.మందులు బ్యాన్ చేస్తామని హెచ్చరించిన యుఎస్ ఎఫ్‌డిఏ
.అరబిందో, హెటెరో ఫార్మాలు అవినీతిమయం
.కరోనా సమయంలో రెమ్డీసివర్‌తో వేలకోట్ల దోపిడీ
.దొంగల బండి బండారం బయలుచేసిన పట్టాభిరామ్
అమరావతి: గత మూడేళ్లుగా కల్తీమద్యంతో రాష్ట్రంలో పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్… ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా కల్తీకి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి బందిపోటు దొంగల ముఠా కల్తీమందుల వ్యాపారం యు.ఎస్.ఎఫ్.డి.ఏ (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) పరిశోధనలో బట్టబయలైందని తెలిపారు. అరబిందో ఫార్మా కల్తీ మందుల వ్యవహారంపై జనవరి 12, 2022 న యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు ఆ సంస్థకు రాసిన హెచ్చరిక లేఖను పట్టాభి విడుదల చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇసుక, మద్యం, మైనింగ్, అక్రమాలతో ధనదాహం తీరని జగన్ రెడ్డి తన బినామీ అరబిందో ద్వారా అత్యంత ప్రమాదకరమైన కల్తీమందులను విక్రయిస్తూ వేలకోట్లరూపాయల అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలు కాపాడే మందులు తయారుచేయాల్సిన అరబిందో ఫార్మా కంపెనీ ధనదాహంతో వారి ప్రాణాలతో చెలగాటమాడటం బాధాకరమని అన్నారు. విలేకరుల సమావేశంలో పట్టాభి ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
సెబీనుంచి కూడా అరబిందోకు హెచ్చరిక!
జగన్ రెడ్డి గ్యాంగ్ కల్తీ మద్యం వ్యవహారం బయటపడి రెండు రోజులు గడవక ముందే ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా జగన్ దొంగల ముఠా కల్తీకి పాల్పడుతున్న వ్యవహారం నేడు బట్టబయలైంది. అనారోగ్యంతో ఉన్న వారు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పులు చేసి మరీ మందులు కొని వాడుతుంటారు. అలాంటి మందుల్లో కూడా జగన్ రెడ్డి ముఠా కల్తీకి పాల్పడటం దుర్మార్గం. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా డ్రగ్ సర్టిఫికేషన్ లో ప్రామాణికంగా నిలుస్తున్న యు.ఎస్.ఎఫ్.డి.ఏ (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) పరిశోధనలో అరబిందో ఫార్మా కంపెనీలో కల్తీ మందులు తయారవుతున్నాయని సంచనల విషయాలు వెల్లడిరచింది. కల్తీకి పాల్పడుతున్న అరబిందో ఫార్మా చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బినామీ కూడా. ఏ2 విజయసాయి రెడ్డికి స్వయానా వియ్యంకుడు. గతంలో జగన్ రెడ్డి అరబిందో ఫార్మాకు రాష్ట్రంలోని మొత్తం అంబులెన్సుల వ్యవస్థను కట్టబెట్టి రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. యు.ఎస్.ఎఫ్.డి.ఏ అరబిందో ఫార్మాలో తయారయ్యే మందుల్లో కల్తీ జరుగుతున్నదని, కల్తీని నివారించకపోతే అమెరికాలో అరబిందో మందులను నిషేదిస్తామని హెచ్చరిక లేఖలు రాసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న సెక్యురిటీస్ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)… యు.ఎస్.ఎఫ్.డి.ఏ రాసిన లేఖపై అరబిందోను గట్టిగా ప్రశ్నించి ఇందులో వాస్తవాలను తమకు అందజేయాలని జూన్ 24 న లేఖ రాయడంతో ఈ కల్తీ మందుల వ్యవహారం బయటపడిరది. యు.ఎస్.ఎఫ్.డీ.ఏ అడిట్ డిస్ క్లోజర్స్ కు సంబందించి అరబిందోకు సెబీ చేసిన హెచ్చరికలు జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో ప్రచురితమయ్యాయి. అరబిందోలో తయారవుతున్న మందుల్లో కల్తీ జరుగుతున్న విషయాన్ని, యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు అరబిందోకు రాసిన వార్నింగ్ లేఖలను దాచిపెట్టిండంతో ఎక్సేంజీలో లిస్టెడ్ కంపెనీగా ఉన్న అరబిందోను సెబీ తీవ్రంగా హెచ్చరించింది. యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారి సూచనలు కూడా అరబిందో ఖాతరు చేయకపోవడాన్ని సెబీ తప్పుబట్టింది. దీనినిబట్టి జగన్ రెడ్డి దొంగల ముఠా ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి వాడే మందుల్లో కూడా ఎంత నిసిగ్గుగా కల్తీకి పాల్పడుతున్నరో అర్ధమవుతోంది.
మందులు బ్యాన్ చేస్తామని హెచ్చరికలు
యు.ఎస్.ఎఫ్.డి.ఏ క్వాలిటీ డైరక్టర్ ప్రాన్సిస్ గాడ్విన్ జనవరి 12, 2022 న అరబిందోకి రాసిన లేఖలో కల్తీకి సంబంధించి అనేక విషయాలు రాసారు. ఆగష్టు, 2021లో తెలంగాణ బోరపట్ల గ్రామంలోని అరబిందో ఫార్మా యూనిట్ ను పరిశోధించి అరబిందో ఫార్మా వారు ప్రోడక్షన్‌లో, ప్యాకేజింగ్ లో సి.జి.ఎం.పి. (కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు…. ్‌శీబతీ ఎవ్‌ష్ట్రశీసం, టaషఱశ్రీఱ్‌ఱవం శీతీ షశీఅ్‌తీశీశ్రీం టశీతీ ఎaఅబటaష్‌బతీఱఅస్త్ర, జూతీశీషవంంఱఅస్త్ర aఅస జూaషసఱఅస్త్ర సశీ అశ్‌ీ షశీఅటశీతీఎ ్‌శీ జGవీూ అని చాలా స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా అరబిందోలో తయారైతున్న ఏపీఐ (యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇన్ గ్రీడియంట్స్) లో కల్తీ జరుగుతోందని విస్పష్టంగా తెలిపారు. అరబిందో మందుల తయారీలో వాడుతున్న పదార్ధాలు ఫెడరల్ పుడ్, డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ – సెక్షన్ 501 (A) (2దీ) ప్రమాణాలకు లోబడిలేవని, కల్తీవని వారి లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు గుర్తించిన అంశాలపై అరబిందో వారు ఇచ్చిన సమాధానాలు సరిగా లేవని, వాటిని సరిదిద్దే ప్రయత్నం గానీ, వాటిపై కనీసం లోతైన విచారణ గానీ చేయలేదని లేఖలో ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మందుల ఉత్పత్తిలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు, చేపట్టాల్సిన కనీస నియంత్రణలు గానీ అరబిందో యాజమాన్యం పాటించడం లేదని యు.ఎస్.ఎఫ్.డి.ఏ తెలిపింది. అంతేకాకుండా తక్షణం దిద్దుబాటు చర్యలు పాటించకపోతే అరబిందో పార్మా చేసుకున్న కొత్త ప్రతిపాదనలను నిలిపివేయడమే కాకుండా అమెరికాలో అరబిందో మందులు ప్రవేశించకుండా నియంత్రిస్తామని యు.ఎస్.ఎఫ్.డి.ఏ తన లేఖలో హెచ్చరించింది.
ధనదాహంతో దేశప్రతిష్టను మంటగలిపారు!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ తమ సంస్థపై ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినందుకు అరబిందో సిగ్గుపడాలి. అరబిందో రాష్ట్ర ప్రతిష్టనే కాకుండా దేశ ప్రతిష్టను సైతం మంటగలిసిపోతోంది. తన బినామీ పీ.వి రాంప్రసాద్ రెడ్డికి చెందిన అరబిందో ఫార్మాలో జరిగిన కల్తీ మందుల వ్యవహారంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఇలాంటి కల్తీ మందుల కంపెనీjైున అరబిందోకు 108, 104 వాహనాల బాధ్యతలు అప్పచెప్పిన జగన్ రెడ్డిని ఏం చేయాలి? జగన్ రెడ్డి, తన బినామీలు జేబులు నింపుకోవడానికి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. జూన్ 20, 2019 న కూడా యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు అరబిందో ఫార్మాకు మరో లేఖ రాసారు. ఇందులో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్న అరబిందో ఫార్మా యూనిట్ లో సైతం కల్తీ పదార్ధాలు కనుగొన్నామని యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు హెచ్చరించారు. అయినా అరబిందో ఫార్మా తన పద్ధతి మార్చుకోలేదు. అదే తప్పుడు పనులకు పాల్పడుతుండటంతో యు.ఎస్.ఎఫ్.డీ.ఏ జనవరి 12, 2022న రెండవసారి హెచ్చరికలు జారీ చేసింది. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?
అరబిందో, హెటిరోలు అవతకవకల మయం!
జగన్ రెడ్డి బినామీ కంపెనీలైన అరబిందో ఫార్మా, హెటెరో ఫార్మాలు అవినీతిమయం. జగన్ రెడ్డి మరో బినామీ హెటిరో ఫార్మా పార్థసారధి రెడ్డి కరోనా సమయంలో రెమెడిసెవర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెటింగ్ చేసి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. వీటికి సంబంధించి పత్రికల్లో వివిధ శీర్షికలతో వార్తలు వెలువడ్డాయి. ‘‘నల్లబజారులో రెమెదెసెవర్’’, ‘‘మెడిసన్ మాఫియా’’, ‘‘బజారులో ధర 325 అయితే బ్లాక్ లో 50 వేల నుంచి లక్షా’’ అంటూ శీర్షికలతో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీటిని బట్టి కరోనా సమయంలో ప్రజలను ఏ రకంగా పీల్చిపిప్పిచేసి దోచుకున్నారో అర్థమవుతోంది. హైదరాబాద్ లోని హెటిరో ఫార్మా కంపెనీపై ఐటీ శాఖ వారు జరిపిన దాడిలో బీరువాలు బీరువాలు నోట్ల కట్టలు, అట్ట పెట్టెల్లో కరెన్సీ కట్టలు లభించాయి. ఒక్క బీరువాలోనే 5 కోట్లు కరెన్సీ కట్టలు దొరికాయి. పదుల సంఖ్యల్లోని బీరువాల్లో దాదాపు 142 కోట్ల రూపాయలు లభించాయి. జగన్ రెడ్డి తన దోస్త్ హెటెరో యజమాని పార్ధసారధి రెడ్డి కోసం కేసీఆర్ తో మాట్లాడి రాజ్యసభ సీటు ఇప్పించారు. కరోనా సమయంలో అత్యంత నీచంగా రెమెదెసెవర్ ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ చేసి కోట్లు దండుకున్న వ్యక్తిని రాజ్యసభకు పంపిన ఘనత జగన్ రెడ్డిదే. నేడు మళ్లీ అరబిందో ఫార్మా కల్తీ భాగోతం బయటపడిరది. తన బినామీ పీవీ రాంప్రసాద్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఏ1, ఏ2 లు అవినీతికి పాల్పడుతున్నారు. ట్విట్టర్ లో అసభ్యకరంగా.. ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై వ్యాఖ్యలు చేసే ఎ2 విజయసాయి రెడ్డి తన అల్లుడు కంపెనీ అరబిందో కల్తీ వ్యవహారంపై సమాధానం చెప్పాలి.
రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిన జె-గ్యాంగ్!
చంద్రబాబునాయుడు తాను తెచ్చిన ప్రతిష్టాత్మక సంస్థల ద్వరా రాష్ట్ర, దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడిరపజేశారు. జీనోమ్ వ్యాలీలో చంద్రబాబునాయుడు నాటిన మొక్క భారత్ బయోటెక్ ప్రపంచాన్ని గజగజలాడిరచిన కరోనాకు టీకాను కనుగొని కోవిద్ కు చెక్ పెడితే… అదే కరోనాను అడ్డుపెట్టుకొని ఫోర్ ట్వంటీ జగన్ బ్యాచ్ వేలకోట్లు దండుకొంది. ఇప్పుడు కల్తీ మందులతో ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర, దేశ పరువును దిగజార్చారు.. ఇసుక, మైనింగ్ లలో చేసిన అవినీతి సరిపోక చివరకు మెడిసన్స్ లో కూడా ఈ విధంగా కక్కుర్తి పడటం దారుణం. ధనదాహంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మనిషే కాదు. ఆధారాలతో మేం అడిగిన ప్రతిదానికి జె-గ్యాంగ్ సమాధానం చెప్పి తీరాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.