- ఎన్నికల సమయంలో జగన్‌రెడ్డి బీసీల జపం: అచ్చెన్నాయుడు
- బీసీల అభ్యున్నతే ప్రధాన అజెండాగా టీడీపీ`జనసేన మేనిఫెస్టో: కొల్లు రవీంద్ర
- టీడీపీ`జనసేన అధికారంలోకి రావాలి: సీపీఐ రామకృష్ణ
- జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ బీసీల ద్రోహి: పోతిన మహేష్
- టీడీపీ ఎప్పుడూ బీసీల పక్షమే: బుద్దా వెంకన్న
- టీడీపీతోనే బీసీల అభివృద్ధి: నాగుల్ మీరా
విజయవాడ: రాష్ట్రం మొత్తాన్ని సొంత సామాజిక వర్గం చేతుల్లో పెట్టి, బీసీలకు రాజ్యాధికారం కల్పించా, సామాజిక న్యాయం చేశా అంటూ జగన్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెప్పటం అత్యంత దుర్మార్గమని బీసీ నేతలు ధ్వజమెత్తారు. బీసీల నిధులు లాక్కుని, ఆధికారం మాత్రం సొంత వారికి కట్టబెట్టి పెత్తనం చెలాయిస్తూ అదే మీ బతుకు అనేలా జగన్ రెడ్డి వెక్కిరిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను జగన్‌రెడ్డి ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ`జనసేన ప్రభుత్వంతోటే బీసీలకు బంగారు భవిత అన్నారు. బీసీలకు ప్రభుత్వ నమ్మక ద్రోహంపై ఐక్య పోరాటం పేరిట విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు. తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న సభాధ్యక్షుడిగా, టీడీపీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి నిర్వహణలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో జగన్‌రెడ్డి బీసీల జపం: అచ్చెన్నాయుడు
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడు తూ..కుంభకర్ణుడు గాఢ నిద్ర వదిలినట్లు ఎన్నికల సమ యంలో జగన్ నిద్రలేచి బీసీల జపం చేస్తున్నాడన్నారు. బీసీల ఓట్లను తొలగించి, వారి పథకాల్లో కోత పెట్టేం దుకే కులగణన పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వే చేయి స్తోందని విమర్శించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు స్వతంత్ర భారత దేశంలో బీసీలంటే కేవలం పల్లకీ మోసే కార్మికులుగా మాత్రమే ఉన్నార న్నారు. బీసీలకు ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశాలి చ్చారు. బలహీనవర్గాల వారు బలవంతులవ్వడమే లక్ష్యంగా ప్రోత్సహించారు. చదువుల కోసం స్కూళ్లు పెట్టారు. రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఉద్యో గావకాశాలు కల్పించి ఎదిగేందుకు అండగా నిలిచారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను మళ్లీ వారి పల్లకీ మోసే కూలీలుగా మారుస్తున్నాడు. రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేశాడు. ప్రభుత్వ అరాచకాలు, అక్ర మాలను ప్రశ్నించిన బీసీలపై తప్పుడు కేసులు పెడుతు న్నారు. దాడులు చేస్తున్నారు. ఇలాంటి జగన్‌రెడ్డికి సామాజిక న్యాయంపేరుతో యాత్రలు చేసే అర్హత ఉందా? విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల ప్రమేయం, అనుమతి లేకుండా రాష్ట్రంలోని ఏ బడుగు బలహీన వర్గానికి చెందిన మంత్రైనా చిన్న ఫైలుపై సంతకం చేయగలడా అని ప్రశ్నించారు. నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాని పదవులు బీసీలకిచ్చాడు. బీసీలను అవహేళన చేసేలా ఇచ్చిన పదవులపై ప్రతీ ఒక్కరూ కళ్లు తెరవాలి. బీసీగా పుట్టిన పాపానికి ద్వారకా తిరుమల రావును డీజీపీ కాకుండా అడ్డుకున్నారు. సీనియారిటీలో ఎక్కడో కింద ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డీజీపీ ని చేశారు. బీసీల కోసం బీసీ భవన్స్,కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి టీడీపీ భూములిచ్చి, నిదులు మంజూరు చేస్తే జగన్‌రెడ్డి ఎందుకు వాటిని నిలిపివేశాడో సమాధా నం చెప్పాలి. టీడీపీ-జనసేన కలిసి ప్రతి కులానికి న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లబోతు న్నాం. టీడీపీ కట్టిన 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పేదలకు పంచకుండా జగన్ పాడుబెడుతున్నారు. జగన్‌రెడ్డి అధి కారంలోకి వచ్చాక ఏపీలో 70మంది బీసీలను హత్య చేశారు. పదిహేనేళ్ల బీసీ పిల్లాడిని నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్ పోసి తగులబెట్టేస్తే ప్రశ్నించలేరు, మరో బీసీ నేతను నడిరోడ్డుపై పీక కోసి చంపేస్తే నోరెత్తలేని బీసీ మంత్రులు ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు మళ్లీ బతికి బట్ట కట్టాలంటే తెలుగుదేశంపార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయ మన్నారు. నా ఎత్తు, బరువు గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ బీసీల సమస్యలపై ఈ బీసీ మంత్రులు పెట్టడం లేదు. తలకిందులుగా తపస్సు చేసినా.. నా పర్సనాలిటీ వారికి రాదు అని ఎద్దేవా చేశారు. వెంటి లేటర్‌పై ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బీసీలంతా ఏకమై త్వరలోనే పాతిపెట్టడం తధ్యమన్నారు.
బీసీల అభ్యున్నతే ప్రధాన అజెండాగా మేనిఫెస్టో: కొల్లు రవీంద్ర
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా జగన్‌రెడ్డికి రాష్ట్రం లోని బీసీలను ఏవిధంగా అణచివేయాలి అనే ఆలోచన తప్ప మరో పని లేకుండా పోయింది. చట్ట సభల్లో ప్రశ్నిస్తున్నందుకు అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రద్దు చేసి రాజకీయంగా ఎదగనీయకుండా చేశారు. అయ్యన్న పాత్రుడిపై రేప్ కేసుపెట్టారు. బుద్దా వెంకన్నపై హత్యాయత్నం చేశారు. అన్ని రకాలుగా బీసీలపట్ల జగన్‌రెడ్డి వివక్ష చూపుతూనే ఉన్నారు. అందుకే 54 సాధికార సమితుల్ని ఏర్పాటు చేశాం. ప్రతి కులం గురించి పరిశోధించి, వారి స్థితి గతుల్ని తెలుసుకుని ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. బస్సు యాత్రలు చేస్తున్న మం త్రుల్ని, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నా.. పదిహేనేళ్ల బాలుడి పై పెట్రోల్ పోసి చంపేస్తే ప్రశ్నించలేని మంత్రులు ఎవరికోసం బస్సు యాత్రలు చేస్తున్నారు? ప్రతి కులం నుండి వారి సమస్యలు తెలుసుకుంటాం. బీసీల అభ్యు న్నతే ప్రధాన అజెండా గా టీడీపీ- జనసేన మేనిఫెస్టో ఉంటుందని స్పష్టంచేశారు. బీసీలను ఓట్లు అడిగే నైతి క అర్హత కూడా వైకాపానేతలు కోల్పోయారన్నారు. బీసీ ల దమ్ము ఏంటో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముఖ్య మంత్రికి తెలిసొచ్చేలా చేద్దామన్నారు. వైసీపీకి బీసీలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన అధికారంలోకి రావాలి: సీపీఐ రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ.. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. విదేశీ విద్య లాంటి విద్యా పథకాలు దూరం చేశారు. సామాజి కంగా ఎదగాల్సిన వర్గాలను అణగదొక్కి సామాజిక అన్యాయానికి పాల్పడుతూ.. సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇంతకన్నా ద్రోహం మరోటి ఉంటుందా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ, మళ్లీ జగన్ ఎందుకు రాకూడదు అంటూ సభలు పెట్టి ప్రజల్ని మభ్యబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే బతకడం కష్టం. బీసీ ఎస్సీ ఎస్టీలకు అధికారమిచ్చి, పెత్తనం మాత్ర రెడ్ల చేతుల్లో పెట్టారు. ఏ ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ రెడ్ల ఆమోదం లేకుండా చిన్న ఫైలుపై కూడా సంతకం చేసే పరిస్థితి లేదు. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ముఠా అభివృద్ధి చెందిందే తప్ప.. బీసీ వర్గాలు అభివృద్ధఇ చెందలేక పోయారు. టీడీపీ ` జనసేన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని, అయితే చట్ట సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కమ్యూనిస్టులకు కూడా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ ఎప్పుడూ బీసీల పక్షమే: బుద్దా వెంకన్న
జగన్ ప్రభుత్వం బీసీలను చూసి ఓర్వలేకపోతోం దని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీసీలు ఇచ్చే విలు వైన సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఏ గట్టున ఉంటాయో, తెలుగుదేశం అదే గట్టున ఉంటుంది. బీసీల మీటింగ్‌కు సమావేశ మందిరం ఇవ్వకుండా ఫంక్షన్ హాల్ ఓనర్లను ప్రభుత్వం భయపెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి హనుమంతుడిలా వెంట ఉండి సాయపడుతున్నందున ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయు డికి గద బహూకరించాం. ఉత్తరాంధ్ర నుంచి ఇటు చిత్తూరు వరకు వైసీపీ శ్రేణులను తరిమి తరిమి కొడతా డని ఆయనకు గద ఇచ్చామని వెంకన్న ఉద్ఘాటించారు.
టీడీపీతోనే బీసీల అభివృద్ధి: నాగుల్ మీరా
టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, చైతన్యవంతుల్ని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఎన్టీఆర్, చంద్రబాబుది మాత్రమే. వెనుక బడిన వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మారు.. చేసి చూపించారు. కార్పొరేషన్లు పెట్టిన జగన్ రెడ్డి, వాటి ద్వారా ఎంత మందికి మేలు చేశారో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాలకు జగన్ రెడ్డి ప్రత్యేక టీంను పెట్టినట్లున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ బీసీల ద్రోహి: పోతిన మహేష్
జనసేన పార్టీ విజయవాడ టౌన్ అధ్యక్షులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను కుదించిన జగన్ రెడ్డి.. బస్సు యాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లు సాధించుకోవడానికి పోరాటం చేయాలి. బీసీలకు 56 కార్పొరేషన్లు పెట్టినా, రూపాయి నిధులు ఇవ్వలేదు. విదేశీ విద్య లాంటి 30 పథకాలు రద్దు చేసి ఏం ఉద్దరించారు? సామాజిక వర్గాల గొంతు కోస్తూ.. సామాజిక న్యాయం అంటూ దగా చేస్తున్నారు. నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి నయా మోసానికి తెరలేపాడు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. బీసీలకు కేటాయించిన నిధుల్ని ఇతరుల కోసం ఖర్చు చేయడమేంటి? రూ. 75వేల కోట్ల నిధులు దారి మళ్లించడం దుర్మార్గం కాదా? చేనేతలు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు జగన్ రెడ్డి చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు. కులగణన పేరుతో ఎన్నికలకు ముందు మోసానికి తెరలేపాడు. కులగణన గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి, నాలుగున్నర సంవత్సరాల పాటు ఏం చేశాడు? ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. బీసీల బతుకుల్ని మార్చడంపై లేదు. తప్పుడు కేసులపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేకుండా పోయిందని మండిపడ్డారు.
టీడీపీ బీసీ సాధికార సమితి జోనల్ కో-ఆర్డినేటర్ రమాదేవి మాట్లాడుతూ… జగన్ రెడ్డికి తప్పుడు కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి చేయడం అనేది తెలియదన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల లాంటి నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టడమే కాకుండా.. అయ్యన్న లాంటి నేతపౖౖె అత్యాచారం కేసులు పెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి పరాకాస్ట అన్నారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో జనం తొక్కిపెట్టడం తధ్యమన్నారు.
విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పరబ్రహ్మం మాట్లాడుతూ… గతంలో రాజులుగా బతికిన స్వర్ణకారులు నేడు కూలీలుగా మారిపోయారన్నారు. కార్పొరేట్ వ్యాపారులు వచ్చాక వృత్తి ప్రమాదంలో పడిరది. వృత్తిపై ఆధారపడిన వారికి న్యాయం చేయాలి. వడ్రంగి పని చేసుకునే వారికి షాపులు అద్దెకు దొరకడం లేదు. పంచవృత్తుల వారికి కామన్ వర్క్ షెడ్స్ ఏర్పాటు చేయాలి. వృత్తి పనులు చేసే వారికి మెరుగైన శిక్షణ కల్పించి, ఆదాయం పెరిగేలా తోడ్పాటు అందించాలన్నారు.
నగరాల సంఘం నాయకులు నాబోతు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… బీసీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం దూరమేమీ కాదన్నారు. 50 శాతం రిజర్వేషన్లు అని చెప్పే జగన్ రెడ్డి పదవులు, పనుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే పదవులు దక్కించుకోవాలి. ఆర్థికంగా స్థిరపడాలి అందుకు ప్రభుత్వాతు తోడ్పాటు అందించాలన్నారు.
గౌడ సంఘం నాయకులు జోగి నాగేశ్వరరావు మాట్లాడుతూ… స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు రాజ్యాధికారం కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఉండటం దుర్మార్గమన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికాం మెరుగుపడిన పుడే అభివృద్ధి సాకారమవుతుంది. రాజకీయ పార్టీలు కులాన్ని అభివృద్ధి చేసేలా ప్రోత్సాహకాలు, తోడ్పాటు అందించాలి. బీసీల జనాభా లెక్కలు తేలితేనే అసలైన లబ్ధి అందుతుందన్నారు.
యాదవ సంఘం నాయకులు.. మూల కోటయ్య మాట్లాడుతూ… రాష్ట్రంలో, దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడటం మాని గొర్రెలు,మేకలకోసం పోరాడే పరిస్థితి రావటం దారుణ మన్నారు. బీసీ కార్పొరేషన్లను జగన్‌రెడ్డి నాశనం చేశా డు. ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా రూపాయి రుణం ఇవ్వలేదు. పైసా ప్రయోజనం కల్పించలేదన్నారు.
నగరాల సంఘం నాయకులు బాయిన శేఖర్ బాబు మాట్లాడుతూ… బీసీల్లోని చాలా కులాలు అసలు ప్రపంచానికే తెలియవన్నారు. ఉన్నారో లేరో అన్న పరిస్థితి ఉంది. అలాంటి వారిని గుర్తించేందుకు జనగణన జరగాలి. తద్వారా నిధులు ఇవ్వాలి. అభివృద్ధి బాటలో నడిపించాలన్నారు.
రజక సంఘం నాయకులు వలివేటి శ్రీనివాసులు మాట్లాడుతూ… మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు రజకులతో సంబంధం ఉంటుందన్నారు. కానీ వారి అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకునే చర్యలు శూన్యం. జగన్ రెడ్డి పాలనలో రజకుల హక్కులను నాశనం చేశాడు. అధికారాలు లాక్కున్నాడు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. రజకులను ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు.
వడ్డెర సంఘం నాయకుడు గంజి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… రాజకీయంగా అధికారాలు దక్కించుకోవడం ద్వారానే మా కులం బాగుపడుతుందన్నారు. క్వారీల్లో అవకాశాలు కల్పించాలి. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల్లో మరణించిన వారికి బీమా కల్పించాలని కోరారు.
తూర్పుకాపు సంఘం నాయకులు సారేపల్లి సత్యన్నారాయణ మాట్లాడుతూ… వెనుకబడిన తరగతులుగా నిలిచిపోయిన తూర్పు కాపులకు ఆర్ధిక పరిపుష్టి కల్పించాలన్నారు. ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు.
బీసీ సంక్షేమ సంఘం నాయకురాలు నూకాలమ్మ మాట్లాడుతూ… రాష్ట్రంలో మూడు కోట్లకు పైగా బీసీ జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.. కానీ ఆ మేరకు రాజకీయ అవకాశాలు ఎక్కడ అని ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ నిర్వీర్యం చేశారు. కార్పొరేషన్లు నాశనం చేశారు. రిజర్వేషన్లు కుదించారు. ప్రజాప్రతినిధులుగా ఎదగనీయకుండా తొక్కిపెడుతున్నారు. బీసీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు అంతు లేకుండా పోతోంది. రాజకీయంగా అవకాశాలు కల్పించాల్సింది పోయి.. అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సూరిబాబు మాట్లాడుతూ… గతంలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, ఆదరణతో పరికరాలు, సంగీత కాలేజీల్లో శిక్షణ అందేవన్నారు. ప్రస్తుతం అన్నీ నిలిచిపోయాయి. అభివృద్ధిని నాశనం చేసి అడుక్కుతినే పరిస్థితి కల్పించారు. దేవాలయాల్లో అవకాశాలు పెంచాలన్నారు.