- తనయుని గెలుపు కోసం తిరుపతిలో ఖర్చు చేస్తున్న ఛైర్మన్ భూమన
- కళ్లు మూసుకొని చోద్యం చూస్తున్న అడిషనల్ ఈవో ధర్మారెడ్డి
- ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్
అమరావతి, చైతన్యరథం: నిబంధనలకు విరుద్దంగా టీటీడీ నిధులు రూ.1233 కోట్లను తిరుపతిలోని వివిధ పనులకు దారి మళ్లిస్తున్నారని, ఇది రానున్న ఎన్నికల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడికి లబ్ది చేకూర్చేందుకే అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయ పాలెం విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలలలోపే భూమన కరుణాకర్‌రెడ్డి అక్రమంగా టీటీడీ నిధులతో తిరుపతి లో ఇంజనీరింగ్ వర్క్స్ చేపట్టేందుకు నిర్ణయించారని, టీటీడీ నిధులను తిరుపతి కోసం ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. తిరుపతి మున్సిపాల్టీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు వస్తుండగా… ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన టీటీడీ నిధుల ను రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఈవిధంగా తిరుపతిలో ఖర్చు చేసేందుకు పూనుకున్నారని తెలిపా రు. నిబంధనలకు విరుద్దంగా టీటీడీ నిధులను తిరుపతి లో వాడేందుకు తరలిస్తుంటే కస్టోడియన్‌గా ఉండాల్సిన అడిషనల్ ఈవో ధర్మారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఈ రాజకీయ దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. 2023`24 ఆర్ధిక సంవత్సరంలో టీటీడీ బడ్జెట్ 4,411 కోట్ల రూపాయలు కాగా ఇంజనీరింగ్ వర్క్స్ కోసం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిం చారని, అయితే ఎస్వీ సుబ్బారెడ్డి ఛైర్మన్ పదవి నుండి తొలగిపోయే సమయానికి అవి 542కోట్ల రూపాయల కు పెరిగిందని, ఇప్పుడు అదనంగా మరో 1233 కోట్ల రూపాయలను కేటాయించారని,ఈనిధుల కోసం టీటీడీ బడ్జెట్‌లోని ఏ ఇతర ఏ పనులపై ఖర్చు తగ్గించారని విజయ్ ప్రశ్నించారు. టీటీడీలో ఒక శాతం నిధుల్ని (రూ.44కోట్లు) వివిధ పనుల కోసం, మరో రూ.80 కోట్లను పారిశధ్యం కోసం తిరుపతి మున్సిపాలిటీకి ఇస్తామని టీటీడీ ప్రతిపాదించగా… ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం నిధుల కేటాయింపును వ్యతిరేకించిందని తెలిపా రు. అయితే పారిశుధ్యం పేరుతో రూ.80 కోట్లను ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు అక్టోబర్‌లో టీటీడీ తీర్మానం చేసిందని,ఇలా ఎందుకు చేశారో ధర్మా రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నా టీటీడీ నిధులను ఖర్చు చేయాల్సిన అవసరమేంటని విజయ కుమార్ నిలదీశారు. రూ.400 కోట్ల నిధులతో భక్తుల సౌకర్యార్ధం టీటీడీ నిధులతో ఇప్పటికే గరుడ వారధి నిర్మించి రద్దీ తగ్గించినా…తిరుపతి మున్సిపాల్టీ పారాశుధ్యానికి నిధులు కేటాయించడంపై ధర్మారెడ్డి స్పందించా లని ఆయన కోరారు.
టీటీడీ బడ్జెట్‌ను ధర్మారెడ్డి వైసిపి ఎన్నికల బడ్జెట్‌గా మార్చారని, టీటీడీ ఛైర్మన్ తన కొడుకు ఎన్నికల ప్రచా రానికి భక్తుల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే థర్మా రాడ్డి అందుకు తానతందాన అంటూ భూమాన కుటుం బానికి పొలిటికల్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూమాన అభినయ్‌రెడ్డి ఎన్నికల ఖర్చు కోసం వెచ్చించిన టీటీడీ నిధులు రూ.1237కోట్లను కూడా ఎన్నికల ఖర్చులో చూపాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈఐదేళ్లలో ఇంజనీరింగ్ వర్క్స్‌కు కేటాయించిన మొత్తం సొమ్ము..జరిగిన పనుల వివరాలు తెలియజేస్తూ ఆడిష నల్ ఈవో ధర్మారెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని నీలాయపాలెం విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.