అమరావతి: క్యాంపు ఆఫీసుల పేరిట విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరి గింది.రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు,మాదాల శ్రీనివాస్ రావు తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌కు విచారణ అర్హతలేదన్నారు. పిల్ రూపంలో రావాల్సి ఉందని చెప్పారు. వాదనలకు మరో 20 నిమిషాలు సమయం కోరటంతో విచారణను 8వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.