- సైకో జగన్ కు ధైర్యముంటే సాక్షి మీడియాకు ఎంత మొత్తంలో దోచిపెట్టాడో చెప్పాలి
- చిరుద్యోగులకు జీతాలు పెంచేందుకు మనసు రాదు, సాక్షి మీడియాకు మాత్రం విచ్చలవిడిగా ప్రకటనలు
- తప్పుడు కేసులతో లోకేష్‌ను జైలుకు పంపాలని సైకో జగన్ కుట్రలు
అమరావతి: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు గా జగన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజల సొమ్ము సాక్షి మీడియా పాలవుతోందని,పేదలకు అందించే ఆర్థిక సాయానికి ఉత్తుత్తి బటన్లు నొక్కుతున్న ముఖ్య మంత్రి.. నొక్కుడుతో పనిలేకుండానే సాక్షి పత్రికకు అడ్డగోలుగా దోచిపెడుతున్నాడని ఉత్తరాంధ్ర ప్రాం త టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సైకోరెడ్డి తన పుట్టిన రోజుని సాక్షి మీడియాకు పండుగరోజుగా మార్చాడని విమర్శించారు. ఏపీ లోని సాక్షి దినపత్రికలోనే కాకుండా.. తెలంగాణ ఎడిషన్లలో కూడా వచ్చేలా భారీ ప్రకటనలు ఇచ్చా డు. వైద్య ఆరోగ్యశాఖ పేరుతో.. ఇతరత్రా నేతల పేర్లతో జగన్ పుట్టిన రోజున సాక్షి మీడియాకు ఇచ్చి న ప్రకటనల్నీ ప్రజల సొమ్ముతో ఇచ్చినవే. ప్రజల ఓట్లను అవినీతి డబ్బుతో కొనాలన్న ఉద్దేశం తోనే జగన్‌రెడ్డి.. ఇలా ప్రకటనల రూపంలో ప్రభుత్వ సొమ్ముని తన పార్టీ వారికి ముందే చేరవేస్తున్నాడు. జగన్‌రెడ్డి సాక్షి పత్రిక, టీవీ ప్రారంభించినప్పటి నుంచీ ఒక్కరోజైనా వాటిద్వారా తనపార్టీ నేతల అవి నీతి.. దోపిడీల గురించి, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను ప్రజలకు తెలియచేశాడా? అలాచే శాడని ఆయన నిరూపిస్తే టీడీపీ నేతగా నేను కూడా జగన్ అవినీతి మీడియాకు ప్రకటనలు ఇస్తాను. సాక్షి టీవీతో పాటు.. ఇతర వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా జగన్ రెడ్డి దాదాపు రూ.3 వేల కోట్లు దోచిపెట్టాడని వెంకన్న విమర్శించారు.
చిరుద్యోగులకు జీతాలు పెంచడానికి మనసురాదు గానీ.. అంగన్ వాడీ సిబ్బందికి, ఆశావర్కర్లకు, పారిశుధ్య కార్మికులకు, తన మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థకు జీతాలు పెంచడానికి జగన్ రెడ్డికి మనసురాదు. కానీ వివిధ కారణాలు సాకుగా చూపి సాక్షి మీడియాకు వందల కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇవ్వడానికి మాత్రం జగన్ ముందుంటాడు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని రోడ్ల పై ఉన్న గోతుల్లో ఎక్కడా తట్ట మట్టి కూడా వేయని జగన్‌రెడ్డి.. ప్రజల సొమ్ముని తన బినామీలకు దోచి పెట్టడంలో మాత్రం ముందున్నాడు. ప్రజల సొమ్ము తో విషప్రచారం చేస్తూ ప్రజల్నే ఏమారుస్తూ తన పబ్బం గడుపుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు. విద్యాదీవెన పథకం తాలూకా సొమ్ముని నాలుగు విడతల్లో చెల్లిస్తున్న జగన్‌రెడ్డి.. సాక్షి మీడియాకు ఇచ్చే ప్రకటనల సొమ్ముని మాత్రం సింగిల్‌పేమెంట్ లో చెల్లిస్తున్నాడు. అమ్మఒడి పథకానికి ఇంత ఖర్చు పెట్టాను.. నాడు`నేడుతో విద్యారంగాన్ని ఉద్ధరించా ను అని వీరలెవల్లో ప్రచారం చేసుకుంటున్న జగన్ రెడ్డి.. ఈ నాలుగున్నరేళ్లలో సాక్షి మీడియాకు ఎంత ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టాడో తెలియచేస్తూ వాస్తవా లతో శ్వేతపత్రం విడుదల చేయగలడా? బుద్ధి ఉన్న వారు ఎవరైనా సాక్షి పత్రిక చదువుతారా అని జగన్ ను ప్రశ్నిస్తున్నాం. అలాంటి దినపత్రికకు ప్రజల సొమ్ము దోచిపెట్టడం జగన్ దోపిడీలో భాగమే. కేవ లం సాక్షి మీడియాకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలి స్తున్న జగన్.. ఇతర మీడియా సంస్థలకు.. దిన పత్రికలకు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి? సాక్షి దినపత్రిక అనేది కేవలం జగన్ చదువుకునే కర పత్రం తప్ప,ప్రజలు మనస్ఫూర్తిగా చదివే దినపత్రిక కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇతర పత్రికలు, ఛాన ళ్ల గురించి విషం చిమ్మే ముందు జగన్‌రెడ్డి సాక్షి పత్రిక, టీవీల పుట్టుక గురించి వాస్తవాలు మాట్లా డాలి. 420దినపత్రిక సాక్షిలో నిజాలు మాత్రమే రాస్తారని 420నాయకుడైన కొడాలి నాని నిరూపిం చగలడా? సైకో ముఖ్యమంత్రి… తన కక్ష సాధింపు ల కోసం పోలీస్ వ్యవస్థను, ఇతర అధికారుల్ని వేధిస్తున్నాడు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ రెండురోజులు బంద్ చేస్తే దేశవ్యాప్తంగా ఏపీ పోలీసులకు మంచి పేరు వస్తుందని వెంకన్న అన్నారు.
తప్పుడు కేసులతో లోకేష్‌ను జైలుకు పంపాలనే ఆలోచనలో సైకో జగన్ లోకేశ్‌ను కట్టడిచేయాలని.. యువగళం పాద యాత్రను అడ్డుకోవాలని సైకో ముఖ్యమంత్రి గతం లో అనేక రకాలుగా ఆలోచించాడు. చివరకు చంద్ర బాబుపై అక్రమ కేసులుపెట్టి ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టాడు. అలాచేస్తే లోకేశ్ పాదయాత్ర ఆపు తాడని జగన్ చుట్టూ ఉండే పరివారమే ఆయనకు సలహాలిచ్చింది. చంద్రబాబు జైలు నుంచి బయట కొచ్చాక లోకేశ్ పాదయాత్ర పున:ప్రారంభించడం.. నవశకం విజయోత్సవ సభ భారీగా దిగ్విజయం కావడంతో జగన్‌రెడ్డి ఓర్వలేక పోతున్నాడు. ఆ క్రమంలోనే లోకేశ్‌ను ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులోనో.. మరో కేసు లోనో జైలుకు పంపాలని ప్రయత్నిస్తున్నా డు. జగన్ ఎన్ని కుట్రలు..కుతంత్రాలకు పాల్పడినా అతనికి, అతని ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధమై పోయారు. వైసీపీ నేతలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్ రెడ్డిపై విరక్తితో ఉండబట్టే, వారికి టిక్కెట్లు రాకపోయినా సరే ఎవరూ నోరెత్తకుండా లోలోన సంతోషపడుతు న్నారు. తెలుగుదేశం పార్టీ బీ ఫారాలకు విలువ ఉం డబట్టే… ఆ పార్టీ టిక్కెట్ల కోసం అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కానీ వైసీపీ టిక్కెట్లు ఇవ్వక పోయినా తమకు పరవాలేదని, త్యాగాలకు రెడీ అని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే జగన్ బారి నుంచి తప్పించుకుంటున్నారు. ఈ 57నెలల పాలన లో జగన్‌రెడ్డి 10 జన్మలకు సరిపడా పాపం చేసి, తరతరాలకు సరిపడా ఆస్తులు దోచేశాడు.ఆ స్థాయి లో నేరం చేశాడు కాబట్టే, ఒక్కసారి జైలుకు వెళ్లా డంటే ఇక బయటకు రావడం అనేది ఉండదని వెంకన్న స్పష్టం చేశారు.