.ఆయన కులంతో మీకేం పని… మీ డ్యూటీ ఎంటి?
.బిడ్డకు పాలిస్తుంటే ఇంట్లోకెళ్తారా… మానవత్వం లేదా?
.ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?
.సైకో పాలనలో మీరు కూడా సైకోల్లా మారిపోయారా?
.నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు
అమరావతి: సాంబశివరావును అక్రమంగా తీసుకెళ్లడమేగాక ఆయన కులం అడుగుతారా? కాపు కులంలో పుట్టి టిడిపికి ఎలా పనిచేస్తావని అడుగుతారా? ఇది సిఐడి పోలీసులు చేయాల్సిన పనేనా… అతడు ఏ కులం, ఏ జాతి అయితే మీకెందుకు? పోలీసు అధికారిగా మీ పనేంటి? కొట్టామని చెబితే మళ్లీ కేసులు పెడతామని బెదిరిస్తారా? అన్నారు. మీరు డిక్టేటర్లా…మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు సైకోలుగా మారుపోతున్నారు? సాంబశివరావు మా ఫ్రీలాన్సర్… సిఐడి పోలీసులు అతని ఇంటికెళ్లి నీచంగా ప్రవర్తించారు… ఆయన భార్య బిడ్డకు పాలిస్తుంటే బెడ్ రూమ్ లోకి ఇంటిలో వెళ్లి లాక్కువచ్చారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? మీకు మానవత్వం ఉందా? ఆడబిడ్డలపై గౌరవం ఉందా? డీజీపీ… ప్రజల తరపున అడుగుతున్నా సిబిసిఐడికి నేతృత్వం వహిస్తున్న గొప్ప ఆఫీసర్ సమాధానం చెప్పాలి.
.