అమరావతి : మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన ఆర్యవైశ్య యువకుడు నాగబాబును అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించడంపై తెలుగుదేశంపార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ తీవ్రంగా ఖండించారు. “నాగబాబు చెప్పిన విధంగా వెల్లంపల్లి 1500 కోట్ల రూపాయల దోపిడీని నిరూపించడానికి నేను సిద్ధం, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించు” అని సవాల్ విసిరారు. నీ అవినీతి చరిత్రను విజయవాడలోనే గాక యావత్ ఆంధ్రప్రదేశ్ లో మారుమూలకెళ్లినా జనం కథలుకథలుగా చెబుతున్నారు. విద్యావంతుడైన నాగబాబు ప్రజలు అనుకుంటున్నదే చెప్పారు… రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. వాస్తవాలు చెప్పినందుకే నాగబాబును అరెస్ట్ చేస్తారా అని డూండీ ప్రశ్నించారు. నాగబాబును అరెస్ట్ చేయడం కాదు… నువ్వు చేసిన అవినీతి, అక్రమాలపై జీవితాంతం నిన్నుజైల్లోనే ఉంచాల్సి వస్తుందని రాకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడతారా? ఎంతమందిపై కేసులు పెడతారు… ఎంతమందిని అరెస్ట్ చేయిస్తారని డూండీ రాకేష్ నిలదీశారు. నాగబాబు కేవలం ప్రశ్నించడంతోనే సరిపెట్టాడు… వెల్లంపల్లి ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించకపోతే త్వరలో విజయవాడ వీధుల్లో బట్టలు విప్పి రోడ్లవెంట తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి… ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని డూండీ రాకేష్ తీవ్రంగా హెచ్చంచారు.