అమరావతి: రాష్రంే లో కనీవినీ ఎరుగని రీతిలో మరో భారీ కుంభకోణానికి జగన్ రెడ్డి అండ్ కో తెరలేపింది. రాష్ట్రభవితను నిర్ణయించే గ్రూప్-1 పోస్టులను సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలోని దొంగలు వేలంపాట పెట్టేశారు. ఒక్కో పోస్టును దాదాపు 50కోట్లరూపాయల చొప్పున దాదాపు 5వేల కోట్లరూపాయలకు గ్రూప్ -1 పోస్టులను తమ మందిమాగదులైన కొందరికీ అమ్ముకున్నారు. చేతివాటంలో సిద్ధహస్తులైన జగన్ రెడ్డి అండ్ కో తమ అక్రమ సంపాదన కోసం గ్రూప్-1 పోస్టులను సైతం వదల్లేదు. గతంలో చైర్మన్ గా ఉన్న ఉదయ భాస్కర్ ను డమ్మీగా చేసి తాడేపల్లి ప్యాలెస్ కు నమ్మకస్తుడైన ఒక మెంబర్ ను అడ్డుపెట్టుకొని ఈ వ్యవహారమంతా నడిపినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఎపిపిఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ ను నియమించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎపిపిఎస్సీ కార్యాలయం ముఖం చూసిన పాపాన పోలేదు. ఎపిపిఎస్సీలో రింగ్ మాస్టర్ గా వ్యవహరించే జగన్ రెడ్డి అనుచరుడైన సభ్యుడే ఇప్పటికీ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. గ్రూప్-1 పరీక్షలు మొదలుకొని మూల్యాంకన, ఇంటర్వ్యూలను సైతం ప్రహహనంగా మార్చేందుకు జె-గ్యాంగ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్నిదార్లు తొక్కింది. గ్రూప్-1 పోస్టులకు త్వరలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలను సైతం ప్రహసనంగా మార్చేందుకు జగన రెడ్డి అండ్ కో పన్నాగం పన్నింది. గ్రూప్-1 మెయిన్స్ కు 7వేలమంది పరీక్షలు రాయగా, 325 మంది అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు ముందుగా తెలియజేయకుండా అకస్మాత్తుగా థర్థ్డ్ పార్టీతో డిజిటల్ మూల్యాంకన చేయించడంతో అనుమానం వచ్చిన ప్రతిభగల అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్ గా పేపర్లు దిద్దాలని తీర్పువచ్చింది. కోర్టు తీర్పు తర్వాత ఎపిపిఎస్సీ మ్యాన్యువల్ గా మూల్యాంకన చేయించడంతో దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెల్లడయ్యాయి. డిజిటల్ మూల్యాంకనలో ఎంపికైన 325మందిలో మాన్యువల్ మూల్యాంకనలో కేవలం 124మందిని ఎంపికయ్యారు. డిజిటల్ విధానంలో ఎంపికైన వారిలో 201 మంది డిస్ క్వాలిఫై కావడం చూస్తే పెద్దఎత్తున అవకతవకలు సాగినట్లు స్పష్టమవుతోంది. ఇదిలావుండగా పరీక్షలు నిర్వహించే సమయంలో కొందరు అభ్యర్థులతో ఎపిపిఎస్సీలో చక్రం తిప్పే ఒక నేత పోస్టుకు 50కోట్లరూపాయలు తీసుకొని అభ్యర్థులను ఎంపికచేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎంపికైన అభ్యర్థుల్లో అధికంగా నెల్లూరు, కాకినాడల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికైనట్లు సమాచారం. కొందరు అభ్యర్థులను పరీక్షలన్నీ ఒకేచోట కాకుండా వేర్వేరుచోట్ల రాయించారన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో డిజిటల్ మూల్యాంకనలో డిస్ క్వాలిఫై అయిన కొందరు ప్రతిభగల అభ్యర్థులు తర్వాత ఐఎఎస్, ఐపిఎస్ లకు సైతం ఎంపికయ్యారు. దీనినిబట్టి జగన్ రెడ్డి అండ్ కో ఒక పథకం ప్రకారమే ఎపిపిఎస్సీ పరీక్షలను ప్రహసనంగా మార్చింది. తాజాగా ఇంటర్వ్యూల్లో పెద్దఎత్తున గోల్ మాల్ చేసేందుకు జె-గ్యాంగ్ ఏర్పాట్లు చేసుకుంది. గతంలో ఒకే బోర్డులో నిర్వహించే ఇంటర్వ్యూలను ప్రస్తుతం మూడు బోర్డుల్లో నిర్వహించే ఎపిపిఎస్సీ మెంబర్లు బేరసారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉన్నత విద్యావంతులైన గ్రూప్ -1 అభ్యర్థుల భవితను ఇంటర్వ్యూల్లో జగన్ రెడ్డి ఆశీస్సులతో నియమితులైన అక్షరజ్జానంలేని అభ్యర్థులు నిర్ణయిస్తారన్నమాట. పోస్టుకు 50కోట్లరూపాయల చొప్పున సుమారు 5వేల కోట్లరూపాయలు చేతులు మారిన ఈ కుంభకోణంపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపితే అసలు నిజాలు వెల్లడయ్యే అవకాశముంది. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్నాయి. పూర్తి వివరాలు అందాక ఈ విషయాన్నంతనికీ కేంద్రప్రభుత్వంతోపాటు దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది.
హర్యానాలో ఏం జరిగింది?
హర్యానాలో 2008 జూన్‌లో 3206 మంది బేసిక్ టీచర్ల అపాయింట్‌మెంట్‌లో మాజీ సిఎం చౌతాలాతో పాటు మొత్తం 53 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. చౌతాలా కుమారులైన అభయ్ సింగ్, అజయ్ సింగ్‌లపై కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విడిగా విచారణ జరిపారు. 2013 జనవరిలో ఢిల్లీ న్యాయస్థానం చౌతాలా. ఆయన కుమారుడు అజయ్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకుని 2021 జులై 2న చౌతాలా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. చౌతాలాకు అక్రమాస్తుల కేసులో తాజచాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోకదళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు మే 27వ తేదీన నాలుగేళ్ల జైలుశిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా న్యాయమూర్తి వికాస్ ధుల్ ఆదేశించారు. తీర్పు సమయంలో చౌతాలాలో కోర్టురూంలోనే ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చౌతాలా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు. 1999 జులై 24 నుంచి 2005 మార్చ్ 5 మధ్య చౌతాలా, ఆయన కుటుంబ సభ్యులు 1,467 కోట్ల రూపాయలు కూడబెట్టడమే కాక, వేల ఎకరాల భూములు కబ్జా చేసినట్లు సీబీఐ గుర్తించి ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. 43 స్థిరాస్థులతో పాటు అక్రమంగా కూడబెట్టిన నగదు, నగల గురించి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది.