చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

సదస్సులో ఏఐ సాంకేతికత ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన సీఎం

చైతన్యరధం by చైతన్యరధం
February 21, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టెక్ నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి అతిపెద్ద వనరు
  • ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్‌లో భాగస్వామ్యం
  • ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
  • సదస్సులో ఏఐ సాంకేతికత ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన సీఎం

ఢిల్లీ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని పిలుపునిచ్చారు. ఏపీకి టెక్ నైపుణ్యాలున్న యువశక్తి అతిపెద్ద వనరని వ్యాఖ్యానించారు. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని సీఎం వెల్లడించారు. ఢిల్లీలోని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్`2026లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్ మండపంలో ఉన్న ఏపీ పెవిలియన్‌లో ఆడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్ కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

వీరితోపాటు లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ ఖోస్లా సీఎంతో భేటీ అయ్యారు. ఏపీలో సౌర విద్యుత్ సహా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై సౌదీ ఆరామ్ కో ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించాలని సౌదీ ఆరామ్ కోను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వివరించారు. డౌన్ స్ట్రీమ్ పరిశ్రమలతో సహా సమగ్రమైన ఎకోసిస్టమ్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. ప్రముఖ టెక్ కంపెనీ ఆడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతనూ నారాయణ్‌తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఏపీని నాలెడ్జి హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని ఏపీలో క్వాంటం కంప్యూటింగ్, డేటా సెంటర్లు, డ్రోన్, స్పేస్ సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్‌వంటి అంశాలపై భవిష్యత్ కార్యాచరణను సీఎం ప్రస్తావించారు. వచ్చే 25 ఏళ్లపాటు దేశానికి, రాష్ట్రానికి అతిపెద్ద వనరుగా యువశక్తి మారనుందని సీఎం వివరించారు. క్రియేటర్ ఎకానమీని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని అన్నారు. విద్యార్ధులు, నిపుణులకు మరింత నైపుణ్యాలను అందించేలా ప్రత్యేకంగా క్రియేటర్ సాఫ్ట్ వేర్‌ను అందించనున్నట్టు శాంతనూ నారాయణ్ తెలిపారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్‌తో పాటు పౌరసేవల డిజిటలైజేషన్ అంశంపై కూడా ఇరువురి మధ్యా లోతైన చర్చ జరిగింది.

ఏఐ లివింగ్ ల్యాబ్స్‌తో నైపుణ్యం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఎన్విడియా సంస్థ సహకారం అందించాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాలిస్టారెడ్మెండ్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలని కోరారు. అలాగే ఐఐటీ తిరుపతి, ఐఐఎసఈఆర్ తిరుపతితో కలిసి ఏపీ ఫస్ట్ కార్యక్రమంలో భాగస్వామి కావాలన్నారు. ఏపీలో డిజైన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కోసం ఏపీలో జీసీసీ అభివృద్ధి చేయాలని ఆటోడెస్క్ సీఈఓ మైక్ హేలీని ముఖ్యమంత్రి కోరారు. క్వాంటం టెక్నాలజీకి అనుగుణంగా అమరావతిలో ఇన్నోవేషన్ అకాడెమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్‌ను ముఖ్యమంత్రి కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి నూతన ఆవిష్కరణలను తీసుకురావటంతో పాటు విశాఖలో లెగోల్యాండ్ కల్చరల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో పౌరసేవలతోపాటు స్మార్ట్ గవర్నెన్సు అంశాల్లో ఏఐ సొల్యూషన్స్ అందించే అంశంపై క్వాంటెలా ఇంక్ చైర్మన్ శ్రీధర్ గధితో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ డిజిటల్ ఏఐ రీజినల్ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందాని కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

సమ్మిట్‌లో ఏఐ సాంకేతికతను పరిశీలించిన సీఎం
పారిశ్రామిక వేత్తలతో భేటీ అనంతరం భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మింట్‌లోని వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఎన్విడియా, నేయసా, టాటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ సహా వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఏఐ వినియోగం, వస్తున్న ఫలితాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏఐ సమ్మిట్‌లో టాటా సంస్థ ఏపీలో అమలు చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం సంజీవని, డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రదర్శించింది. రోబోటిక్స్, ఏఐ డ్రివెన్ సేవలకు సంబంధించిన యూజ్ కేసెస్‌ను సీఎం ఆసక్తిగా తెలుసుకున్నారు.

Previous Post

కుటుంబ విలువల ప్రతిబింబం..లోకేష్ ఆతిథ్య సంప్రదాయం

Next Post

వైసీపీ ఘోర అపచారం

Next Post
వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.