- బిక్కవోలు-దువ్వాడ మధ్య 3, 4 బ్రాడ్ లైన్లు
- 45 మాసాల్లో పూర్తి చేయడమే లక్ష్యం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో మరో భారీ రైల్వే ప్రాజెక్టు కు దక్షిణ కోస్తా రైల్వే టెండర్లను ఆహ్వానించింది. రూ.4,299 కోట్లకు పైగా విలువ చేసే బిక్కవోలు-దువ్వాడ మధ్య 3, 4 బ్రాడ్ లైన్ల నిర్మాణానికి ఈపీసీ కాంట్రాక్టుకు ఆహ్వానం పలికిం ది. 151.08 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే ట్రాక్‌లు నిర్మాణానికి ప్రతిపాదించింది. బిక్కవోలు-దువ్వాడలను కలుపుతూ సామర్ల కోట మీదుగా ఈ రైల్వే లైన్ మ్యాపింగ్ చేశారు. తుని, అనకాపల్లి ప్రస్తుత స్టేషన్లను బైపాస్ చేస్తూ ఈ రైల్వే లైన్ రూపుదిద్దుకుం టుంది. 45 మాసాల్లో ఈ రైల్వేలైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల న్నది లక్ష్యంగా నిర్ణయించారు. దీనివల్ల విజయవాడ-విశాఖ మెయిన్‌లైన్ మీద రద్దీని తగ్గించేందుకు వీలు కానుంది. ఈ విస్తరణ వల్ల సరకు రవాణా రైళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ పనులతో పాటు, విద్యుదీకరణ, కవచ్ పనులు ఇమిడి ఉన్నాయి. అనకాపల్లి-కొత్త వలస కొత్త బ్రాడ్ గ్రేజ్ లైన్‌కి ఈ ట్రాక్‌లను అనుసంధానం చేయనున్నారు.
దక్షిణ కోస్తా పరిధిలో విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ల ట్రాక్‌లో ఇది పెద్ద పురోగతికి కారణం కానుంది. ప్రీ బిడ్ కాన్ఫరెన్స్‌ను డిసెంబరు 23న నిర్వహించ నున్నారు. 2027 ఫిబ్రవరి 15 వరకు టెండర్ల దాఖలుకు అను మతిస్తారు. నాలుగు సంస్థలతో కూడిన కన్సార్టియం కూడా ఈ పనులకు ఏక మొత్తంగా టెండర్ దాఖలుకు అవకాశం కల్పించా రు. చెన్నై- కోల్‌కతా ప్రధాన మార్గంలో ఉన్న ఈ ట్రాక్‌పై రైళ్ల రాకపోకల ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. పెరిగిన ప్రయాణికుల రైళ్లకు తోడు సరకు రవాణా కూడా పెరగడంతో ట్రాక్‌లన్నీ చాలా రద్దీగా మారాయి. ప్రస్తుతం ఉన్న రెండు ట్రాక్‌లు సరిపోవడం లేదు. మూడు, నాలుగు ట్రాక్‌లు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని ప్రతిపాదించింది.



















