ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అంటూ ఊదరగొట్టిన జగన్‌రెడ్డి..పేదలు అనుభవిస్తున్న అసైన్డ్ భూములకు హక్కులు కల్పి స్తానంటూ రైతులకు మాయమాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల విలు వైన అసైన్డ్ భూములపై వైకాపా నేతలు గద్దల్లా వాలిపోయి నిలువునా మోసం చేశారు. ఇచ్చిన హామీలను అమలుచేయకు పేదలను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ ప్రభుత్వం అంతటితో ఆగకుండా అనుచరులతో భయపెట్టి చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారి భూములనే కారు చౌకగా లాక్కుని రాబందుల్లా పీక్కుతిన్నారు.
1.13 లక్షల ఎకరాలు హాంఫట్
జగన్ రెడ్డి హయాంలో జీవో 506లో పేర్కొన్న మార్గదర్శకాలను తప్పుదోవ పట్టించి తన సొంత జిల్లా కడపలో 1,007 ఎకరాల అసైన్డ్ భూములను అడ్డగోలుగా దోచిన విష యం అందరికి తెలిసిందే. అలా రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలకు ముందు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 1.13 లక్షల ఎకరాల భూములను వైసీపీ నేతలు చెరబట్టారు. అయితే కీలకమైన చట్టసవరణ ద్వారా 1.12 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను దోచేసుకున్నారని కూటమి సర్కార్ గుర్తించింది. జగన్‌రెడ్డి హయాంలో రెవెన్యూ శాఖలో చేసిన దారుణాలను వెలుగులోకి తెచ్చింది. జీవో 596కి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు, అడ్డగోలుగా నిషేధ జాబితా నుంచి బయటకు తీశారని స్పష్టమైంది.
వైకాపా పెత్తందారుల కబ్జాలు
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైకాపా పెత్తందారులు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కులు కల్పనపై నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముం దుగానే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాల అసైన్డ్ భూములు వైకాపా నేతల కబందహస్తాల చేతుల్లోకి వెళ్లాయి. మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. 2003కు ముందు నగర, పట్టణ శివార్లలో ప్రభుత్వం ఇచ్చిన సాగు భూములలో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో ఇప్పుడు భారీగా ధరపలుకుతున్నా యి. ఉమ్మడి విజయనగరం, విశాఖ, కడప ఇలా చాలా జిల్లాల్లో అసైన్డ్ భూములకు ధరలు పెరిగాయి. వీటిని అమ్ముకునేందుకు వీలుగా గత ఏడాది అక్టోబర్ 27న జగన్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన వైకాపా పెద్దలు, ఉన్నతాధి కారులు పథకం ప్రకారంగానే అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అసైన్డ్ భూముల రైతులను ముందే సంప్రదించి స్వల్ప మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పనపై నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల ఎకరాలను నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. ముందే భూములు చేజిక్కించుకున్న వైకాపా నేతలు, అధికారులు వెంటనే తమ పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. ఇలా 20 వేల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు గత ఏడాది డిసెంబరు 19న జారీ చేసిన జీవో 596 ప్రకారం చకచక జరిగిపోయాయి.
దౌర్జన్యంతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు
విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కలిపి సుమారు 500 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో విజయనగరం జిల్లాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు 180 ఉన్నా యి. విశాఖనగరంలోని ఆనందపురం, బీమునిపట్నం, పద్మనాభం, అనకాపల్లి జిల్లా చోడవ రం, మాడుగుల, అచ్యుతాపురం ఇతర చోట్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. సత్యసాయి జిల్లాలో 4127 ఎకరాలు, అన్నమయ్య జిల్లాల్లో 3330 ఎకరాలు, ప్రకాశంలో 2392, వైఎస్సార్ జిల్లాల్లో 2027, తిరుపతి జిల్లాల్లో 1814, నంద్యాల జల్లాలో 1494, చిత్తూరు జిల్లా 1269 ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాస్తవానికి భూములు కొనుగోలు చేయాలంటే క్రయ విక్రయదారుల మధ్య ఒప్పందాలు అడ్వాన్సుల చెల్లింపుల తర్వాత రెండు, మూడు నెలలకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెలువడడానికి ముందే ఒప్పందాలు జరిగినట్లు రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. 20 ఏళ్లకు ముందే అసైన్డ్ చేసిన వ్యవసాయ భూములను అమ్ముకునే వెసులుబాటును 2023 జూలై 31 నుంచి అమలులోకి తెస్తూ గత వైకాపా ప్రభుత్వం అక్టోబరు 27న గెజిట్ జారీ చేసింది. ఆ వెంటనే వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగిపోయాయి. అప్పటి వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి ప్రభుత్వ పెద్దలను మెప్పించడానికి పేద ప్రజల భూములను దోచుకునే ఈ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సులభతరం చేస్తూ స్వామి భక్తి ప్రదర్శించారు. అసైన్డ్ భూమిపై యాజమాన్య కల్పనకు సంబందించిన చర్యలు ఆయన హయాంలోనే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను హడావుడిగా పూర్తిచేశారు. తక్కువ ధరకు పేదల నుంచి కొట్టేసిన అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్‌లో వైకాపా నేతలకు, ఉన్నతాధికారులకు త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేసేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ కుట్రపూరితంగా వ్యవహరించిందన్న ఆరోపణలు న్నాయి. వెబ్ ల్యాండ్ ఆధారంగానే వ్యవసాయ భూములకు క్రయ విక్రయాలు జరుగుతు న్నాయి. ప్రాధాన్యం కలిగిన వెబ్‌ల్యాండ్ వివరాలు పరిశీలించకుండానే కలెక్టర్ల నుంచి అందే జాబితా ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణాల జోలికి వెళ్లవ ద్దని ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అనుమానాలు కలిగిస్తోంది.
అసైన్డ్ భూములు భారీగా చేతులు మారిన జిల్లాలు
జిల్లా ఎకరాలు
అన్నమయ్య 63,218
నంద్యాల 16,447
శ్రీ సత్యసాయి 12,245
తిరుపతి 4,698
చిత్తూరు 4,585
ప్రకాశం 3,643
కడప 1,007
అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపవద్దన్న గత ప్రభుత్వ అధికారి
నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 2024 జనవరి 13న జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ అదే నెల 13,17, 25 తేదీల్లో మొత్తం మూడు మెమోలు జారీ చేశారు. కొర్రీలు వేసి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపవద్దని దీని సారాంశం.. జిల్లా కలెక్టర్ల నుంచి రిజిస్ట్రార్లకు అందిన అసైన్డ్ భూముల కాలమ్ వద్ద ఫ్రీ హోల్డ్ పట్టా భూమి అని పేర్కొన్నారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఆటంకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న వివరాలను కూడా పరిశీలించకుండా కలెక్టర్ల జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ లెక్క చెప్పాలని…వాటిని నిశితంగా పరిశీలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాడు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూములను జలగల్లాగా పట్టి పీడిరచి దోచుకు న్న స్కామ్‌ను బయటకు తీసి కూటమి ప్రభుత్వం వేగవంతంగా విచారణ చేపట్టి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోంది.
టి.నిర్మలాజ్యోతి, అనలిస్ట్