నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అంచెలంచలుగా ఎదిగి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి స్థాయికి చేరిన అనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాభినందనలు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఎదురు దెబ్బలు, గెలుపోటములు ఎదుర్కొని నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించిన తీరు అనిర్వచనీయం. మీ యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశిస్తున్నాను.
కింజరాపు అచ్చెన్నాయుడు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు