అమరావతి(చైతన్యరథం): విశాఖపట్నంలో ఎస్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్రావు అప్పులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమిస్తూ పోలీసు సోదరులు శాంతి భద్రతలు కాపాడుతున్నారు. వారికి రావాల్సిన టిఎ, డిఎ, అరియర్స్, అత్యవసర సమయంలో అందాల్సిన ఆరోగ్య భద్రత రుణాలు, రీయింబర్స్మెంట్ సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ లీవ్ బకాయిలు కూడా నెలల తరబడి ఇవ్వకుండా వేధించడం విచారకరం. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ శంకర్రావు స్మృతికి నివాళులర్పిస్తూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు సోదరులను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.