చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఏపీ వేగం దేశానికే ఆదర్శం

ఎంఓయూలు, ఎసఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

చైతన్యరధం by చైతన్యరధం
May 22, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీ వేగం దేశానికే ఆదర్శం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సెప్టెంబరుకల్లా ప్రాజెక్టుల గ్రౌండింగ్
  • 2028నాటికి ప్రాజెక్టులు ప్రారంభించేలా కార్యాచరణ
  • మంత్రుల కమిటీ, అధికారులకు ససీఎం లక్ష్య నిర్దేశం
  • పెట్టుబడిదారులకు సింగిల్ పోర్టల్ ద్వారా సేవలు
  • భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం
  • గోవా ప్లస్‌గా సూర్యలంక బీచ్ -త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
  • 23 నెలల్లో 756 ప్రాజెక్టులు, రూ.21.64 లక్షల కోట్ల పెట్టుబడులు
  • రాష్ట్ర యువతకు 21.20 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలు
  • ఎంఓయూలు, ఎసఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని, డిసెంబర్ 2028 కల్లా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రుల కమిటీ, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’ విధానాన్ని ఆచరణలో చూపాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎసఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంఓయూల స్థితిగతులు, ప్రాజెక్టుల పురోగతిపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలు, ప్రస్తుత కార్యాచరణ, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ 23 నెలల్లో రూ.21,64,258 కోట్ల విలువైన మొత్తం 756 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, వీటితో 21,20,567 ఉద్యోగాలు వస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు రంగంలో ఏవియేషన్ ప్రాజెక్టులను ఆకర్షించేలా చర్యలు చేపడతామని లోకేష్ చెప్పారు. పెట్టుబడుల సాధనలో దేశంలోనూ, ప్రైవేటు రంగంలోనూ ఏపీ పేరు మార్మోగుతోందని, ఎంఎసఎంఈల అనుమతులు, ఇతర వివరాలను త్వరలోనే వెబ్‌సైట్ ద్వారా అందిస్తామని లోకేష్ తెలిపారు.

21 ప్రధాన ఆలయాలతో టెంపుల్ టూరిజం సర్క్యూట్

ప్రాజెక్టుల గ్రౌండింగ్, అనుమతుల వివరాలు, ఉద్యోగాల కల్పనపై సింగిల్ పోర్టల్‌లో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూ కేటాయింపుల్లో మొదటగా పర్యాటక ప్రాజెక్టులకు, తర్వాత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. టూరిజం, ఐటీ లాంటి ప్రాజెక్టులకు వినూత్నంగా మల్టీ పర్పస్ భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచన చేయాలని సూచించారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్‌ను గోవా ప్లస్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేయాలని, బాపట్ల బీచ్‌కు త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏపీలోని 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం ప్రాజెక్టు వేగంగా చేపట్టాలన్నారు. ఐటీ ప్రాజెక్టులు తమ కార్యకలాపాలు 18 నెలల్లో ప్రారంభించేలా చూడాలని స్పష్టం చేశారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ తయారీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

నౌకా నిర్మాణ రంగంలో విస్తృత అవకాశాలు

ట్రాన్స్‌మిషన్‌తోపాటు సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏపీ నిర్దేశించుకున్న 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలని సీఎం అన్నారు. అయితే ఇప్పటికే 99 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు త్వరితగతిన ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం అన్నారు. 2027 డిసెంబరు నాటికి 46 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించేలా నిరంతరం పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మాణం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు. నౌకా నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. గడచిన 30 ఏళ్లుగా ఏపీలో భూసేకరణ గురించి వివాదాలు ఏర్పడలేదని… రైతులకు, పరిశ్రమలకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా భూ సేకరణ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

పర్యావరణహితంగా ప్రాజెక్టులు

రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పర్యావరణ హిత టెక్నాలజీ వినియోగించాలని సీఎం సూచించారు. తీరప్రాంతాల్లో సముద్రంలోకి కాలుష్య కారకాలను విడిచిపెట్టకుండా చూడాలని అన్నారు. సూర్యలంక, నెల్లూరు మైపాడు వంటి బీచ్ ప్రాంతాల్లో పరిశుభ్రమైన పరిస్థితులు ఉండాలన్నారు. కాలుష్యాన్ని సముద్రంలోకి విడిచిపెడితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేసే విషయంలోనూ త్వరితగతిన కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎంఎసఎంఈ రైట్ టు బిజినెస్ యాక్ట్ వెంటనే అమల్లోకి తీసుకురావాలని… నమోదు చేసుకుని పరిశ్రమ ప్రారంభించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. పరిశ్రమలు, ఎంఎసఎంఈల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెట్టాలని.. ప్రొడక్ట్ పర్‌ఫెక్షన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రాజెక్టులను సాకారం చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అన్నారు.

ఎసఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో 114 గ్రౌండింగ్

రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొత్తం 282 ప్రాజెక్టులకు ఎసఐపీబీ ఆమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.32 లక్షల కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.72 లక్షల కోట్లు, 2026-27లో (ఈ నెల వరకు) రూ.2.39 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటిలో ఇప్పటికే 114 గ్రౌండింగ్ అయ్యాయి. 2026 సెప్టెంబర్ నాటికి అన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్ లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకోసం పర్యావరణం సహా ఇతర అనుమతులు, విద్యుత్తు, నీరు, రహదారులు వంటి మౌలిక వసతులు, భూముల రిజిస్ట్రేషన్, స్థానిక సమస్యల పరిష్కారం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. బీపీసీఎల్, ఇండోసోల్, శ్రీ సిటీ ఫేజ్-2 వంటి ప్రాజెక్టులకు భూసేకరణ అత్యంత వేగంగా కొనసాగుతోందని, బీపీసీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన సుమారు 3,000 ఎకరాల్లో 2,000 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కేవలం మూడు రోజుల్లో పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు.

అంశాల పరిష్కారానికి మంత్రుల కమిటీ కృషి

పరిశ్రమల గ్రౌండింగ్ వేగవంతం కోసం మంత్రుల కమిటీ కృషి చేస్తుండగా, విదేశాల నుంచి రాష్ట్రంలో ఏర్పాటు చేసే పెట్టుబడుల వివరాలను ఈడీబీ సేకరిస్తోంది. అన్ని శాఖల పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు ఐటీ పోర్టల్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రాజెక్టుల వేగవంతమైన గ్రౌండింగ్ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు చేపట్టేలా చూడాలని మంత్రుల కమిటీకి సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Previous Post

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగాలి

Next Post

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

Next Post
స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.