాక్‌ తదితర ఆర్గనైజేషన్లు, అనుబంధ ఉద్యోగ సంఘాలు వరద సహాయానికి ముందుకొచ్చాయి. బేసిక్‌ ఒకరోజు వేతనాన్ని వరద బాధితుల సహాయార్థం ప్రకటించాయి. అదేవిధంగా సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ కూడా బేసిక్‌ ఒకరోజు వేతనాన్ని ఇస్తామన్నారు. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరం కలిసి సమష్టిగా విపత్తును ఎదుర్కోవాల్సిన అవసరముంది. ఒకరిద్దరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలందరూ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. 45 డ్రోన్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. సాయంత్రానికి చాలావరకు వరద తగ్గే అవకాశముంది. రేపటికి చాలావరకు కంట్రోల్‌లోకి వస్తుంది. ఒకట్రెండు రోజుల్లోనే సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నాం. ప్రజలు వ్యాధుల బారిన ప్రబలకుండా ఏమైతే చేయాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బాధితులందరికీ న్యాయం చేసేలా ముందుకెళ్తాం. నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నా’మని చంద్రబాబు వివరించారు.
ఎదురుదాడి చేయడం దుర్మార్గం
చేయాల్సింది చేసి ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమం చేయడం దుర్మార్గం. అహంభావం.. ధిక్కార ధోరణికి పరాకాష్ట. ఒక వ్యక్తి అసమర్థత వల్ల లక్షలాది ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి దాపురించింది. తప్పుచేసిన వారు గమ్మున ఉండకుండా తిరిగి ఎదురుదాడి చేసే కొత్తవిద్య నేర్చుకున్నారు. అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటివారిని అమరావతిలో ముంచాలి. అమరావతిని శ్మశానం అంటున్నవారిని అక్కడే పూడ్చాలి. అలా మాట్లాడుతున్న వారికి బుద్ధిజ్ఞానం ఉండాలి. ప్రజలు వింటున్నారని ఎదురుదాడి చేస్తారా? ఎదురుదాడి చేస్తే ప్రజలే బుద్ధి చెప్పి సంఘ బహిష్కరణ చేయాలి. మళ్లీ వర్షం వస్తుందని, బుడమేరుకు వరద వస్తుందేమోనని కంగారుపడుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో దుర్మార్గంగా మాట్లాడతారా? సమాజహితంపై బాధ్యత లేదా?’ అని వైసీపీని నిలదీశారు.
‘ఎక్కడో ఉండే సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు మామూలు వ్యక్తులు వచ్చి మావంతు సాయం చేస్తామంటున్నారు. ఎంప్లాయిస్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు సహాయం చేశారు. బురదలో తిరగని అధికారులను కూడా ఫీల్డ్‌లో పెట్టి పనిచేయిస్తున్నాం. తప్పుడు మాటలు మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాల్సిందే. ఈరోజు ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడి పరిస్థితిని చూసేందుకు రమ్మన్నాను. ఇలా అన్ని విధాలా మేము చేయాల్సిందంతా చేస్తుంటే రాక్షస మూక అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

డబ్బులడిగితే కేసులుపెట్టి, జైల్లో పెడతాం
ప్రజలకు అందుబాటులో ఉన్న బోట్లువారు ఎవరైనా బాధితులను డబ్బులకు డిమాండ్‌ చేస్తే అలాంటివారిపై కేసులుపెట్టి జైల్లో పెడతాం. ప్రజలు కూడా ఎవరికీ ఎట్టిపరిస్థితుల్లో డబ్బులు చెల్లించొద్దు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా తీసుకొని నిత్యావసరాల రేట్లు పెంచితే చట్టప్రకారం చర్యలు తీసుకోమని ఆదేశించాం. ఇప్పటికే విజిలెన్స్‌ నిఘా కొనసాగుతోంది. కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక అవుట్‌లెట్ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతా’మని సీఎం చంద్రబాబు వివరించారు.

Previous Post

ఎవరికి తెలీదు.. నీ డైవర్షన్‌ పాలిట్రిక్స్‌?

Next Post

బాధితుల వద్దకు బాబు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

కార్యకర్త
@ May 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-05-2026

svrayudu
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!
ఆంధ్రప్రదేశ్

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

కార్యకర్త
@ May 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
Load More

ముఖ్య వార్తలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist